ఖండిత వనం – 2
రచన :నూతక్కి రాఘవేంద్ర రావు 
26-07-2009 
 
వాళ్ళెవరోవచ్చి నా పెరటి  చెట్లను నరికేస్తుంటే  
పలు పలు అంతస్తుల
భవన సముదాయాల 
 విద్యత్ అవసరాలు తీర్చే మిషతో
నా పచ్చని పెరటి  చెట్లన్ని నరికేస్తుంటే
 రోదిస్తూ నా ఖండిత వన ప్రాంగణం …
నేను చెట్లు నాటిన నాడు
కొవ్వొత్తులతో, ఆయిలు దీపాలు  
కిరసనాయిలు లాంతర్ల 
గుడ్డివెలుగుల్లో
నగర కాలుష్యపు వాయువులు  
ఆకసాన  ప్రతిఫలించే   కాంతుల్లో  
దోమల ముసురుల్లో
రోజులు నెలలు వత్సరాలు …..
అయినా ఆనందంగా …….
యిప్పుడు నా చుట్టూ 
ఆ రోజుల్లో ఆలోచనకైనా
అందని భవన సముదాయాలు . 
కనుచూపు మేర కనిపించని విద్యుత్ స్థంభాలు,వాహకాలు
ఈ రోజున నా వనాన్ని చిద్రం చేస్తూ ….
నా మనసును విచ్చిన్నం చేస్తూ….