ఆగస్ట్ 2009


 స్వీయాంకిత

( రాతి (ఇసుక) పలుకు )

 రచన:నూతక్కి రాఘవేంద్ర రావు

తేది :31-08-2009

తద్భవనాంతర్గత

నిర్మాణంలొ

 ఆ మహా భవనపు

 పునాదియందు

నదీ గర్భపు ఆనకట్టలో

రహదారుల నిర్మాణంలో

 అట్టడుగున పడి యున్నయట్టి

ఓ పురాతన శిలా ఛిద్రాన్నినేను

సముద్రపు లోలోతుల

అధోతలంలొ

 నదీ నదాల్లో

కొండల్లో ఎడారులందూ

పంట పొలాలలో

ధరిత్రి తనువున

 అణువు అణువున

 రేణువులా ఎల్లెడలా

ఓ వుపగ్రహంలా

 గ్రహ శకలం లా

ఎక్కడో అంతరిక్షాన

 మానవ జీవన

ప్రగతి పధ నిర్మాణానికి

 నా వంతుగ నాకై

….నేనంకితమై

చిరు చలనం

 రచన :నూతక్కి రాఘవేంద్ర రావు

 తేది :25-08-2009

ఏ క్షణమో

క్షణ కాలం

శరీరంతర్భాగంలో

 ఏ కొననో

 వ్యధా భరిత

వేదన తో ……

మేనిలోన

 చిరు చలనం

 మానవాళి కది

 భయ భీకర

భూకంపనం

కొకిలమ్

 రచన ,సమర్పణ :నూతక్కి రాఘవేంద్ర రావు

తేది :20-08-2009.

 

పారిశ్రామిక ఎడారిలో …

కోయిలై కూసింది కొకిలమ్

 స్వాగతిస్తోంది అమృత గాత్రంతో

 అను నిత్యం …… శ్రామిక కార్మిక

 వాణిజ్యపురోగామి ఆ ప్రాంతం

 విద్యా రంగాన్ని ఆపోసన బట్టి

 వేల వేల ఇంజనీర్లు ,

డాక్టరులు

 అయ్యే యస్ లు ..

మరెందరినో

ఎన్నెన్నో రంగాల్లో

దేశ విదేశాలకు

 అందించిన విద్యాస్తలి

 అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్

ఆ స్ఫూర్తిగా మరెన్నో విద్యాలయాలు

అన్ని రంగాల్లో విద్యా రంగంలో

  దేశంలో ప్రముఖ స్థానంలో…..

 వుపాధి కరువనే వారే

కరువైన ప్రాంతమది

ఇసిఐఎల్ , ఎన్ ఎఫ్ సి ,

హెచ్.సి.ఎల్ బి ఇ ఎల్

ఎన్నెన్నో సంస్థల ఆవాస స్తలి

 మరెన్నో వేల మంది భుక్తిని పొందే

వుప కర్మాగారస్తలి

 సాహితీ ప్రియులు చిత్రకారులు

 నటులు రచియితలు

. కవి పండిత శ్రేష్ఠుల కాణాచి

యా కళావని

కప్పర నగర కాంక్రీటు భవనా వని

 కానీ నిష్టుర సత్యమది …

కళా సాహిత్యాల కు ప్రోత్సాహం

అందించలేని నిరంతర కర్మస్తలి

మూగ ఓయి ఎండిన ఆ

కళా సాహితీ ఎడారి యందు

చిరు జల్లులా … వసంత రాగాల కోయిలగా

 సాహితీవేదికగా కొకిలమ్ కూసింది .

 ‘తెలుగు కధకు వంద జేజేలు ‘

పేరుతొ సాహితీ బాంధవులు మీ అందరితో

కలిసి తెలుగు కధానిక శత జయన్త్యోత్సవాలు

జరుపుకోవాలని ఆశిస్తూ,

ఆకాంక్షిస్తూ

 రా రమ్మని మిమ్ములనాహ్వానిస్తూ

 వారు … ఔత్సాహిక నిర్వాహకులు …..

……………………………………………………………………………

శ్రీ పులిగడ్డ విశ్వనాధ రావు ,కన్వీనరు

 శ్రీ మరింగంటి రంగాచార్యులు ,

సహ కన్వీనరు శ్రీ పురాణం శ్రీనివాస శాస్త్రి. సహ కన్వీనరు

 సంప్రదించండి : చిరునామా ఇలా

 కొకిలమ్ – కన్వీనరు phone:no .040-40144629,

mobile:9491384480

సాహితీ సాంస్కృతిక వేదిక, (ఎక్రోపలిస్ ఎకాన్థస్,పేస్ స్కూల్ ప్రక్కన)

 రుక్మిణిపురి , ఇ సి ఐ ఎల్ (పోస్ట్)

 Near Dr. A.S. Rao Nagar ,

 .సికింద్రాబాద్ – 500062 –

కప్పర పురపాలక సంఘం-

Rrangaareddy Dist .A.P ,India ,

 

దిగ్విజయం ఆచార్య ఫణీంద్ర విరచిత సింగిల్ సెంటెన్స్ డి లైట్స్ ఆంగ్ల గ్రంధావిష్కరణ సభ

రచన :నూతక్కి రాఘవేంద్ర రావు

తేది :13-08-2009

ఆంగ్ల సాహితీ వేదికపై

తొట్ట తొలి అడుగులిడుతూ

 ఏక వాక్య కవితల

ఆంగ్లీకరణా విన్యాసం

 సింగిల్ సెంటెన్స్ డి లైట్స్

 తో

 ఆచార్య ఫణీంద్ర

పుస్తకావిష్కరణ సభ

దిగ్విజయం

ఆ రోజున

ఆగష్టు పదమూడున

రెండువేల తొమ్మిది వత్సరాన

 ఆ సాయంత్రం

హైదరాబాద్ నారాయణగుడా

 వై ఎం సి ఏ వేదికగా

సాగిపోయింది

ఓ సాహితీ వేడుక మహత్తరంగా …..

స్వయంగా ఛందస్సులో

 వుద్దండుడైనా

 చందోబద్ధ బంధనాలు

వినమ్రంగా తొలగిస్తూ

తెలుగు భాషకు తానె

అందించిన లలిత లాలిత్య

పద ఏక వాక్య కవితా

చమత్కృతీ భావ

 వ్యక్తీకరణ రీతులు

ప్రపంచంతో పంచుకొనేందుకు

 ఆంగ్లీకరించి అచ్చొత్తిచ్చి

అందించి ఆ భావకుడు

 తద్వేదికపై

నడయాడెను

 చిరు నగవుతో

 చిద్విలాసంగా

శః భాషనుకుందాం మనకు మనం – 4

రచన : నూతక్కి రాఘవేంద్ర రావు

తేది :15-08-2009

గానుగెద్దు జీవితం లా

అదో విష వలయం లో

ఆర్ధిక చట్రం

నిభద్ధత కోల్పోతూ

న్యాయ వ్యవస్థ

భక్షక రక్షణలో

 రక్షకభట వ్యవస్థ

విద్రోహుల దుష్ట కుతంత్రాల

 వికృత వ్యూహాలతో

మహోగ్ర విలయంలో

 దేశ భద్రతా వలయం

 అయినా మన భుజం

 మనం తట్టు కుందాం

 శః భాషనుకుందాం

 స్వతంత్ర దిన

 శుభాకాంక్షలు చెప్పుకుందాం

ఎంతయినా

 మనకు స్వతంత్ర దినం కదా మరి.

———————————————————————————-

శః భాషనుకుందాం మనకు మనం – 3

 రచన : నూతక్కి రాఘవేంద్ర రావు

తేది :15-08-2009

 ధన సంపాదనకో వేదిక గా

 రాజకీయ వ్యవస్థ

ఆలంబన గా నల్ల ధనం

 ఆ నల్ల ధనం వెచ్చిస్తే అధికారం

 అధికారం నీడలో నిరంతర ధన ఆర్జన

కుప్పలు తెప్పలు

 ధనానికి దేశంలో లోటేముందని

 కానీ ఆకలి చావులు

రైతుల చావులు ,

చేనేతవారు మస్త్యకారులూ

 ఎందరెందరివో … అయినా

 మన భుజం మనం తట్టు కుందాం

శః భాషనుకుందాం .

స్వతంత్ర దిన శుభాకాంక్షలు

చెప్పుకుందాం

ఎంతయినా మనకు

 స్వతంత్ర దినం కదా మరి.

శః భాషనుకుందాం 

    మనకు మనం – 2
  రచన : నూతక్కి రాఘవేంద్ర రావు

 
         కృష్ణ బిలాల్లో
        నిక్షిప్తమౌతూ 
   నిత్య అవసర సరుకులు  
     తారులా ప్రవహిస్తూ
        ధన రాసులు
       నిర్వీర్యమౌతూ
      దేశ ఆర్ధిక వ్యవస్థ
 
       నారద విహార
  వీధుల్లో నడయాడే ధరలు
      ప్రజా పంపిణీ
       విధి విధాన
        నిధనానికి     
     వనరుల దోపిడీకి …
      వ్యూహ రచనలో
   నిరంతరం నిమగ్నమై
       అధికార గణం   
         అయినా
    మన భుజం మనం
       తట్టు కుందాం
    శః భాషనుకుందాం  .
 స్వతంత్ర దిన శుభాకాంక్షలు
       చెప్పుకుందాం  
   ఎంతయినా  మనకు
 స్వతంత్ర దినం కదా మరి. 
———————————————————————– 
                తేది :15-08-2009

శఃభాషనుకుందాం మనకు మనం – 1

 రచన : నూతక్కి రాఘవేంద్ర రావు

తేది :15-08-2009

తిరోగమన పథం లో

పురోగమిస్తూ

అరవై రెండేళ్ళ వయసులో

 స్వతంత్ర భారత ప్రజాస్వామ్య వ్యవస్థ.

అయినా మన భుజం మనం తట్టు కుందాం

శఃభాషనుకుందాం .

 స్వతంత్ర దిన శుభాకాంక్షలు చెప్పుకుందాం

ఎంతయినా మనకు స్వతంత్ర దినం కదా మరి.

లంచగొండి తనం ,

అవినీతి; ఆశ్రిత పక్ష పాతం

కూకటి వ్రేళ్ళల్లో

చీడలు పీడలు

 విస్తరిస్తూ  …

నిర్జీవమౌతు పటు గొమ్మలు. .

అయినా… . మన భుజం మనం

 తట్టు కుందాం

శః భాషనుకుందాం .

స్వతంత్ర దిన శుభాకాంక్షలు

 చెప్పుకుందాం

 ఎంతయినా మనకు

 స్వతంత్ర దినం కదా మరి.

స్వాతంత్ర దిన శుభాకాంక్షలు

రచన :నూతక్కి రాఘవేంద్ర రావు.

 తేది 15-08-2009

 బ్లాగ్మిత్రులు

 కవి పండిత శ్రేష్ఠులు

 సాహితీ ప్రియులు

సామాజిక చింతనులు

 మిత్రులు హితులు

శ్రేయోభిలాషులు

మీదు మిక్కిలి

భారత దేశ

శ్రేయో కాన్క్షితులు

 అందరికీ నా వందనాలు.

 యివే నా హార్దిక

స్వాతంత్ర దిన శుభాకాంక్షలు.

పేరాశ
(అరువది ఏళ్ల  క్రితం  లోకం వీడిన అమ్మ తిరిగి వస్తుందని)
రచన :నూతక్కి రాఘవేంద్ర రావు
తేది :13-08-2009
 
నా జ్ఞాపకాల పొరల్లో
ఏ  మూలా  నిక్షిప్తమై లేని  
నీ రూపం కోసం
అనుక్షణం వెదుకులాడుతూ  
 క్షణ  క్షణం
నీ ధ్యాస, నీ స్మరణ  ….
 
అతి కొద్ది కాలం 
నా తనువును  తాకిన 
 నీ స్పర్శ తిరిగి పొందాలని 
తహతహ లాడని రోజు లేదు  
నీ కోసం  
నీరీక్షించని క్షణం లేదు  …..
ఆ రోజు నాకింకా గుర్తే
 
మా  పంతులు గారు
నేనేదో అల్లరి చేసానని
నా నెత్తిపైన మొట్టి తే
పొంగిన బొప్పి ని 
నీవు తడిమి తడిమి
నిమిరి నపుడు కలిగిన  
ఆ హాయి నాకింకా గుర్తే  
గట్టి పకోడీ మెత్తటి పకోడీ …అంటూ  
వైన  వైనాలుగా ఆ పంతులు
తొడపాయసం పెడితే ….
 కందిపోయిన  తొడపై
నల్లని ఆ నునులేత చర్మం 
చూస్తూ
చెమర్చిన నీ 
కనుకొలకులలో  
 నిండి  జారిన 
 నీరు చింది నా చర్మానికి
 వుపశమనమిచ్చి  
నా స్నానపు నును వెచ్చని
నీట  కలిసి  అతి వేడిగా
జాలు వారి….. 
అ క్షణాన నీ కన్నుల్లో 
 నీవు పడిన బాధ ను
నేను చూసిన   జ్ఞాపకాలు 
 
నీతో ఆడిన వూసులు 
నీ తో నడయాడిన జాడలు 
నీ  వడిలో  నే నాడిన క్రీడలు  
నీ వందించిన మురిపాలు
ముద్దులు,ముచ్చటలు
తినిపించిన గోరు ముద్దలు  
వర్షించిన ప్రేమ  ఝల్లులు
అన్నీ   నా స్మృతి యవనికపై
సజీవ చిత్రాలై కదలాడుతూ
 ఇన్నాళ్ళయినా
యిన్నేళ్ళయినా  
 
నను కన్న కొన్ని నాళ్ళకే   
కనులారా నను కనకే 
నా కంటి నిండ నిను  నే చూడకే
కానని లోకాలకు
ఏలనమ్మ నీ పయనం ?
 
తదనంతర  జీవిత  పర్యంతం 
అమ్మ
లేకుండానే  నేను
అవనిపైన  
అరువదేళ్ళు …….. 
 
అయినా
 
ఓ పేరాశ నాకు … 
చని పోయి
మము వీడిపోయి 
ఏ లోకపు
తీరాలన 
నీవున్నావో  
కాని ….
అమ్మ !
నీకు నీవే నను
వెదుక్కొంటూ
నా కొరకై  వస్తావని  !!
నీ  వడిలో  ఒక్క క్షణం  
తాదాత్మ్యతనందిస్తావని    !!!
    
    
 

తర్వాత పేజీ »