కృష్ణకాంత్ పార్కులో విరిసిన సాహితీ సుమాలు . నా జ్ఞాపకాల వింజామర లూ …

రచన :నూతక్కి రాఘవేంద్ర రావు

మొత్తానికి  ఆ రోజు అదే 14-06-2009  శ్రీ సి. బి  రావు గారి పుణ్యమా అని, కొంగ్రొత్త సౌరభాల తో  తెలుగున విరిసిన సాహితీ సుమాలను  కృష్ణకాంత్ పార్కులో ఆ  సమయంలోఅతి దగ్గరగా వీక్షించి ఆ  సౌరభాలను ఆఘ్రాణి స్తూ ….. …. గతంలోకి అలా అలా …….  

.
నిజంగా ఆ రోజు నేను  … ఎక్కడెక్కడికో గత కాలపు తీరాలు చేరి  …..కాల చక్రం వదిలిన  జాడల వెంట పరిగిడిపోతూ  …
 
 …. 1963 -1965 మధ్య  తెనాలి లో  సాగిన నా సాహితీ యానం, పలువురు ప్రముఖ కవులు కొండూరు  వీర రాఘవా చార్యుల వారు, ప్రముఖ నవలా రచయితలూ, భావుకులు   ,శ్రీ తాళ్ళూరు నాగేశ్వర రావు గారు  ,శ్రీ హితశ్రీ  గారు, వారితో  మహోదయా ప్రింటర్స్ కార్యాలయంలో సన్నిహితంగా మెసిలిన సాహితీ సంగమాలే కాక    . . నేను వ్రాసిన బుర్రకథ ‘చైనా దురాక్రమణ ఆవిష్కరణ సందర్బంగా వారంతా ముద్రణా  కార్యాలయానికి  విచ్చేసి నన్ను ప్రోత్సహించడం మరీ మరీ  నాకు గుర్తుకు వచ్చాయి. తెనాలిలో నేనూ ,నా ప్రియ మిత్రులు వెనిగళ్ళ వెంకట రత్నం ,బెనర్జీ  మిగతా మా గ్రూపు  విద్యార్థులు పాలుగొన్న  విద్యార్ధి వుద్యమాలూ….గుర్తుకు వచ్చాయి .
 
 1966-1968 మధ్య  కాలంలో  నేనూ నా మరో ప్రియ మిత్రుడు సహచరుడు  జి. రామ మూర్తి ,మిగతా  మిత్ర బృందం కలసి కొత్తగూడెంలో   చేపట్టిన విశాఖ వుక్కు ఆంధ్రుల హక్కు  వుద్యమం, గుర్తుకు వచ్చింది.  ఆ వెనువెంటనే,ఆనతి కాలంలోనే    స్తానిక నిరుద్యోగులకు….  క్రొత్తగా నిర్మిస్తున్న కే. టి. పి. ఎస్ లోనూ , బొగ్గు గనుల లోనూ ,వుద్యోగ నియామకాల్లో జరుగుతున్న అన్యాం పై గళమెత్తి స్థానికులకు   మాత్రమె ఆ యా సంస్తలలో వుద్యోగాలు కల్పించాలని , కొత్తగూడెం విద్యార్ధి పరిషత్ కార్య నిర్వాహక  సభ్యులుగా విద్యార్ధి వుద్యమాలు చేపట్టడం , ఆ తరువాత అప్పటి కేంద్ర గనులు వుక్కు మంత్రి శ్రీ చెన్నారెడ్డి గారిని కలిసి ఆయన సలహా మేరకు ,వుస్మానియా యూనివర్సిటీ హాస్టళ్ళలో విద్యార్ధి సంఘాలను కలిసి  విద్యార్ధి లోకాన్ని పట్టి పీడిస్తున్న  నిరుద్యోగ సమస్య , స్థానికులకు జరుగుతున్న అన్యాయాం,సింగరేణిలో,కే టి పి ఎస్ ల లో  రాష్ట్రేతరులు తన్నుకు పోతున్న వుద్యోగాలు …అలా అనేక సమస్యల గురించి చర్చించి యూనివర్సిటీ విద్యార్ధి  సంఘాలే ఆ కార్యక్రమాలు చేపట్టాలని ,మా  వంతు తోడ్పాటు వుంటుందని చెప్పి ,మేము ప్రారంభించిన వుద్యమం అతి కొద్ది కాలంలోనే ఏ ఏ రూపులు సంతరించుకొని ఏ తీరున వుద్రుతి చెంది ప్రవహించి 1969 కాలానికి   ప్రత్యెక తెలంగాణా సాధనోద్యమంగా రూపాంతరం చెంది ఎన్నెన్ని జీవితాలను కుటుంబాలను అతలా కుతలం చేసిందో ,గుర్తుకు వచ్చాయి. 
 
 ఆ తరువాత  1972-1975 మధ్య  కాలంలో  హైదరాబాద్  లో నారాయణ గుడా లో  ప్రముఖ చిత్రకారులు శ్రీ పి.టి రెడ్డి గారి యింట  శ్రీ నార్ల వెంకటేశ్వర రావు గారి వంటి మహా మహుల  సమక్షంలో  శ్రీయుతులు ఇన్నయ్య గారు, శ్రీ సి బి  రావుగారు,  శ్రీ వెనిగళ్ళ వెంకట రత్నం  మొ:వారు  ,నిర్వహించిన   నెల నేలా సమావేశాల లో నేను  పాలుపంచుకున్న రోజులు  గుర్తు కొచ్చాయి. హైదరాబాద్ ఆర్ట్ సొసైటీలో సభ్యుడిగా అప్పటి కే పేరుగాంచిన చిత్రకారులు శ్రీ పి.టి రెడ్డి ,మొదలైన   ప్రముఖ చిత్ర కారులతో ముఖా ముఖి చర్చల్లో పాలు పంచుకోవడం ,నా చిత్రాలు కూడా  వారి చిత్రాల సరసన ప్రదర్శనకు  నోచుకోవడం కూడా గుర్తుకొచ్చింది.
ఆ  తదుపరి  కాలంలో ( 1970-1975 మధ్య  కాలంలో)  నేను ,ముందుండి నడిపిన కార్మికోద్యమాలు ,సహకారోద్యమాలు జ్ఞాప్తికొచ్చాయి.కార్మిక సంఘ స్థాపనలో పాలు పంచుకొని వుద్యమాలను ముందుండి నడిపి ,సహకార సంఘాలు స్థాపించి మార్గ నిర్దేసకత్వం చేసి, ఇలా  ఎన్నో జ్ఞాపకాలను నెమరు వేసుకొనే అవకాశం  నాకు ఈ సమావేశంలో ………….తలవిదిల్చి    వాస్తవానికొస్తే
 
  శ్రీ సి.బి రావు గారు , నాకు  14-06-2009 న  జరిగే  ఈ తెలుగు సమావేశాలకు ఆహ్వానం మెయిల్ ద్వారా పంపారు, ఏమనంటే ఈ నెల ఈ తెలుగు సమావేశం రెండవ ఆదివారం dt. 14-06-2009 న  జూబిలీ హిల్స్ లోని ఇన్నయ్య గారి శాస్త్రీయ పరిశోధనా గ్రంధాలయంలో జరుగుతుందనిన్నూ, రాగోరువారు సమ్మతి తెలియపరచగాలరనిన్నూ .అయితే కారణాంతరాలవల్ల ఆ సమావేశ వేదిక  యూసుఫ్ గూడా లోని కృష్ణకాంత్ పార్కు కు  మార్చబడిందని మరో మెయిల్ లో తెలియబరిచారు. నేను వస్తున్నట్లు.  నా సమ్మతిని తెలియ పరచాను.
 
 ఆ సమావేశా లకొరకు ఎదురు చూసిన సమయం రానే వచ్చింది.  ఆ సమావేశాలకు బస్సులు పట్టుకొని, ఆటోలు పట్టుకొని ఎలాగయితే నేఁ  ఖస్చ్చితంగా సాయంత్రం  03-00  గం .లకు క్రిష్ట్నకాంత్  పార్కుకు కు చేరుకొని ఎంట్రీ టికెట్ తీసుకొని లోనికి ప్రవేశించాను.
 
.అది చాలా పెద్ద పార్కు.భవిష్యత్తులో చాలా సుందరవంతంగా తీర్చి దిద్దబడుతుందనిపించింది. అన్ని హంగులూ తీర్చిదిద్దే ప్రయత్నంలో హుడా వారున్నారనిపించింది.  కాకుంటే ఎండల వేడిమి, నీటి కొరత  పార్కు పచ్చ దానం మీద ఎక్కువ ప్రభావాన్నే చూపాయి. అయినా పచ్చని పెద్ద పెద్ద చెట్లు చాల విశాలమైన నీడను పచ్చని పసిరిక మైదానాలపై పరచి ఆకు పచ్చ దానం లోనే   వివిధ తేడాలు ప్రస్ఫుటంగా తెలియజేస్తూ అంతటి వేడిమిలోనూ ఆహ్లాదాన్ని కలుగ జేస్తున్నాయి. అప్పటికే ఇళ్ళల్లో వేడిమి తట్టుకో లేక వ్యాహ్యాళికి  వచ్చిన పెద్దలూ, యువ జంటలూ అక్కడక్కడ బెంచీలపై ముచ్చట్లాడుకొంటు న్నారు  .పిల్లలు వారికొరకు ఏర్పాటు చేసిన అనేక ఆట పరికరాలతో ఆడుకొంటున్నారు. పార్కులో అప్పుడే సందడి మొదలౌతోంది. 
 
E. తెలుగు సమావేశం ఎక్కడో ఎలా తెలుసుకోవాలి? పోయిన నెల సమావేశాల్లో సి.బి రావు గారు దీప్తిధారలో ప్రచురించిన పోయిన నెల సమావేశాల తాలూకు ఫోటోలు చూసాను. వీవెన్ గారిని గుర్తుపట్టగలను. అదీ కాక ఆయన ఆ సమావేశాలకు వస్తున్నానని ఫోనులో చెప్పారు. ఆ ధైర్యంతో ముందుకు సాగుతుంటే కొద్ది దూరంలో ఓ పెద్ద  నిద్ర గన్నేరు చెట్టు నీడలో ఓ అయిదుగురు యువకులు  సర్కిల్లో కూర్చొని మాట్లాడుకోవడం చూసాను. దగ్గరకు వెళ్లి పరికించి చూస్తె వీవెన్ గారు కనిపించారు. వెళ్లి నన్ను నేను పరిచయం చేసుకొని , వారినందరినీ కూడా పరిచయం చేసుకుందును కదా అందులో బ్లాగ్లోకంలో వుద్దండులు కొందరు. అందరూ యువకులే. నేనూ ,శ్రీ దూర్వాసుల వారూ తప్ప. ఆ సమావేశంలో నేను వెళ్ళేసరికి  వారు చర్చలో వున్న వారు  ….
 
   
    సర్వ శ్రీ ….. 1)వీవెనుడు  (వీవెనుడి టెక్కు నిక్కులు ఫేం ) మరియు  ఈ తెలుగు నిర్వాహకులు.   2)  పద్మనాభం  దూర్వాసుల …(తెలుగు గ్రీటింగ్స్ ఫేం ) మరియూ    ఈ తెలుగు  నిర్వాహక  సభ్యులు. 3)  శ్రీ కశ్యప్ (కబుర్లు ఫేం )మరియూ ఈ తెలుగు కార్య నిర్వాహక సభ్యులు. 4)శ్రీ కత్తి,మహేష్ కుమార్ …(అదే పేరుతొ కవిగా బ్లాగరు గా ఫేం ) మరియూ ఈ తెలుగు కార్య నిర్వాహక సభ్యులు. .,5)శ్రీ తుమ్మల శిరీష్ కుమార్ … ఈ తెలుగు కార్య నిర్వాక సభ్యులు (క్షమించాలి ఈ తెలుగు కార్యవర్గంలో వారి వారి అధికారిక పదవులేవో నాకు తెలియదు. ).    ఆ తరువాత నేను .6)నూతక్కి. వర్డ్ ప్రెస్ .కాం బ్లాగరును.  ఆ తరువాత  7) శ్రీ కశ్యప్ గారు (
kaburlu.wordpress.com )వచ్చారు . ఆ  తరువాత 8) శ్రీ  దాట్ల శ్రీనివాస రాజు గారు .9)  చివరగా శ్రీ శ్రీనివాస్ (సమీహ)( సమీహతెలుగు.బ్లాగ్స్పాట్.కాం )వచ్చారు.
 
సి.బి రావూ గారు వస్తారని ఎదురు చూసాను కాని కొన్ని అనివార్య కారణాలవల్ల రాలేకపోయారని తెలిసింది.  ఆ సమావేశానికి జ్ఞాపికగా ఒక్కొక్క కలం ( అమెరికా నుండి వస్తూ స్నేహితులకు యిద్దామని  నే తెచ్చినవి కొన్ని మిగిలాయి లెండి ,వేరు వేరు రంగుల్లో రాసేవి ఎవరి చాయిస్ వారిదే.)బహుమానం యిచ్చాను. సి.బి రావు గారిదాకా వస్తుందో  రాదో మరి. వారికి అంద లేదు. కొన్ని ఫోటోలు నా కెమేరాతో తీసుకున్నాను. దురదృష్ట వశాత్తూ అవి ఎలా కంప్యూటరుకు ఎక్కిన్చాలో   తెలియక ఈ .పోస్ట్ లో పంపలేకపోతున్నాను.
 
 ఆ తరువాత ఈ తెలుగు కార్యవర్గ సమావేశ చర్చ లేవో  జరిగాయి. నేను ఆహ్వానితుడిగా ఆ చర్చలలో తలదూర్చలేదు. షుమారు సాయంత్రం  అయిదు గంటలకు సమావేశం ముగిసింది. పార్కులో వున్న తేనీటి శాలలో తేనీరు సేవించి, తేనీటి దాత కు ధన్యవాదాలర్పించి  అందరం యిళ్ళకు బయలుదేరాము.
 
 శ్రీ శ్రీనివాస్ గారు, దూర్వాసులవారు  తామూ తార్నాకా వైపు వేలుతున్నామనీనూ తమ తో పాటు రావలిసిందిగానూ ఆహ్వానించారు. వారి సహృదయతకు ధన్యవాదాలర్పించి  శ్రీ శ్రీనివాసు గారి కారులో   ప్రయాణం చేసి, శ్రీనివాసు గారి డ్రయివింగ్ సుతి మెత్తగా సాఫీగా సాగింది. మాటల్లో పడితార్నాకా వచ్చిన విషయం కూడా  గమనించలేక  పోయాను . 
తార్నాకాలో దిగి ,మరో  బస్సులోఎక్కి     యి సి ఐ  ఎల్    ప్రాంతానికి , అక్కడ నుండి  అదే ప్రాంతంలో వున్న నా స్వంత గూటికి  చేరుకున్నాను.