బుల్లి తెరపై బుడి బుడి నడకల గాంధర్వులు

 రచన: నూతక్కి రాఘవేంద్ర రావు.

తేది: 07-08-09

సమయం :23- 00 గం.

తెలుగు చిత్ర సీమ చిరు చిరు అడుగులనుంచి అందాల నడకలు నేర్చి హృద్యంగా నర్తిస్తూ యిప్పటికి ఎన్ని దశాబ్దాలు గడిచాయో గాని, హీరోలు హీరోయిన్లు , యితర యాక్టర్లు ,వెండి తెరపై కనుపించే వారు తప్ప, తెరవెనుక పనిచేసే సాంకేతిక ప్రముఖులు గాని , దర్శకులు గాని ,ఎడిటర్లు గాని ,గాయకులూ ,సంగీత దర్శకులు గత కొన్ని సంవత్సరాల వరకు ప్రజలకు తెలిసే వారు కాదు.మీ ప్రక్కనే వారు నడుస్తున్నా ,మీరు మాట్లాడుతున్నా గుర్తు పట్టే అవకాశం వుండేది కాదు. అదే హీరో పాత్ర దారులైనా , హీరోయిన్ పాత్రదారులైనా ,హాస్యపాత్రదారులైనా ,విలన్ పాత్ర దారులైనా ప్రజల మనసుల్లోకి చొచ్చుకు పోయే అవకాశాలు ఎక్కువగా వుండేవి. సినీ పత్రికలు కూడా వారికి గొప్ప ప్రచారాన్ని యిచ్చి అతి గొప్ప ప్రాచుర్యాన్ని కలిగించేవి . అనేక వ్యయ ప్రయాసలకోర్చి చిత్ర నిర్మాణానికి ధనం వెచ్చించి అనేక సాధక బాధకాలు ఎదుర్కొని చిత్రాలు నిర్మించే నిర్మాతలకు , కధా రచియితలకు ,చిత్రానికి ఓ రూపునిచ్చి సొగసులు అద్దె దర్శకులకు ,యితర సాంకేతిక నిపుణులకు కూడా తగిన ఆదరణ పత్రికా మాద్యమం యిచ్చేది కాదు. . వారి ముఖ చిత్రాలు కూడా అంతగా ప్రచురించే వారు కాదు. . వారిని ప్రాచుర్యంలోకి తేవాలని ప్రయత్నించే వారు కూడా కాదు. శ్రీ బి యెన్ రెడ్డి గారు , ఆదుర్తి సుబ్బా రావు గారు ,,బాపు వంటి అధునాతన ప్రతిభా శీలురు దర్శక రంగంలోనూ, ఘంట సాల వారు ,( , తమ ప్రియతమ నేపధ్య గాయకుణ్ణి వెంకటేశ్వర మహత్యం సినిమాలో లో చూసే అవకాశం ప్రేక్షకులకు మొదటి సారి కలిగింది.) జానకి ,సుశీల, వంటి నేపధ్య గాయనీ గాయకులు . అన్ని అడ్డంకులను దాటి తమ వునికిని చాటుకొంటూ వ్యక్తిగత ప్రతిభతో ప్రజల ముందుకు దూసుకు వచ్చారు. . ఆ సమయంలో దాసరి నారాయణ రావు గారు దర్శకుడిగా యాక్టరుగా చిత్ర రంగ మాద్యమం ద్వారా ప్రజల్లోకి చొచ్చుకు వచ్చారు. ఎస్పి బాల సుబ్రహ్మణ్యం శంకరాభరణం చిత్రం తరువాత, సినీ చిత్ర పరిశ్రమలో తిరుగులేని గాయకుడిగా సుస్థిర స్థానం సమకూర్చు కొన్నారు. టి వి మాధ్యమం వచ్చి ఎన్నో దశాబ్దాలు గడిచినా , దాని ద్వారా గత కొన్ని సంవత్సరాల నుండి మాత్రమె , చిత్ర సీమలోని తెరవెనుక ప్రముఖులను వీక్షించ గలిగే అవకాశం ప్రేక్షకులకు కలిగింది. వివిధ టి.వి చానళ్ళ మధ్య పోటీ పెరిగి వివిధ కార్యక్రమాలు రూపొందిస్తూ , గాయకులను, సంగీత కారులను ,దర్సకులనూ ,నిర్మాతలనూ, యితర సాంకేతిక కళా కారులనూ ప్రజలకు పరిచయం చేస్తూ వున్నా చెప్పుకో తగ్గంత గా మాత్రం లేదని చెప్పా వచ్చు. . చిత్ర సీమ భవిష్యత్తు ను దృష్టిలో వుంచుకొని బాలలలో వున్న గాత్ర కళా కౌశలాన్ని ,నాట్య కౌశలాన్ని వెలికి తీసే యత్నంలో గాయకులను , నృత్యకారులను, ప్రోత్సహించే దిశగా కోన సాగుతోంది బుల్లి తెర . ప్రతి యింట జీవిత భాగాస్వామిలా కలిసిపోయిన బుల్లి తెర , యువతలో వివిధ కళా కౌసల్యాలను మాత్రమె కాక తెలుగు భాష పై ఆసక్తి నీ పెంపొందిస్తోంది.,శాస్త్రీయంగా కళను నేర్చుకోవాలనే దృక్ఫదం తల్లి దండ్రులలోనూ పిల్లలలోనూ పెరుగుతోంది. భాషపై పట్టు కూడా పెరుగుతోంది. ఆ విధంగా తెలుగు భాష బ్రతికి బట్ట కట్టే దిశగా ఎదుగుతోంది .నూతన గాయకులు , నృత్య కారులు బాల్య దశ నుండే ఆసక్తిని చూపిస్తూ ,అంతటి చిన్న వయసులో ఎంతటి ఘనమైన ప్రజ్ఞను ప్రదర్సిస్తున్నారో వీక్షిస్తే…. ఆ కార్యక్రమాలు వీక్షించే యువతలో , బాల బాలికలలో తెలుగు పై ఆసక్తి పెరుగుతోంది. వారికి కావలిసింది యిసుమంత ప్రోత్సాహం ,తగినంత మార్గ నిర్దేశకత్వం. వీరంతా గొప్ప ధనవంతుల యిళ్ళ నుండి వస్తున్నా వారు కాదు. tamaku కు లభించే ప్రతిపైసా జాగ్రత్తగా ప్రణాలికా బద్దంగా ఖర్చు చేస్తూ తమ పిల్లలలో వున్న సామర్ధ్యాలను వెలికి తీయాలనే తపనతో తాము…. జీవితంలో పోదాలిసినవి ఎంతో కోల్పోతూ కూడా తమ పిల్లల జీవితాలకు పూల బాట పరవాలనే యత్నంలో ……తల్లి దండ్రులు. యిది చాల ముదావహమైన విషయమే. ఆంగ్ల మాద్యమం లో చదవడం వల్ల ఈ కార్యక్రమాలు చూస్తూ మాత్రు భాషలోని మాధుర్యాన్ని పొందలేక పోయామని భావిస్తూ తెలుగు భాష నేర్చుకునే దిశలో ముందుకు కదులుతున్న యువత ను చూసి దానికి ప్రోద్బలం అందించిన బుల్లి తెర ను (వివిధ టి.వి చానళ్ళ ను) అభినందించకుండా వుండ లేము. అభినందించి దానితో సరిపెడితే చాల పొరబాటు. . ప్రతి ఒక్కరూ ఈ యజ్ఞంలో తమ వంతు తోడ్పాటు నందిన్చాల్సిన అవసరం ఎంతయినా వుంది . ముఖ్యంగా తల్లిదండ్రులూ బంధువులూ సరైన సమయంలో తమ పిల్లలలోని కళా తృష్ణను గుర్తించి సృజనాత్మకతను వెలికి తీసేందుకు కృషి చేసే దిశలో వారిలో ఆశావహ దృక్పధాన్నినింపుతూ నెగటివ్ థాట్స్ ను తరిమేస్తూ కడలి ముందుకు అడుగు వేస్తె , తెలుగు జాతిలో కళాత్మకత వెళ్లి విరిసి సమాజాన్ని పట్టి పీడిస్తున్న కక్ష ద్వేషం పగ ఈర్ష్య అసూయ ,కుట్ర, కుతంత్రం, తమ దరి చేరనీయని నవ యువతరంగాన్ని మనం ఆవాహన చేసుకోగలం. కానీ ఈ యత్నంలో ఒక్క గాయకులనే కాక ,వారి ప్రతిభకు వన్నె లద్దె అనేక యితర రంగాల ప్రముఖులను ,వారి వారి ప్రతిభను ప్రజలకు పరిచయం చేయ వలసిన అవసరం ,మరియు ఆయా రంగాల్లో ఔత్సాహికులను ప్రోత్సహించ వలసిన అవసరం ఎంతయినా వుంది. ఆ భాద్యతను కూడా తామే భుజానికెత్తుకొవలసిన అవసరం , భాద్యత వుందన్న విషయం బుల్లి తెర యాజమాన్యాలు మరువ గూడదు. పాట పాడేందుకు కవి రాసిన గీతం ఎంత అవసరమో ,పాడేందుకు సమర్ధుడైన గాయకుడు, ఆ గానం వీనుల విందుగా మలిచే యత్నంలో వేదిక , ఆర్కేష్ట్రా ,వాద్యాలూ వాద్యకారులూ , వారి ప్రతిభ కూడా అత్యంత ముఖ్యమైనవి .గాయకుడి ప్రతిభ వెలికి రావాలన్నా వన్నెలు దిద్డుకోవాలన్నా వాద్యకారుల ప్రతిభ,ఆయా పరికరాల సామర్ధ్యం అతి ముఖ్యమైనది. . అదునాతన సాంకేతిక,శాస్త్ర పరిజ్ఞానం అందించిన ఎన్నో నూతన సంగీత వాద్య పరికరాలు ….వాటి ని ప్రతిభావంతంగా వినియోగించుకోనేందుకు నిపుణులైన వాద్యకారులుగా తయారు చేసే దిశగా టి.వి రంగం ముందుకు రావాలి. సంభందిత రంగాల్లోనూ పోటీలు పెట్టి నూత్న వాద్య కళా కారులకు ప్రోత్సాహాన్నందించ వలసిన అవసరం ఎంతయినా వుంది. గత కొన్ని సంవత్సరాలుగా అనేక టి .వి చానెళ్ళలో పాటల పోటీలు జరుగుతున్నా ,వారికి అనేక ఆర్కేష్ట్రా బృందాలు వాద్య సహకారం అందిస్తున్నా , ఆయా ఆర్కేష్ట్రా సభ్యుల ప్రతిభా సామర్ధ్యాల గురించి నాలుగు ముక్కలు చెప్పడం గాని ,వారిని మెచ్చు కోవడం కాని , పాటలోఆర్కేష్ట్రా యొక్క ప్రాముఖ్యత గురించి తెలియ చెప్పటం గాని, (ఒకటి రెండు సందర్భాల్లో తప్ప ),నిర్వాహకులు గాని ,గానంలో, సంగీతంలో ప్రఖండులైన వారు గానీ, సముచిత ప్రాధాన్యం ఇవ్వాలన్న యోచన చేయక పోవడం శోచనీయం .. పాటను ఏ రాగంలో పాడాలో ,మ్యూజిక్ ఏవిధంగా వినియోగించాలో ,ఆర్కేష్ట్రా లో ఏ ఏ వాద్యాలు వాడాలో అందుకు ప్రతిభా వంతులేవ్వరో తెలుసుకొని వినియోగించడం ఎంత ముఖ్యమో, ….పాటలకే కాక తత్ సంభందిత సాంకేతిక రంగాలలో కూడా ప్రతిభను వెలికి తీసే ప్రక్రియను .ప్రోత్సాహాన్నందించే విధానాలను రూపొందించాలి. పాటంటూ వుండాలంటే ,ముందుగా కావలిసిన వారు రచయితలూ , కవులు , ఆర్కేష్ట్రా ,,ప్రాచీన/ నవీన వాద్యాలు , సంగీత దర్శకులు . ఆయా రంగాలకు చెందిన ప్రతిభా వంతులైన కళాకారులను ,నిష్ణాతులను , ప్రేక్షకులకు పరిచయం చేయడమే కాక, ఔత్సాహికులనుండి వారి ప్రతిభను వెలికి తీసి భావి తరాల కొరకై అందించడం, తమ గురుతర భాద్యతగా టి .వి మాధ్యమాలు గుర్తించడం ఎంతో అవసరం. వైద్యం రంగంలో ఎన్నెన్నో శాఖలు బయటకు వచ్చి తమ వైశిష్ట్యాన్నిచాటుకుంటున్న విధంగా సినీ రంగంలో కూడా వివిధ విభాగాలు దేనికది విడివడి తమ వునికి చాటుకోవాలంటే ధృఢ తరమైన వూతం కావాలి. దానికి బుల్లి తెర వేదికగా మారాలి. యువ గాయకులను తెలుగు ప్రపంచానికి పరిచయం చేస్తున్న ఈ తరుణంలో నైనా కనీసం ప్రతిభావంతులైన ఆర్కెస్ట్రా బృందాలను ప్రేక్షకులకు/శ్రోతలకు పరిచయం చేయడం బుల్లితెర యాజమాన్యాలు ఆనవాయితీగా పెట్టుకో వలసిన అవసరం ఎంతైనా వుంది.. ఆయా బుల్లి తెర ల లో పిల్లల చే చేయించే పాటల కార్యక్రమాలలో పిల్లలు పాడిన ప్రతి పాట తరువాత ప్రత్యెక అతిధి ఆ పిల్లలను ప్రోత్సహిస్తూ అభినందిచే అవకాశం వున్నా ఆ యా అతిధులు ఆయా బాల గాయకులకు సరి అయిన రీతిలో .అభినందనలు అందించలేక పోతున్నారు. . ఆ ప్రత్యెక అతిధి బాలగాయకుల మనసులు గాయపడని రీతిలో ఆ పాటను అభినందించడమో, లేక ప్రతిభను అభివ్రుది పరుచుకునేందుకు సూచనలు చేయడమో చేస్తే బాగుంటుంది. ఈ ప్రక్రియ కై ప్రత్యెక వ్యూహ రచన చేసి నిర్మాణాత్మకంగా వ్యవహరించి కార్య సాధన దిశగా పయనించ గల శక్తి యుక్తి టి .వి మీడియా కు మాత్రమె సమృద్ధిగా వుందని భావిస్తూ . వారి ప్రస్తుత నిబద్ధతను ప్రశంసిస్తూ , భవితలో మరింత ఆశిస్తూ . ,శలవు తీసుకుంటూ….