గడసరి మొగుడు

రచన :నూతక్కి రాఘవేంద్ర రావు

 తేది:10-08-2009

తను వింటుండగా …

ఆనాడు మల్లె పొద కాడ…

పెళ్ళికి ముందు

 ఆమె వడిల పండి సెప్పిండు

నీ అధరాలు గులాబీ పూ రెమ్మలు…..

తానె వింటుండగా

పెళ్లి తరువాత ఆమెకే …..

 పడకటింటి మంచంల

పండి సెప్పిండు

నీ పెదాలు మొగలి పూ రేకులు ‘

పోగిడిండా ? తెగిడిండా ?’

నాగ్గిట్ల సమఝ్ కాలే ….

తనకెందుకు లెమ్మని

తెమ్మెర తరలి పోయే