దిగ్విజయం ఆచార్య ఫణీంద్ర విరచిత సింగిల్ సెంటెన్స్ డి లైట్స్ ఆంగ్ల గ్రంధావిష్కరణ సభ
రచన :నూతక్కి రాఘవేంద్ర రావు
తేది :13-08-2009
ఆంగ్ల సాహితీ వేదికపై
తొట్ట తొలి అడుగులిడుతూ
ఏక వాక్య కవితల
ఆంగ్లీకరణా విన్యాసం
సింగిల్ సెంటెన్స్ డి లైట్స్
తో
ఆచార్య ఫణీంద్ర
పుస్తకావిష్కరణ సభ
దిగ్విజయం
ఆ రోజున
ఆగష్టు పదమూడున
రెండువేల తొమ్మిది వత్సరాన
ఆ సాయంత్రం
హైదరాబాద్ నారాయణగుడా
వై ఎం సి ఏ వేదికగా
సాగిపోయింది
ఓ సాహితీ వేడుక మహత్తరంగా …..
స్వయంగా ఛందస్సులో
వుద్దండుడైనా
చందోబద్ధ బంధనాలు
వినమ్రంగా తొలగిస్తూ
తెలుగు భాషకు తానె
అందించిన లలిత లాలిత్య
పద ఏక వాక్య కవితా
చమత్కృతీ భావ
వ్యక్తీకరణ రీతులు
ప్రపంచంతో పంచుకొనేందుకు
ఆంగ్లీకరించి అచ్చొత్తిచ్చి
అందించి ఆ భావకుడు
తద్వేదికపై
నడయాడెను
చిరు నగవుతో
చిద్విలాసంగా
ఆగస్ట్ 18, 2009 at 5:55 సా.
ఈ తీరుగ నా సభపై
వ్రాతను మెరిపించి తనదు బ్లాగున, నాకున్
భ్రాత వలె ప్రేమ కురిసిన
’నూతక్కి’ కులోద్భవునికి నూరు నమస్సుల్ !
ఆగస్ట్ 18, 2009 at 7:33 సా.
ఆచార్య ,
యింతటి ఘన భావకుని వ్యాఖ్యను గని
ఎంతగ మదీయ డెందముప్పెంగెనో
సంతసమొందే నా మనంబు ముదంబున
కృతజ్ఞత లెన్నని తెల్పుదు సాధ్యమేట్టులో ..
అభినందనలతో ……శ్రేయోభిలాషి ..నూతక్కి