Etv వారి “బ్లాక్” సంగీత కార్యక్రమం _1
(నిర్వాహకులు ధన్యులు,అభినందనీయులు)
రచన: నూతక్కి రాఘవేంద్ర రావు. తేది:30-09-2009
యీ వేళ బుధవారం అనగా తేదీ:30-09-2009న Etv వారి
“బ్లాక్” ప్రోగ్రాం వస్తుందని అన్ని పనులు మానుకొని ఆ పోగ్రామ్
చూసే అవకాశం పోగొట్టుకోవద్దని కూర్చొన్నాం.
కొన్ని ముఖ్య మైన తెలుగు చానళ్ళలోనూ బాలల సంగీత కార్యక్రమాలు
అత్యధ్భుతంగా ప్రదర్శింప బడుతున్నా, Etv వారి “బ్లాక్” సంగీత
కార్యక్రమం అన్నింటిలోకి ప్రత్యేకమైంది, అపురూపమైంనది. ఎందుకంటే నేత్ర వైకల్యం కల బాల బాలికల కొరకు వారికి ప్రత్యెకించ బడింది మరి.
Etv వారు….., వీక్షకులు అచ్చెరువందే లా , కళాత్మకంగా ,సుందరంగా నెమలి నాట్య భంగిమ కు ప్రతీకగా ,
వేదికను, మ్యూజిక్ కు అనుగుణంగా నర్తించే సప్త వర్ణ శోభిత
విద్యుద్దీప లతలతో, ఎంతచూసినా చూడాలనిపించే రీతిలో సుందర
మహాధ్భుత ద్రుశ్య కావ్యంలా రూపొందించారు..
యీ” బ్లాక్” అనే సంగీత కార్యక్రమం నిరంతరంగా అనేక నెలలుగా ప్రపంచ
వ్యాప్తంగా తెలుగు వారిని అలరిస్తున్న విషయం ఎల్లరకూ విదితమే.
ఎంతోమంది ఔత్సాహిక అంధ బాలగాయనీ గాయకుల లోనుంచి అనేక
పరీక్షలకు ఎదురొడ్డి నిలచి తమ సామర్ధ్యాన్ని నిరూపించుకొంటూ
“ఫైనల్” కు చేరిన మువ్వురు గాయకులు అంతిమ పోటీని
ఎదుర్కొని ఒకరు విజేత నిలుస్తారు.
ఫైనల్పోటీ మొదటి ఎపిసోడ్ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా
విచ్చేసిన ప్రముఖ సినీపాటల రచయిత శ్రీ సిరివెన్నెల
సీతారామశాస్త్రి నుడివినట్లు “ఆ బాల గాంధర్వుల శక్తి యుక్తులను
జడ్జ్ చేసేందుకు జడ్జీలకే శక్తి సరిపోదేమో” నన్నంతగా ఆ చిన్నారి
గాయకుల ప్రతిభ వుంది.
అట్టి మహత్తర కార్యక్రమం వీక్షించాలని ఎవరికి వుండదు చెప్పండి?
యీ ఫయినల్ పోటీ రెండు రోజులు నిర్వహింప బడుతుంది.
యీ వేదికపై తమ గానం తో వీక్షక, శ్రోతల హ్రుదయాలను
చూరగొంటూ అలరిస్తున్న చిన్నారి గాంధర్వులు యీ ప్రపంచాన్ని
వీక్షించలేని నేత్ర రహితులు.
కొన్ని నెలలుగా కొన సాగుతున్న యీ కార్యక్రమం, వారిలోని గాన
ప్రతిభను వెలికి తీయడానికీ మరియూ వారి గాత్ర సామర్ధ్యాన్ని
ప్రపంచానికి చాటడానికున్నూ.
తమ గాత్ర మాధుర్యాన్ని చవి చూపిన బాల
గాయకులు, తమ మధుర గానం తో, అత్యధ్భుత ప్రతిభా పాటవాలు
ప్రదర్శించి,సంగీతానికి అవధులేవీ వుండవనీ ,నేత్రలేమి అడ్డంకి
కాదనీ ,శరీరాంగాలన్నీ సవ్యంగా వున్న,తమ వయసున్న
ప్రతిభావంతులైన గాయనీ గాయకులకు తామేమీ తీసిపోమనీ,
ప్రపంచానికి మరోసారి చాటి చెప్పిన యీ కార్యక్రమం ,అధ్భుతం,
అత్యధ్భుతం .
నిబద్ధతతో ఈ కార్యక్రమాన్ని ప్రజలకు
అందిస్తున్న, నిర్వాహకులు Etv వారు ధన్యులు ,
అభినందనీయులు .
వివిధ భావనలు, నిమ్న యోచనలు
రచన: నూతక్కి రాఘవేంద్ర రావు.
తేది: 29-09-2009
చిట్టి చిట్టి పదాల కూర్పులు
కవి అల్లిన చిరు కవితలు
నిభిడీక్రుత భావనలు
విడుస్తున్న నిట్టూర్పులు ….
తమ విశాల విశ్వ రూపం
కుబ్జమై కుదింప బడు తోందని .
తెలియదు లే !! పాపం !!
విభిన్న భావ, భావనలకు…
తమ ఔన్నత్యం,
తమ వునికి
వివిధ సంక్షిప్త భంగిమల
విశ్వ వ్యాప్త విస్త్రుతికై
నిరంతరం క్రుషి చేస్తూ
వున్నాడని
తమ కొరకే అనవరతం
తపన పడుతు వుంటాడని.
సొతంత్రం రాలేదు ఎందుకనో!!!
రచన :నూతక్కి రాఘవేంద్ర రావు
తేది :15-08-2009
సొతంత్రమొచ్చి దేశానికి
ఏళ్ళు పూళ్ళు గడుస్తున్నా
సొతంత్ర భారతాన మనిషికి
యింకా సొతంత్రం రాలేదు ఎందుకనో!!!
భక్షకులై రక్షక భటులు
రక్షణ కరువై పౌరులు
సొతంత్ర భారతాన మనిషికి
యింకా సొతంత్రం
రాలేదు ఎందుకనో !!!
పర రాజ్యపు పాలనలో
వుందేమో !జుట్టు పన్ను
సొతంత్ర భారతాన
బతికుంటే బతుకు పన్ను
పంటి పన్ను కంటి పన్ను
తిండిలేక చస్తుంటే
వేసేస్తాం కరువు పన్ను
సొతంత్ర భారతాన
మనిషికి యింకా
సొతంత్రం రాలేదు ఎందుకనో!!!
పస్తులుండి రూక రూక కూడగట్టి
ఖాళి జాగా కొనుక్కొంటే
వేసేస్తాంఖాళి జాగ పై పన్ను
నీడ కొఱకుగూడు కడితే
గూటిపైన కూడ పన్ను
సొతంత్ర భారతిలో మనిషికి
యింకా సొతంత్రం
రాలేదు ఎందుకనో !!!
సారాయి అమ్ముకునే
ప్రభుత్వాలు
తాగకుంటె పన్నేస్తవి
గుత్తెదారుల
తొత్తులుగా
ప్రపంచ బ్యాంకుకు
బానిసలై
పాలితులను ఫణంగా …. పాలకులు
సొతంత్ర భారతిలో పౌరులకింకా
సొతంత్రం రాలేదు ఎందుకనో !!!
సెజ్ ల పేరిట ఆస్తులు
దోచుకొంటు
ప్రజలు బికారులౌతుంటే
సొతంత్ర భారతిలో
పౌరులకింకా సొతంత్రం
రాలేదు ఎందుకనో!!!
ప్రజలు తప్పు చేయకుండ
చూడాల్సిన ప్రభుత్వాలు
తప్పులు చేయించి మరీ
డబ్బు దోచుకుంటూ టే .
సొతంత్ర భారతిలో పౌరులకింకా
సొతంత్రం రాలేదు ఎందుకనో !!!
అయినా కొందరికి …
అంతా సొతంత్రమే!
ఖైదుల్లో వుండాల్సిన
దొంగలు దోపిడిదారులు
గూండాలూ హంతకులూ
అధికారం చేబట్టి యిపుడు
రాజ్యాలను ఏలుతుంటే
అది కాదా సొతంత్రం !!!!!
నాడు
కూటికి కొరగానివారు
నేడు
అదినాధులు, సంపన్నులు.
అదికాదా సొతంత్రం!!!!!
రహదారులు, ప్రాజెక్టులు,
వ్యవసాయం, పరిశ్రమలు
మంచి నీరు, మురుగునీరు
రైళ్ళు ఇవి అవి ఏవైనా
అన్నింటా తమ కుక్షి ముందు….
కొందరైన సుష్టిగా
దేశాన్నిభోంచేస్తే
అది కాదా సొతంత్రం !!!!!,
పేదరికం నిర్మూలనేల?
పేదల నిర్మూలన …చేసేస్తే పోలా….
దేశమంతా సంపన్నులే
నిరు పేదలు ఇంకెక్కడ?
పట్టపగలు నడిరోడ్డున
ఆడపిల్ల గొంతుకోసి
చంపేస్తే, హంతకుడు
అయిపోడా రాత్రికి రాత్రే
ఎమెల్లె,
యాసిడుపోసి అసువులు
తీస్తే
అతనికి దక్కద ప్రభువుల కొలువు,
ఇదికాదా సొతంత్రం?!!!!!
ఇంతకు మించిన సొతంత్ర భారతి
మరేదిశలో,మరేతీరున ….?
ఆ దిశలో సాధన లో
ప్రభుత! అది కాదా సొతంత్రం !!!!!
సుప్రభాతం నాడు…నేడు
(
నిరంతర అంతరాల విన్యాసం) –5
రచన:నూతక్కి రాఘవేంద్ర రావు.
తేది:26-09-2009
నేతి గిన్నెలోయిడ్లీ ముక్కలు
వేడి పొగల కాఫీ కప్పులు
మొన్న……
బ్రాందీ కప్పుల్లో చికెన్ ముక్కలు
గొంతుల్లో విస్కీ గుక్కలు
నిన్న……
మరి నేడో……ఏమో!!!
అయ్యారే!!!తరతరాల
అంతరాల నిరంతర విన్యాసం
సుప్రభాతం నాడు…నేడు
(
నిరంతర అంతరాల విన్యాసం) –4
రచన:నూతక్కి రాఘవేంద్ర రావు.
తేది:26-09-2009
చద్దన్నం ముద్ద పెరుగు,
ఎరగారపు వూర ముద్ద ,
ఆవురావురున నోరూరిస్తూ
నాడు….
వూరూరా కొన కొనలో యీ ధరా తలాన
తలచుకోను నామోషీ
నేడు…….
అయ్యారే!!!తరతరాల
అంతరాల నిరంతర విన్యాసం
సుప్రభాతం నాడు,నేడు
(నిరంతర అంతరాల విన్యాసం) –౩
(రచన:నూతక్కి రాఘవేంద్ర రావు. )
తేది:26-09-2009
ఆకశాన సుందర నేత్రానందకర
శుభోదయ మహాధ్భుత
ద్రుశ్య గీతికలు
నాడు……
ఆకాశ హర్మ్యాల నీలి నీడలు
ద్రుశ్యా ద్రుశ్యమై సూర్య కిరణం
నేడు…..
అయ్యారే!!!తరతరాల
అంతరాల నిరంతర విన్యాసం
సుప్రభాతం నాడు…నేడు
( నిరంతర అంతరాల విన్యాసం) –2
రచన:నూతక్కి రాఘవేంద్ర రావు.
తేది:26-09-2009
సాంబ్రాణి ధూపాల
పుష్ప సుగంధ సౌరభాల
సౌభాగ్యాలు
నాడు…
ఫ్యాక్టరీ పొగల దుర్భర ధూమం
మురికి కాలువల దుర్గంధ ప్రకోపం
నేడు…..
అయ్యారే!!!తరతరాల
అంతరాల నిరంతర విన్యాసం
సుప్రభాతం నాడు…నేడు
(నిరంతర అంతరాల విన్యాసం) -1
రచన:నూతక్కి రాఘవేంద్ర రావు.
తేది:26-09-2009
పక్షుల కుహు కుహు రావాలు,
కోడికూతల సుప్రభాత గీతాలు
గుడి గంటల రవళులు
లేగ దూడల అంబారవాలు …..
నాడు….
గుడిలో, బడిలో..
మసీదులో, చర్చిలో..
లౌడు స్పీకర్ల…విక్రుత ధ్వనులు…
శుష్కప్రలాప ప్రేలాపనలు
కారు హారన్ల , నీటి ట్యాంకర్ల
దుర్భర శబ్ద కాలుష్యం
నేడు…….
అయ్యారే!!!తరతరాల
అంతరాల నిరంతర విన్యాసం
నిస్వార్ధంగా నిరంతరంగా
(గ్రహాలే విధులు మాని తమ గతులు తప్పితే!!!)
రచన:నూతక్కి రాఘవేంద్ర రావు.
తేది:24-09-2009
కవులెందరో కవనారీతులెన్నో
రచయితలెందరో
రచనావైవిధ్యాలెన్నెన్నో
సామాజిక చిత్రణలో
వాస్తవాలు వెలువరించి
మంచి చెడుల విశ్లేషణ…..
ఏమిటో తమ తీరే గొప్పని ప్రతివారూ…..
చిత్రకారులెందరో
చిత్ర రచనా తీరులూ
చిత్రిత వైచిత్రులు
ఎన్నో ఎన్నెన్నో ….
గాత్రకారులెందరో
గానమాధ్యమాలెన్నో
గానరీతులు మరెన్నో
మానసిక వుల్లాసం
కలిగించే ప్రక్రియలో …….
అదేమిటో!!!
తమ తీరే గొప్పని ప్రతివారూ…..
వైద్యం వ్యవసాయం
యంత్రాగారం శాస్త్రగ్నానం
రాజకీయ పార్టీలు నాయకులు
జనజీవన సంవిధాన
ప్రక్రియలో నియంత్రణలో…..
అదేమిటో!!!
తమ తీరే గొప్పని ప్రతివారూ…..
దేవుళ్ళు దేవుడిగుళ్ళు
మసీదులు చర్చిలు
సిక్కులు బౌద్ధులు
జైనులు పార్సీలు
వైవిధ్యం ఆధ్యాత్మికం
అదేమిటో!!!
తమ తీరే గొప్పని ప్రతివారూ ……
కానీ కానీ కానీ ……
జానపదులు
జీవనదులు
జంతుజాల
జలజీవన
వైవిధ్యం…
పశుపక్షులు
పర్వతాలు
అరణ్యాలు….
నేత్రపర్వ సంగీతం
సూర్యుడు చంద్రుడు
గ్రహరాశులూ,
దివారాత్రములు,
వివిధరుతువులు
జీవజాల సర్వోన్నతికై
సర్వ జగతి సంరక్షణకై
నిస్వార్ధంగా నిరంతరంగా
ఏమో…. ఎన్నడైన
తమ లో తాము పోటీపడి
తాము గొప్ప తామే గొప్పని
మనిషి నుండి నేర్చుకొని
స్వార్ధం జీర్ణించుకొని
విధులు మాని
గతులు తప్పితే !!!!