దుర్ఘటన పాలయిన సిఎం హెలికాప్టర్

 రచన:నూతక్కి రాఘవేంద్ర రావు.

01-09-2009 01-10 A.M

 సి ఎం క్షేమంగా తిరిగి వస్తారు ప్రజల ఆకాంక్ష మనో వాంఛ.  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాధినేత పయనించే హెలికాప్టర్ అద్రుశ్యమై ఆచూకీ తెలియక పోవడం, పదిహేను గంటల సమయం దాటినా ఆచూకీ తెలియకపోవడం, ఆధునిక సాంకేతిక యుగంలో సమాచార విప్లవాన్ని ఆవిష్కరించిన దేశంలో ముఖ్యమంత్రి ఇంత సమయం అద్రుశ్యమై పోవడం , ఆచూకీ తెలియకపోవడం సిగ్గు చేటు.యీ ఘటన రాష్త్ర ప్రజలనే కాదు, దేశ ప్రజలందరినీ కలచివేస్తూంది. ఒక రాష్త్రాధినేత ఒంటరిగా హెలికాప్టర్ లో అంటే మరో అనుచర హెలికాప్టర్ అనుసరించకుండా వెల్లడం ఎంతవరకు సమంజస విధానమో కాదో తెలియదు కానీ రోడ్డు ప్రయాణం లో లా రాజ్యాధినేతల వెంట వుండే ఫ్లీట్ లాగా హెలికాప్టర్ల వెంట కూడా ఎల్లప్పుడూ ఒక రక్షక దళ హెలికాప్టరు కూడా ఆనుసరించి వుండి వుంటే వెనువెంటనే చర్యలు చేపట్టే అవకాశం వుండి వుండేది.అదే విధంగా అత్యంత షక్తి వంతమైన సమాచారాన్ని అందించే పరికరాలు కూడా వారితో వుండేలా చూసి వుంటే బాగుండి వుండేది. అంతే కాక వంద మైళ్ళు లోపు దూరాలకు తప్ప హెలికాప్టర్ వాడతం అధినేతలకు సమంజసం కాదు సురక్షితం కాదు అని నిపుణుల అభిప్రాయాలు వెలువడుతున్నాయి.అందీ కాక ఆంధ్ర ప్రదేష్ ముఖ్య మంత్రి శ్రీ రాజశెఖర రెడ్డి గారు ప్రయాణించిన హెలికాప్టర్ ను ప్రయాణానికి ముందు పూర్తిగా పరీక్షించారా అన్నది మరో అనుమానం నిపుణులు వ్యక్త పరుస్తున్నారు. దీనంతటికీ అధికారుల నిర్లక్ష్య వైఖరీ, వ్యూహ రచనలో వైఫల్యత, అలసత్వం కనపడుతోంది. జరిగిందేమైనా,దుర్ఘటన యెలాటిదయినా ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా ,ఆయనా ఆయన అనుచరులు సురక్షితంగా తిరిగి వచ్చి ప్రజల మనో క్షొభను తొలగించేలా చేయమని ప్రజలు అభిమానులు, పార్టీ శ్రేణులూ భగవంతుని ప్రార్ధిస్తున్నారు. మనమూ ఆయన క్షేమంగా తిరిగి రావాలని కాంక్షించుదాం .

ప్రకటనలు