“తెలుగు కధానికకు వంద జేజేలు ”
             అంటూ
 కుహు-కుహు మంది  కోకిలం
రచన:  నూతక్కి రాఘవేంద్ర  రావు.
తేది:22-09-2009,సమయం :00.25అం.

“తెలుగు కధానికకు వంద జేజేలు “అంటూ     కుహు-కుహు మని రాగాలు ఒలికించిన  కోకిలం .

       శ్రీ పులిగడ్డ విశ్వనాధ రావు గారి అద్యక్షతన హైదరాబాద్ మహానగర పురపాలక శాఖ ,కప్పర నగరంలోని   డా.ఎ.ఎస్.రావ్ నగర్ వయో వ్రుధ్ధు ల సంక్షేమ స్థలి ప్రాంగణంలో ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు  సాహితీ  సాంస్క్రుతిక వేదిక  “కోకిలం “తమ నిరంతర కార్యక్రమాలలో భాగంగా …..”తెలుగు కధానికకు వంద జేజేలు ” అనే కార్యక్రమాన్ని   దిగ్విజయంగా నిర్వహించారు.

ముఖ్య అతిధిగా విచ్చేసిన కధాౠషి  ,కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత అయిన శ్రీ మునిపల్లె రాజు గారు మాట్లాడుతూ, కోకిలం నిర్వహిస్తున్న సాహితీ కార్యక్రమాలను ప్రస్తుతించారు.  అంతకు ముందు సభను ప్రారంభిస్తూ శ్రీ  విశ్వనాధ రావు గారు ,ముఖ్య అతిధిని, వక్తలనూ సభకు పరిచయం చేసారు. 
 
తెలుగు కధానికలో స్త్రీవాదం పై ప్రముఖ స్త్రీ వాద రచియిత్రి  ఓల్గా మాట్లాడుతూ అందుకు పూనుకున్న రచయితలు, రచియిత్రులు, అందుకై వారు చేసిన క్రుషి గురించి విపులంగా చర్చించి ,సమాజంలో స్త్రీ పై జరిగిన ,జరుగుతున్న దోపిడీ ,దాని  పూర్వాపరాలను , కధానిక ధ్రుక్కోణం నుంచి మహత్తరంగా విశ్లేషిస్తూ ప్రసంగించి ఆహూతులైన సాహితీ ప్రియులను అలరించారు. 

 తదుపరి ప్రముఖ సాహితీ విమర్శకులు శ్రీ ఆర్వీయార్ తనదయిన  శైలిలో తెలుగు కధానిక ,పురోగతి ,భవిత అన్న అంశం పై సోదాహరణంగా ప్రసంగించి సభను మంత్ర ముగ్ధులను చేశారు.

 శ్రీ నూతక్కి రాఘవేంద్ర రావు,  కోకిలం ఆవిర్భావాన్ని ప్రస్థుతిస్తూ,ఆ ప్రాంత వైసిష్ట్యాన్ని తన స్వీయ  కవిత “కోయిలై కూసింది కోకిలం” అనే స్వీయ కవిత ద్వారా వివరించతమే కాక ,నిరంతరం అనే మరో  స్వీయ స్త్రీ వాద కవితను ,చదివారు.   
 
అంతకు ముందు కోకిలం సంస్థ తొలి ప్రచురణ,శ్రీ పులిగడ్డ విశ్వనాధ రావు గారి రచన “కలియుగ క్రిష్త్నార్జునులు ”
కధా సంపుటి గ్రంధావిష్కరణ జరిగింది. ప్రముఖ సాహితీవేత్త శ్రీ గుడిపాటి ఆ గ్రంధాన్ని విశ్లేషించారు.

యీ సమావేశానికి విచ్చేసిన ప్రముఖులలో ప్రముఖ సాహితీ వేత్త ఆచార్య ఫణీంద్ర, ప్రముఖ తెలంగా,మాండలిక  కధా రచియిత శ్రీ భూమయ్య ,యితర సాహితీ ప్రియులు వున్నారు.

క్రుతఙ్ఞతా నివేదనానంతరం సభ ముగిసింది.

 నిబధ్ధతతో సంస్థను నిర్వర్తిస్తూ వివిధ కార్యక్రమాలు రూపొందిస్తూ ఆచరణలో నిర్వహిస్తున్న కార్యనిర్వాహక వర్గం బహుదా అభినందనీయులు,ప్రశంసనీయులు
. .   
ప్రకటనలు