సుప్రభాతం నాడునేడు

( నిరంతర అంతరాల విన్యాసం) 2

రచన:నూతక్కి రాఘవేంద్ర రావు.

తేది:26-09-2009

సాంబ్రాణి ధూపాల

పుష్ప సుగంధ సౌరభాల

సౌభాగ్యాలు

నాడు…

ఫ్యాక్టరీ పొగల దుర్భర ధూమం

మురికి కాలువల దుర్గంధ ప్రకోపం

నేడు…..

అయ్యారే!!!తరతరాల

అంతరాల నిరంతర విన్యాసం