వివిధ భావనలు, నిమ్న యోచనలు

 రచన: నూతక్కి రాఘవేంద్ర రావు.

తేది: 29-09-2009

చిట్టి చిట్టి పదాల కూర్పులు

 కవి అల్లిన చిరు కవితలు

నిభిడీక్రుత భావనలు

విడుస్తున్న నిట్టూర్పులు ….

తమ విశాల విశ్వ రూపం

 కుబ్జమై కుదింప బడు తోందని .

తెలియదు లే !! పాపం !!

విభిన్న భావ, భావనలకు…

తమ ఔన్నత్యం,

తమ వునికి

వివిధ సంక్షిప్త భంగిమల

 విశ్వ వ్యాప్త విస్త్రుతికై

నిరంతరం క్రుషి చేస్తూ

వున్నాడని

తమ కొరకే అనవరతం

 తపన పడుతు వుంటాడని.