సొతంత్రం రాలేదు ఎందుకనో!!!

 రచన :నూతక్కి రాఘవేంద్ర రావు

 తేది :15-08-2009

సొతంత్రమొచ్చి దేశానికి

 ఏళ్ళు పూళ్ళు గడుస్తున్నా

 సొతంత్ర భారతాన మనిషికి

యింకా సొతంత్రం రాలేదు ఎందుకనో!!!

 భక్షకులై రక్షక భటులు

 రక్షణ కరువై పౌరులు 

 సొతంత్ర భారతాన మనిషికి

 యింకా సొతంత్రం

రాలేదు ఎందుకనో !!!

పర రాజ్యపు పాలనలో

వుందేమో !జుట్టు పన్ను

 సొతంత్ర భారతాన

బతికుంటే బతుకు పన్ను

 పంటి పన్ను కంటి పన్ను

 తిండిలేక చస్తుంటే

 వేసేస్తాం కరువు పన్ను

 సొతంత్ర భారతాన

మనిషికి యింకా

 సొతంత్రం రాలేదు ఎందుకనో!!!

 పస్తులుండి రూక రూక కూడగట్టి

ఖాళి జాగా కొనుక్కొంటే

 వేసేస్తాంఖాళి జాగ పై పన్ను

 నీడ కొఱకుగూడు కడితే

 గూటిపైన కూడ పన్ను

 సొతంత్ర భారతిలో మనిషికి

 యింకా సొతంత్రం

 రాలేదు ఎందుకనో !!!

సారాయి అమ్ముకునే

 ప్రభుత్వాలు

 తాగకుంటె పన్నేస్తవి

గుత్తెదారుల 

 తొత్తులుగా

 ప్రపంచ బ్యాంకుకు 

బానిసలై

 పాలితులను ఫణంగా …. పాలకులు

సొతంత్ర భారతిలో పౌరులకింకా

సొతంత్రం రాలేదు ఎందుకనో !!!

సెజ్ ల పేరిట ఆస్తులు

 దోచుకొంటు

 ప్రజలు బికారులౌతుంటే

సొతంత్ర భారతిలో

 పౌరులకింకా సొతంత్రం

రాలేదు ఎందుకనో!!!

 ప్రజలు తప్పు చేయకుండ

చూడాల్సిన ప్రభుత్వాలు

 తప్పులు చేయించి మరీ

డబ్బు దోచుకుంటూ టే .

 సొతంత్ర భారతిలో పౌరులకింకా

సొతంత్రం రాలేదు ఎందుకనో !!!

అయినా కొందరికి …

అంతా సొతంత్రమే!

 ఖైదుల్లో వుండాల్సిన

 దొంగలు దోపిడిదారులు

గూండాలూ హంతకులూ

అధికారం చేబట్టి యిపుడు

 రాజ్యాలను ఏలుతుంటే

 అది కాదా సొతంత్రం !!!!!

నాడు

 కూటికి కొరగానివారు

నేడు

 అదినాధులు, సంపన్నులు.

 అదికాదా సొతంత్రం!!!!!

 రహదారులు, ప్రాజెక్టులు,

 వ్యవసాయం, పరిశ్రమలు

 మంచి నీరు, మురుగునీరు

 రైళ్ళు ఇవి అవి ఏవైనా

అన్నింటా తమ కుక్షి ముందు….

 కొందరైన సుష్టిగా

దేశాన్నిభోంచేస్తే

అది కాదా సొతంత్రం !!!!!,

 పేదరికం నిర్మూలనేల?

పేదల నిర్మూలన …చేసేస్తే పోలా….

దేశమంతా సంపన్నులే

నిరు పేదలు ఇంకెక్కడ?

 పట్టపగలు నడిరోడ్డున

ఆడపిల్ల గొంతుకోసి

 చంపేస్తే, హంతకుడు

అయిపోడా రాత్రికి రాత్రే

 ఎమెల్లె,

 యాసిడుపోసి అసువులు 

తీస్తే

అతనికి దక్కద ప్రభువుల కొలువు,

ఇదికాదా సొతంత్రం?!!!!!

ఇంతకు మించిన సొతంత్ర భారతి

మరేదిశలో,మరేతీరున ….?

ఆ దిశలో సాధన లో

ప్రభుత! అది కాదా సొతంత్రం !!!!!