సెప్టెంబర్ 2009


దివాకరుడు

రచన:నూతక్కి రాఘవేంద్ర రావు.

తేదీ:

23-09-2009

జానెడు పొట్ట కొరకు.. వేట

మనిషి తన వునికి కొరకు

సరిహద్దుల సయ్యాట

గ్రామం, ప్రాంతం, రాష్ట్రం ,దేశం

ఖన్డ ఖన్డాన్తరాల

ప్రుధ్వీతల విభాజనం

సరిహద్దుల

సంరక్షణకై తునాతునకలయి

ప్రతి నిత్యం వేనవేల మానవ

కంకాళపు గుట్టలు

మతమన్నది మానవ హ్రుది

భావనయని స్వభావమని

యోచన కరువౌతున్న వేళ

మతం పేర విభజనం

జాతి పేర విభజనం

కులం పేర విభజనం

కుక్షి కొరకు విక్రుత

విశ్రుంఖలసంగ్రామం

గీతైనా,ఖురానైన

బైబిలైన గ్రంధాసాహెబైన

బౌధమైన జైనమైన

శైవమైన వైష్ణవ భావమైన

మానవ మనోభావ స్రుష్టితాలే

విభేదాలు ఎన్నున్నా

అందరూ చెప్పేదొకటే

“సర్వేజనా సుఖినోభవంతు”.

అందరు నమ్మిన

ఆది దేవుడొకడే

అఖిల జగతి

ఆరాధ్యుడు

అవని లోన

ప్రతీ అణువుకు

ప్రతి క్షణం

పునరుజ్జీవం

అందించే

ఆదిత్యుడు

ఆ సూర్యుడే !!

.

దేవాలయాలపై బూతు బొమ్మలు

రచన:నూతక్కి రాఘవేంద్ర రావు.

తేది:21-09-2009

ఆది నుండి

సమిష్టి సంఘజీవనమ్

మానవ జీవన విధానమ్

ప్రాక్రుతిక విక్రుతుల నుండి

పాశవిక శక్తులనుండి

రక్షించే ఆది దేవుడా ఆదిత్యుడు.

వుత్థానంలో శక్తియుతుడు

పతనంలొ బలహీనుడు.

శక్తినిచ్చు ఆదేవుడు బలహీనుడైతె !!!!

శ్రుష్టి కార్యమెటుల సేయు ?

మానవ జాతిని రక్షించునెటుల

సంతసమున శక్తిని మనకెటులనిచ్చు

అందులకే ఆతనికై మనమంతా

అందిద్దాం చేయూతను

మన శక్తి కొలది యుక్తికొలది

ఆది దేవుని ఆత్మ త్రుప్తికి

సామూహికం శ్రుంగారం

అందరం మనమందిద్దాం

ఒక నిర్దేసిత ప్రదేశాన………

ఆ కాలపు మానవ సమాజమొక

జంతు సామ్య సమ్మేళనమ్.

అమ్మలేదు అయ్యలేడు

అక్కలేదు చెల్లె లేదు

అన్నతమ్ముడన్న

వావి వరుసలసలె  లేవు  

  శ్రుంగారం ఒకఆకలి  

శ్రుంగారం ఒకదప్పిక

శ్రుంగారం ఓ నిత్య సరళి

తత్కాలోధ్భవ వుత్ప్రేరణ

ఆదిత్యుని కై తర్పణ

సామూహిక శ్రుంగారప్రక్రియ

తద్భావనలో వేదనలొ

వుద్భావమె దేవళమ్

పగలేమో అడవిలొన

రాత్రేమో గుడిలోన

దేవునికై శరీరాల సంఘర్షణ

 నాగరికతా ప్రేరణలో

నాది నాది అనుకుంటూ

స్వార్ధ చింత మెదిలినంత

నా యిల్లు నాభార్య నాపిల్లలు

నా తల్లి నా తండ్రి నా అక్క నాసెల్లె

నాఅన్న, నాతమ్ముడు

స్వభావాన  స్వ భావన

తన మన తార తమ్యం

తలపును తొలిచిన 

వేదన

మగవానికి తప్పులేదు

మా ఆడవాళ్ళు

ఆ పనికి పోరు.

దేవుని కార్యమో….దైవ భీతి !!!

వేరెవరైనా ఒప్పుకున్న….

ఆపనికై

శరీరాన్ని అద్దెకిస్తె

వుమ్మడిగా అందిద్దాం

ఆహారం ఆధరువులు.

తత్భావనోధ్భవమే

దేవదాసీ సంవిధానం
 
తదంనంతర కాలాల్లో
 
 నాగరీక భావనలో

సంస్కర్తల వేదనతో

తద్వ్యవస్తరూపుమాపే

యత్నంలో

సూర్యదైవ కరుణకొరకు

ప్రత్యామ్న్యాయం

శిలా రూప శ్రుంగార విన్యాసం

దేవాలయాలపై బూతు బొమ్మలు.

 

(స్పూర్తి: శ్రీ తాపీ ధర్మారావువిరచిత
“దేవాలయాలపై బూతు బొమ్మలెందుకు”..
అనే గ్రంధం ద్వారా ..మరియు.
” sex around the world” అనే
ఆంగ్ల గ్రంధం,రచయిత పేరు గుర్తు లేదు)

“తెలుగు కధానికకు వంద జేజేలు ”
             అంటూ
 కుహు-కుహు మంది  కోకిలం
రచన:  నూతక్కి రాఘవేంద్ర  రావు.
తేది:22-09-2009,సమయం :00.25అం.

“తెలుగు కధానికకు వంద జేజేలు “అంటూ     కుహు-కుహు మని రాగాలు ఒలికించిన  కోకిలం .

       శ్రీ పులిగడ్డ విశ్వనాధ రావు గారి అద్యక్షతన హైదరాబాద్ మహానగర పురపాలక శాఖ ,కప్పర నగరంలోని   డా.ఎ.ఎస్.రావ్ నగర్ వయో వ్రుధ్ధు ల సంక్షేమ స్థలి ప్రాంగణంలో ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు  సాహితీ  సాంస్క్రుతిక వేదిక  “కోకిలం “తమ నిరంతర కార్యక్రమాలలో భాగంగా …..”తెలుగు కధానికకు వంద జేజేలు ” అనే కార్యక్రమాన్ని   దిగ్విజయంగా నిర్వహించారు.

ముఖ్య అతిధిగా విచ్చేసిన కధాౠషి  ,కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత అయిన శ్రీ మునిపల్లె రాజు గారు మాట్లాడుతూ, కోకిలం నిర్వహిస్తున్న సాహితీ కార్యక్రమాలను ప్రస్తుతించారు.  అంతకు ముందు సభను ప్రారంభిస్తూ శ్రీ  విశ్వనాధ రావు గారు ,ముఖ్య అతిధిని, వక్తలనూ సభకు పరిచయం చేసారు. 
 
తెలుగు కధానికలో స్త్రీవాదం పై ప్రముఖ స్త్రీ వాద రచియిత్రి  ఓల్గా మాట్లాడుతూ అందుకు పూనుకున్న రచయితలు, రచియిత్రులు, అందుకై వారు చేసిన క్రుషి గురించి విపులంగా చర్చించి ,సమాజంలో స్త్రీ పై జరిగిన ,జరుగుతున్న దోపిడీ ,దాని  పూర్వాపరాలను , కధానిక ధ్రుక్కోణం నుంచి మహత్తరంగా విశ్లేషిస్తూ ప్రసంగించి ఆహూతులైన సాహితీ ప్రియులను అలరించారు. 

 తదుపరి ప్రముఖ సాహితీ విమర్శకులు శ్రీ ఆర్వీయార్ తనదయిన  శైలిలో తెలుగు కధానిక ,పురోగతి ,భవిత అన్న అంశం పై సోదాహరణంగా ప్రసంగించి సభను మంత్ర ముగ్ధులను చేశారు.

 శ్రీ నూతక్కి రాఘవేంద్ర రావు,  కోకిలం ఆవిర్భావాన్ని ప్రస్థుతిస్తూ,ఆ ప్రాంత వైసిష్ట్యాన్ని తన స్వీయ  కవిత “కోయిలై కూసింది కోకిలం” అనే స్వీయ కవిత ద్వారా వివరించతమే కాక ,నిరంతరం అనే మరో  స్వీయ స్త్రీ వాద కవితను ,చదివారు.   
 
అంతకు ముందు కోకిలం సంస్థ తొలి ప్రచురణ,శ్రీ పులిగడ్డ విశ్వనాధ రావు గారి రచన “కలియుగ క్రిష్త్నార్జునులు ”
కధా సంపుటి గ్రంధావిష్కరణ జరిగింది. ప్రముఖ సాహితీవేత్త శ్రీ గుడిపాటి ఆ గ్రంధాన్ని విశ్లేషించారు.

యీ సమావేశానికి విచ్చేసిన ప్రముఖులలో ప్రముఖ సాహితీ వేత్త ఆచార్య ఫణీంద్ర, ప్రముఖ తెలంగా,మాండలిక  కధా రచియిత శ్రీ భూమయ్య ,యితర సాహితీ ప్రియులు వున్నారు.

క్రుతఙ్ఞతా నివేదనానంతరం సభ ముగిసింది.

 నిబధ్ధతతో సంస్థను నిర్వర్తిస్తూ వివిధ కార్యక్రమాలు రూపొందిస్తూ ఆచరణలో నిర్వహిస్తున్న కార్యనిర్వాహక వర్గం బహుదా అభినందనీయులు,ప్రశంసనీయులు
. .   
అపస్మారకం
 రచన: నూతక్కి రాఘవేంద్ర రావు
 తేది:19-09-2009
 
నా హృదయాన్తర్భాగాలలో
అశక్తత ,ఆందోళన ,
ఆవేదన, మనసు ఘనీభవించి
 
అచేతనలో …..
చేతనా చేతన స్థితి.
జరిగేది జరుగుతూనే వుంది.
అర్ధం అనర్ధం అర్ధం చేసుకోలేని
నిరర్ధక అయోమయ దయనీయ
హృదయ విదారక వికృత స్థితి.
ఏవేవో శబ్దాలు ,ఎవరెవరివో
గొంతులు ,
కొన్ని పరిచితాలు ,
కొన్నిఅపరిచితాలు.

చేతనాచేతనలో ….నేను

(నా ముక్కు పైన దురద , ఎవరికీ అర్ధంకాదెందుకనో )

రచన:నూతక్కి రాఘవేంద్ర రావు తేది: 18-09-2009 , సమయం రాత్రి 11-00 గం.లు

 నాకు దాహం… గొంతు ఎండి పోతోంది…. దాహం …దాహం … అరుస్తున్నా….., అర్ధిస్తున్నా…. ఎవరూ అర్ధం చేసుకున్నట్లు లేరు. నీళ్ళు …నీళ్ళు త్రాగాలి నోటితో చెప్పలేక పోతున్నా ఏదో పెట్టినట్లున్నారు ముక్కుకూ నోటికీ… ఏమి జరుగు తోందో చూద్దామన్నా నా కళ్ళు తెరిపిడి పడవే !! సంజ్ఞలతో తెలియ చేద్దామని చేతులు ఎత్తాలని నా యత్నం విఫలం !! ఎవరో దుర్మార్గులు నా స్వాతంత్రాన్ని హరిస్తున్నారు. ఎవరో, వారెవరో ..

నా చేతులు కదలకుండా పట్టినట్లున్నారు. వళ్ళంతా చేతులపై భుజాలపై తుంటిపై నరాలలో సూదులు గుచ్చిన పోటు నా చేతులతో రుద్దుకొందామని నా ముక్కు గోక్కుందామని ప్రయత్నిస్తూ విఫలుడనై…. నన్నెవరో ఏదో చేసేస్తున్నారు కుట్ర!!! నాపై కుట్ర జరుగుతోంది , ఎదిరించాలి … ప్రతిఘటించాలి … నాలో ఏదో మొండితనం ఏదో చేయాలి ఈ బంధాలనుండినేను విముక్తి పొందాలి జరిగిందేమిటో తెలియదు జరుగుతున్నదేమిటో కూడా తెలియదు నేనెక్కడున్నాను ?అసలేమి జరిగింది మనసుకు పదును పెడుతున్నా !!

 జ్ఞాపకాల దొంతరలో పెజీలు విచ్చుకొంటున్నాయ్ ఒకటొక్కటిగా…. నాకు ఎదురుగా రోడ్డు ను, వేగంగా దాటాలని ఆత్రంగా కుక్క పిల్ల! స్కూటర్ కు సడెన్ బ్రేకు. అంతే నాకేమీ తెలియదు .

ఎవరో మాట్లాడుతున్నారు……. కాదు కాదు కొట్లాడుతున్నారు నాకు అర్ధమౌతోంది యాక్సిడెంట్ అయ్యి పదిహేను రోజులు స్పృహలో కొచ్చేదేప్పుడు?అసలు మీ వల్ల అవుతుందా ? ఏడుస్తూ ఆక్రోశంతో ఎవరినో నిలదీస్తూ …అది…అదీ… నా ..నా భార్య గొంతు . బాధా ఆవేదన మిళితమై ఆ గొంతు నా భార్య గొంతు.

 పాపం ఆ కుక్క పిల్ల కి ఏమీ కాలేదు కదా మెల్లిగా నీరసంగా నా మొదటి ప్రశ్న. నాకే తెలుస్తోంది ఎక్కడో లోలోతుల నూతినుంచి వచ్చి నట్లు నా గొంతుక నా కనులు మాత్రం తెరిపిడి పడటం లేదెందుకనో.

 మీ వారు స్ప్రుహలోకి వచ్చారమ్మా ఎవరో చెబుతున్నారు. నా ముక్కు పైన దురద పెడుతోంది అర్జెంటుగా గోక్కోవాలి, నీళ్ళు కావాలని చెప్పాలి. నా వళ్ళంతా నొప్పులు … రుద్దుకోవాలి ఎటు కదిలినా భయంకర నొప్పులు. ఎవరు నన్ను బంధించారో ఎందుకు బంధించారో, అడగాలి .

జరిగిందేమిటో తెలియదు. జరుగుతున్నదేమిటో కూడా తెలియదు . నేనెక్కడున్నాను ?అసలేమి జరిగింది ? మనసుకు పదును పెడుతున్నా !! కొంచెం కొంచెం అర్ధమౌతోంది . మరలా కనులముందు కదలాడిందా ద్రుశ్యం. నాకు ఎదురుగా రోడ్డు వేగంగా దాటాలని కుక్క పిల్ల స్కూటర్ కు…. సడెన్ బ్రేకు అంతే !! నాకేమీ తెలియదు . పాపం ఆ కుక్క పిల్ల కి ఏమీ కాలేదు కదా మెల్లిగా నీరసంగా మరో మారు నా ప్రశ్న .
 పాపం !నేటికి పదిహేను దినాలు ఇప్పుడేకళ్ళు తెరిచాడు. ఎవరికో చెబుతూ… కదల నివ్వకండ మ్మా 
కదల నివ్వకండ మ్మా ముక్కు గోక్కోవాలనుకుంటాడు , ముక్కు కట్టు జాగ్రత్త, నీళ్ళివ్వకండి సెలయిను ఎక్కుతోంది . హెచ్చరించి వెళుతూ నర్సు . …..

చూపులతోనే కరకరా నమిలి మింగేయాలని ఆమెను కర్కశంగా చూస్తూ నా మనసు. నా ముక్కు గోక్కో లేక, దాహం తీర్చుకోలేక , శత్రువుకు కూడా వద్దు ఆ నా బాధ..నా భార్యను చూడాలని ఆమెతో మాట్లాడాలని నా మనసు ఆత్ర పడుతోన్నా, నా ముక్కు గోక్కోవాలనే కోరిక , నీళ్ళు త్రాగాలనే తపన వేరే దేని గురించీ ఆలోచించనివ్వడం లేదు.అంతేఅసహాయతతో భోరున రోదిస్తూ నేను …..

నేటి యువతలో..ఎందరిలోనో  
రచన: నూతక్కి రాఘవేంద్ర రావు
తేది: 16-09-2009
 
ఆశలు ఆకాంక్షలు

నిరంతరం

అనంత విశ్వ విహారం        
 
ఆలోచనా యోచనలు   

వూహల పల్లకిలో ….

మహత్తర అధ్భుతాల

నిరీక్షణలో …  

 విను వీధిన  వాయు

 భవన నిర్మాణం 

తమ  శక్తిని కాన లేని  

తమ యుక్తిని వెలికి తేని

నిర్దేశక రాహితిలో 

కోట్ల కొలది  భావి యువత …. 
    

 

 

 

భారత దేశపు నాణేలు,  కరెన్సీ నోటులు ,  స్వతంత్రానికి  ముందు ,తరువాత
రచన:నూతక్కి రాఘవేంద్ర రావు.
తేదీ: 13-09-2009 

 దమ్మిడి,కాణీ,అర్ధణ (అర్ధ అణ),అణ ,బేడ,పావలా ,అర్ధ రూపాయి ,రూపాయి ,దమ్మిడి ,కాణి,అర్ధణా, అణా,బేడ, వీటి గురించి ఎప్పుడైనా విన్నారా? అవేంటో అసలు  మీకు తెలుసా ?  ఓకే –ఓకె …తెలిసుంటే  సరే తెలియకపోతే అవేంటో యిప్పుడు తెలుసుకుందాం సరేనా ?అవన్నీ మన నాణేలే.మెట్రిక్ ప్రమాణాలలో నయా పైసల కరెన్సీ  1957 లో ఆవిర్భవించి వాడుకలోకి వచ్చే వరకు ,ఆ తరువాతకూడా  చాలాకాలం వరకు సమాంతరంగా మన భారత ఆర్ధిక వ్యవస్తలో చలామణీలో వున్న నాణేలు ,కేవలం నాణేలే కాదు,సామాజికంగానూ , సాహితీపరంగానూ, వ్యావహారికంగానూ, జీవన రీతుల్లో జీర్ణించుకు పోయిన మహత్తర వ్యవస్త. .   
మూడు దమ్మిడీలు ఒక కాణీ ,రెండు కానులు ఒక అర్ధణ,నాలుగు కానులు ఒక అణా.
పదహారణాలు ఒక రూపాయి .

 
రూపాయి నాణెం ఒక తులం వెండి తో చేసేవారు.
దమ్మిడీలు ,కానులు,(కాణీ కి బహువచనం కానులు.పొరబాటున కాసులని అనుకునేరు) రాగితోనూ, అర్ధణాలు ,అణాలు , బేడలు ,రాగి ఇత్తడి – లోహ మిశ్రమం తోనూ, పావలాలు ,అర్ధ రూపాయి నాణాలు నికెల్ లోహ మిశ్రమం తోనూ చేసే వారు. వీటి అన్నిటి పైనా ఒక ప్రక్క ఆయా సమయాలలో బ్రిటీష్ సామ్రాజ్యాన్ని పాలించే చక్రవర్తి చిత్తరువులు ముద్రించి వుండేవి. రెండో ప్రక్క నాణెపు విలువ తెలియ చేసే ముద్ర వివిధ భాషల్లో వుండేది.
దమ్మిడీ అప్పటి నయా పైసా సైజులో రాగితోనూ ,కాణీ రాగితోనే చేయబడి రెండు మూడు రూపాల్లో చలామణిలో వుండేవి.

చిన్న కాణీ ,చిల్లు కాణీ , పెద్ద కాణీ .విలువ ఒకటే కాని,  రూపాల్లో తేడా. చిన్న కాణి మీద చక్రవర్తి బస్ట్ సైజు బొమ్మ కిరీటంతో సహా వుండేది. చిల్లు కాణీలో కిరీటం మాత్రమె వుండేది. పెద్ద కాణి లు కొన్నిటిలో కిరీటం లేని బోడిగుండు చక్రవర్తి బొమ్మ వుండేది. కొన్నిటి పైన కిరీటం వున్న జార్జి చక్రవర్తి బొమ్మ (అనుకుంటాను)వుండేది.
అర్ధణా, నాలుగు పలకలుగాను, అణా పాత పది పైసల నాణెం లా  గుండ్రంగా ,అంచు మొత్తం  గగ్గులతొ  చిన్న సైజులలోనూ వుండేది. బేడ, నాలుగు పలకలతో నూ, పావలా నాణెం యిప్పటి పావలా లా గుండ్రంగా వుండేది . (దాని పైన వుండే బొమ్మ,యితర వివరాలు తప్పితే,) .
అలాగే ,అర్ధ రూపాయి ,రూపాయి నాణేలు కూడా ఆ మధ్య కాలం నాటి పెద్ద సైజు , యాభై పైసల,  వంద పైసల  నాణేల సైజులో వుండేవి. ఇప్పుడంటే మన రూపాయి నాణేల సైజు చాల చిన్నగా  అర్ధ రూపాయి సైజులో వస్తున్నయి కాని,  వంద పైసల రూపాయి బిళ్ళ  మాత్రం అప్పటి   భ్రిటిష్   రూపాయి సైజులోనె  వుండేది .
1957 వ సంవత్సరం  నుండి స్వతంత్ర భారత ప్రభుత్వం తన స్వంత ముద్రలతొ నాణేలు ముద్రించడం ప్రారంభించింది .నయా పైసా,అన్నిటికన్న తక్కువ విలువ కల నాణెం.రూపాయిలో వందో వంతు.    జవహర్లాల్ నెహ్రు, మహాత్మ గాంధి  ,మూడు సిం హాల   గుర్తు ల తొనూ  యీ నాణేలు వుంటాయి.
అప్పటి రూపాయి నొటు  యిప్పటి రూపాయి నోటు   వలెనే   వుండి, బొమ్మలు, వివరాలు వేరు గ  వుండేవి. యిప్పుడేమొ  వంద పైసలు అని వుంటే అప్పటి   రూపాయి నోటు పై  పదహారు అణాలు అని వుండేది.
రూపాయి ,రెండు రూపాయలు ,,అయిదు రూపాయలు, పది రూపాయలు, వంద రూపాయల నోటులు   వుండేవి .ఇరవై ,యాభై రూపాయల నోటులు   వుండేవి కావు.

ఇక పోతె,  స్వతంత్ర భారత దేశంలొ   విలీనం కాకముందు నిజాం
 ప్రభుత్వంలో వేరే నాణెలు వుండేవి.వాటి కొరకు వాడే లోహాలు, రూపాలు ,పేరులు వేరుగా వుండేవి.  
 
(Pl.Note: యీ విషయాలపై మీకు ఆసక్తిని కలిగించాలనే నా యీ ప్రయత్నంలో ,యిక్కడ పొందుపరిచిన  వివరాలు ఏవైనా  ,వాస్తవ ప్రమాణాలకు సరితూగ  లేదని మీరు  భావించినా ,అసంపూర్ణంగావున్నాయని మీకు  అనిపించినా ,  మరిన్ని వివరాలు మీలో ఎవరికైనా సోదాహణంగా తెలిసి వుంటే, నాకు ఆయా వివరాలు వివరణలతో అందించ గలరు. ఆయా నాణేల చిత్తరువులు అందుబాటులో  వుంటే   పంపించ గలరు.  .  . రచయిత    )     
      

ఎరుపు క్రింది నలుపులు …ఎర్ర గురివిందలు

 రచన:నూతక్కి రాఘవేంద్ర రావు

1972

1971 , 1972 సం .రాల సమయంలో కార్మికోద్యమాలకు సారధ్యం వహించే సమయంలో జరిగిన అనేక ఘటనల నేపధ్యంలో నన్ను నేను జాగృత పరచుకునే యత్నంలో నా కొరకై నే రాసుకున్న నా స్వయం రాతల గీతలు. ….) …………………………….

యాజమాన్య విధి విధాన

 తాడనలో కనలి కుమిలి

కార్మికులు శ్రామికులు

కోర్కెల సాధనకై

మూసుకు పోయి

సామరస్య మార్గాలు

 సమ్మె ఒకటే మార్గమన్న

తాడిత పీడిత

 కార్మిక శక్తుల

వుద్యమ ధ్వంస రచన..

 యాజమాన్య కుటిల

 వ్యూహ వ్యామోహపు

పద్మవ్యూహం

 కార్మిక శక్తుల

మనో నిశ్చలత

 విచలితం కావించే

యత్నం

ప్రలోభాలు మనకు వలదు

 లోపాలు , తప్పిదాలు

 దిద్దుకొంటు బలపడుతూ

 హక్కుల సాధన దిశగా

మడం త్రిప్పకుండ

మనం మన

కదం కదం

వేన వేల కార్మిక శక్తుల

 పదం

హమార మాంగే లేకె రహేంగే

 మన శక్తి యుక్తులను

ముక్కలు చెక్కలుగా

నిర్వీర్యం చేసే దిశగా

ప్రలోభాలతో శక్తిని యుక్తిని

 హీనంగా మార్చే దిశగా

 యాజమాన్యం.!!!…..

తస్మాత్ జాగ్రత !!!!….

 

మనలోనూ వున్నారు

 అన్నంలో రాళ్ళల్లా

 పక్కలో బల్లెల్లా

 అరికాలి క్రింది ముళ్ళల్లా

 గాజు ముక్కల్లా

 పానకాన పుడకల్లా

 కార్తీక పున్నమి రాత్రి

 కారు మేఘపుతునకల్లా

 స్వార్ధంతో నయవంచనతో …

అధికారుల కుట్ర

 రచనలో

అక్షరాలై

ఆలంబన …..

మన వ్యూహాలకు తూట్ల పోట్లు

అడుగడుగునా

మధ్యపు  మడుగుల్లో  తేలి …

పై పదవుల ఆశలకు పునాదులు…

 చారులు చోరులు

 డాఫరులు హీనంగా హేయంగా

 ఆ బ్రదుకే స్వర్గంగా

 తోటి కార్మికుని ఆశా లతలను

 కూకటి వ్రేళ్ళతో పెకలించి వేయగా

 సంఘటిత కార్మిక శక్తిని

మట్టు పెట్ట గా పొంచి పొంచి

 వేచి చూసి కాటు వేయ

 కొందరుంటే త్రాగి త్రాగి వళ్ళు గుల్ల

 ఒళ్ళు దాచు ఇల్లు గుల్ల

యింటిలోని ఇల్లాలు గుల్ల

 తాను కన్న సంతాన మెల్ల …..

బలహీనులు మరి కొందరు

తక్షణమే కడాగాల్సిన

 ఎరుపు క్రింది నలుపులు.

 ఏరా ఎర్రని గురివిందలు

వీరందరూ…..

సమంజస అసమంజసాలు.
రచన :నూతక్కి రాఘవేంద్ర రావు.
తెదీ :09-09-2009

ఎందరికో సమంజసంగా వుండే అనేక విషయాలు నాకెందుకో అసమంజసంగా వుంటాయి.ఆ విషయాన్ని బయటకు వ్యక్తపరిస్తే ఎవరైనా ఏమన్నా అనుకుంటారనే బెరుకుతో చిన్నతనమంతా గడిచిపోయింది.సమాజంలో మెజారిటీ కుటుంబాలలో పిల్లల్ని  క్రమ శిక్షణ  పేరుతో మాట్లాడనిచ్చే వారు కాదు.మా పిల్లలు మేంఎంత చెబితే అంత అని మీసాలు మెలేసే వారు . అంతే కాని వారి వారి  పిల్లలు ఎంతలా వ్యక్తిత్వాన్ని కొల్పోతున్నారో గుర్తించే వారు కాదు.

 
అసలు విషయానికి వద్దాం. నాకు సమాజంలో ,ప్రభుత్వ విధి విధానాలలో  అనేక విషయాలు అసమంజసంగా అనిపిస్తాయి. నేను   అసమంజసంగా భావించే  విషయాల్లో నా బుర్రను అతిగా తొలిచే విషయం ఒకటుంది.   అదేమంటే  ,మనది ప్రపంచంలోనే  గొప్ప ప్రజా స్వామ్యమని చంకలు గుద్దుకొంటూ చెప్పుకుంటాము కదా,ప్రజాస్వమ్యయుతంగా పార్లమెంటుకూ  , అసెంబ్లీకి ,వగైరాలకు ప్రతినిధులను రహస్య రీతిలో ఎన్నుకుంటాము కదా . అంటే   అసెంబ్లీకో , పార్లమెంటుకో ఎన్నికయిన ప్రతినిధులంతా ,ప్రజలకొరకు, ప్రజల చేత, ప్రజల అవసరాలు సాధించిపెట్టేందుకు  ఎన్నుకోబడిన వారే  కదా, వారంతా కలిసి,  రాష్ట్ర విధాన సభకు ముఖ్య మంత్రిని,పార్లమెంటుకు ప్రధాన మంత్రిని ఎన్నుకొనే అవకాశం దక్కకుండా యే ఒక్క పార్టీలోని యేకొద్ది మంది  సభ్యులకో ఎందుకు దక్కు తోంది?


మెజారిటీ వున్న పార్టీ ,కాబట్టి వారికే ఆ అవకాశం వుంటుంది, అదీ రాజ్యాంగం కలిపించిన అవకాశం అని మనకు మనమే సమాధానం చెప్పుకుంటాము.
కానీ ఒకే విధంగా ఎన్నికయిన ప్రతినిధులు యీ లెక్కల   గారడీతొ అధికార సభ్యులు, ప్రతిపక్ష సభ్యులు గా విభజింపబడుతున్నారు. ఆ విధంగా ప్రజాస్వామ్యం ముక్కలవుతున్న భావన ఎవరికీ ఎందుకు కలగడం లేదో నాకు విస్మయం కలిగించే విషయం.   ప్రజల క్షేమం  కొరకు వారి ప్రయోజనాలు నెరవేర్చేందుకు, సమాజంలోని వ్యత్యాసాలను  తొలగించే దిశగా వాగ్దానాలు చేసి ఎన్నికై వచ్చిన,  ప్రజాప్రతినిధులైన ఎంపిలకు,ఎమ్మెల్యేలకు, ఆయా సభలలో అధి నాయకుడిని నియమించుకొనే హక్కు వుండాలి కాని ,యే కొద్ది మందో ఎక్కువ సభ్యులను గెలిపించుకున్న పార్టీకి ఆ హక్కు దఖలు కావడం ప్రజా స్వామ్యం అనిపించుకోదు. వోటరు తను వేసిన వోటు, అధికారం పొందిందా లేక ప్రతి పక్షమై పోయిందా అని ఆలోచించినపుడు గెలుపు గుర్రానికే వొటు వేసే సంస్క్రుతి పెంపొంది  చివరకు ప్రజాస్వామ్య మూల సూత్రాలే చ్ఛిద్రమయ్యేందుకు కారణభూతుడై, ప్రజాస్వామ్యం నిర్వీర్యమై పోతుంది.
ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధి పార్టీలకు అతీతంగా ముఖ్య మంత్రినో ,ప్రధాన మంత్రినో ఎన్నుకొనే సువర్ణావకాశం కొరకు ,ఆ హక్కును సాధించుకొనేదిశగా వుద్యమించి, అందుకు ఆచరణయోగ్యమైన మౌలిక సూత్రాలను కూడా సూత్రీకరించుకొని వుద్యమించ వలసిన అవసరం ప్రతి ఒక్క పౌరుడికీ ఎంతయినా వుంది. తస్మాత్ జాగ్రత!!!

           

 శిఖరాగ్రపు శిధిల  వుదంతం.   
(రాజశేఖరుని  మరణవుదంతం  నిజంగా నిజమేనా)
రచన:నూతక్కి రాఘవేంద్ర రవు.
తెదీ :02-09-2009

 

నిజమేనా! నిజంగా ! నిజమేనా!
రచన:నూతక్కి రాఘవేంద్ర రవు.
తెదీ :02-09-2009 
 

     రాజకీయ   పర్వతాన
   శిఖరాగ్రపు వున్నతాన 

 మరణమునా పర్వతాగ్రమున…

         రాజశేఖరుడు
మరణించాడట నిజమేనా
       నిజంగా  నిజమేనా !!! 
            రాజకీయ
  శిఖరాగ్రం అందుకున్న
           ధ్రువతార. 

       రాలిందట నిజమేనా !!!

  దేశంలొ ,జీర్ణమైన
తను నమ్మిన,పార్టీకి
   జవసత్వమిచ్చి

     ఆ శూరుడు 
        రాష్ట్రంలో

        దేశంలొ
      కాంగ్రెసుకు
     బ్రతుకునిచ్చి

      అధికారం

     అందుకున్న
       అధినేత 

   ప్రజల కొరకు   
      పధకాలు

     వాటి వాటి

   ప్రయోజనాలు

యోజనాల పర్యంతం

ప్రజల దరికి చేరాయా

  అడగాలని ఆత్రంగా
     రచ్చబండకడ 

   అడిగి తెలుసుకుందామని

       ఆకస యానంలొ

       ఆ ప్రజా బంధు….

  అడిగినపుడు ఆదుకున్న
            వరుణుడే !

    ఎందుకో మరి ఆగ్రహిస్తే
        ఆ అసామాన్యుడు
అనంతలోకాలకు హడావిడిగ

         పయనించాడట  

         ఇది నిజమేనా
       నిజంగా నిజమేనా!!!  

           కాదుకాదు
          నిజం కాదు

   ప్రజల గుండె లోలోతుల

       నిరంతరం నిలచి   

 
 నూటికో కోటికో యే ఒక్కరికో

              దొరికే

          అత్యధ్భుత 

 

    ఘన అనంత యానం 

              లో

తెలియని సుదీర తీరాలకు

       ఆ శూరుడు

« గత పేజీతర్వాత పేజీ »