అక్టోబర్ 2009
Monthly Archive
అక్టోబర్ 31, 2009
Posted by Gijigaadu under
expressions
6 వ్యాఖ్యలు
వ్యత్యాసాలు
రచన: నూతక్కి రాఘవేంద్ర రావు తేదీ: 31-10-2009
వెలుగులే లేనప్పుడు
నీడలనే మాటెక్కడ,
పల్లమంటు లేకుంటే
ఎత్తుకు విలువెక్కడ
నాడన్నది వున్నపుడే
నేటికి వునికిక్కడ
కష్టమంటు లేకుంటే
సుఖం విలువ యింకెక్కడ
అలా అలా ఒడిదుడుకులలోవాస్తవాల క్రీనీడల
పారాడేదే జీవితమట
అక్టోబర్ 31, 2009
Posted by Gijigaadu under
expressions
2 వ్యాఖ్యలు
సమన్వయం
రచన:నూతక్కి రాఘవేంద్రరావు
తేదీ: 31-10-2009
నాటి
ఆనందపు అనుభూతుల
వింజామరల పిల్ల గాలులను
మనసుల దరిచేరనీక
నేటి
అస్తవ్యస్త అంతరంగ
విన్యాసాలు వైవిధ్యభరితమై
జీవన వ్యత్యాసాలు
వాస్తవంలో నలిగుతున్న
సున్నిత భావనల
జీవితాలు
లోపిస్తున్నవెక్కడో
సమన్వయాలు
అక్టోబర్ 31, 2009
Posted by Gijigaadu under
expressions
వ్యాఖ్యానించండి
చోర్ కళ
( రివార్డులతో కొందరు చీత్కారాలతో మరికొందరు.)
రచన:నూతక్కి రాఘవేంద్ర రావు.
Dt:31-10-2009
ఆ కళాపాండిత్యం
కాలంతో మారుతున్న
తీరు తెన్నులు
అభినివేశం అత్యధ్భుతం
అమవసపున్నమి,
దివారాత్రములు,
యిక్కడ అక్కడ
ఎక్కడకానీ వివిధ భంగిమల
అనంత రూపముల
సర్వదిక్కుల
అనిమేష ధ్రుఃక్కులతో
నిద్రలు కరువై
సకల పౌరులకు
సర్పద్రంష్ట్రితం…
కళాప్రదర్శనలు
నిరాఘాటమై
నిరాటంకమై
అయినా శ్రమ ఫలితం
దక్కదు పాపం
ఆదరించేవారే వుండరు.
యీసడింపులూ
చీత్కారాలూ ……..
ప్రజా సేవలముసుగుల్లో
నిరంతరం ప్రజలను
జలగల్లా పీల్చుకు తింటూ
దోచుకొనే దొరలకు
దోపిడీదారులకు
అనునిత్యం అందే
సన్మానాలూ నంది అవార్డులు
పద్మ రివార్డులు…….
. కళల లిస్టులో ఒకటైనా
కళాకారుల కోవకే చెందినా……….
దివైడ్ అండ్ రూల్ పోలసే
వారికాతీరున గౌరవమేల ,
వీరికి అనునిత్యం చీత్కారాలేల?
సాఫ్ట్ కార్నరంటూ యేమీ
లేదుకాని
వారికో తీరు , వీరికి మరో తీరేలని
ఎందుకనో అర్ధంకాక తలగోక్కుంటున్నా…….
అక్టోబర్ 28, 2009
Posted by Gijigaadu under
expressions
2 వ్యాఖ్యలు
నిశ్శబ్ధ నిశీధి
(A moon less night scape)
రచన: నూతక్కి రాఘవేంద్ర రావు , తేది:28-10-2009
నిశ్శబ్ధ నిశీధికి వీనుల విందన్నట్లు
ఆలాపననందుకున్న
నేపధ్య గాయకులు కీచురాళ్ళు
మ్రుదంగ వాద్యాన్నందిస్తూ బెకబెకలు
శ్రుతి కలుపినట్లు
గాలి వాలుగా వేగంగా
వాయులీనాలువూదుతూ
ఎదురు పొదల చివళ్ళు
గగనతలాన అమవసనిశిలో
రేరేడేడని యింకను రాలేదమని
ఎదురు తెన్నుల నిర్వేదనలో
మధన పడి అలగిన తారల
నేత్రాలనుండి రాలిన
అశ్రు ముత్యాల్లా వుల్కలు
అంతర్గర్భాన చిక్కడిన ఆత్మల
నిశ్శబ్ద వేదనా రోదనలు
మౌనంగా భరిస్తూ సమాధి రాళ్ళు
విక్రుత వేదనలో
ఎక్కడో సుదూరాన నక్కలు
అనుబంధం వ్యక్తపరుస్తూ
గళంవిప్పిన వూర కుక్కలు
కళాప్రదర్శనకు యీ రేయే అనువని
పూనుకొన్న చోర శేఖరులు
(యీమాట ఆనాటి రోజులకే మాత్రమే వర్తిస్తుందిసుమండి…
ఈనాడు వారి కళా పటిమ వినూత్న రీతిన మహోన్నత స్థాయికి చేరింది లెండి)
అక్టోబర్ 28, 2009
Posted by Gijigaadu under
expressions
8 వ్యాఖ్యలు
నిశ్శబ్ధ నిశీధి (A moon less night scape)తేది:28-10-2009
రచన: నూతక్కి రాఘవేంద్ర రావు
నిశ్శబ్ధ నిశీధికి వీనుల విందన్నట్లు
ఆలాపననందుకున్న
నేపధ్య గాయకులు కీచురాళ్ళు
మ్రుదంగ వాద్యాన్నందిస్తూ బెకబెకలు
శ్రుతి కలుపినట్లు
గాలి వాలుగా వేగంగా
వాయులీనాలువూదుతూ
ఎదురు పొదల చివళ్ళు
గగనతలాన అమవసనిశిలో
రేరేడేడని యింకను రాలేదమని
ఎదురు తెన్నుల నిర్వేదనలో
మధన పడి అలగిన తారల
నేత్రాలనుండి రాలిన
అశ్రు ముత్యాల్లా వుల్కలు
అంతర్గర్భాన చిక్కడిన ఆత్మల
నిశ్శబ్ద వేదనా రోదనలు
మౌనంగా భరిస్తూ సమాధి రాళ్ళు
విక్రుత వేదనలో
ఎక్కడో సుదూరాన నక్కలు
అనుబంధం వ్యక్తపరుస్తూ
గళంవిప్పిన వూర కుక్కలు
కళాప్రదర్శనకు యీ రేయే అనువని
పూనుకొన్న చోర శేఖరులు
(యీమాట ఆనాటి రోజులకే మాత్రమే వర్తిస్తుందిసుమండి..ఈనాడు వారి కళా పటిమ వినూత్న రీతిన మహోన్నత స్థాయికి చేరింది లెండి
)
అక్టోబర్ 27, 2009
Posted by Gijigaadu under
expressions
5 వ్యాఖ్యలు
స్కై స్కేప్
(నా కుంచె నర్తించి స్రుష్టించిన ఓ వర్ణ చిత్రం)
రచన:నూతక్కి, తేది:27-10-2009
నా నేత్ర ద్వయ కెమేరా
మనోఫలకంపై చిత్రించిన
ద్రుశ్యం
చిత్రాతి చిత్రంగా
మనోహర వర్ణ రూపమై……
నీల గగన వూర్ధ్వ తలాన
వివిధ కల్పిత రూప
విన్యాసాల
మేఘమాలికల
వుధ్ఠాన పతనాలలో
దాగుడుమూతల
సయ్యాటల వుధ్భవిత
చిత్ర విచిత్ర వర్ణ
సమ్మిళిత ఛాయల
నీలి నీడలు …….
కాన్వాస్ పై నా కుంచె
వివిధ భంగిమల
నర్తిత పద తాళిత
ముద్రలు
స్రుష్టిత మనోహర
మహాధ్భుత
వర్ణ చిత్ర కావ్యం
అక్టోబర్ 25, 2009
భవిష్యత్ రారాజు. సోలార్ ఎనెర్జీ
( విద్యుదుత్పత్తి_ యితర ప్రత్యామ్నాయ విధానాలు )
యీ బ్లాగులో ప్రచురించబడిన 200 వ టపా
రచన: నూతక్కి రాఘవేంద్ర రావు తేదీ: 26-10-2009
_ ద్విశత టపోత్సవం _
ప్రపంచ వ్యాప్తంగా యీ రోజున యింధన సమస్య, విద్యుత్ సమస్య. మానవుడు తాను కనిపెట్టి తన సౌకర్యానికై వినియోగించుకోవాలనుకున్న పరికరాలకుకావలిసిన విద్యుత్శ్చక్తి లభించడం లేదు.అధునాతన సౌకర్యాలకై అధునాతన పరికరాలు వినియోగించుకొనే దిశగా అడుగులు ముందుకు వేయలేకపోతున్నాడు. యీ భూ ప్రపంచంలోని ప్రతి దేశం తన నిత్యావసర ఇంధనావసరాలకై జాతీయ స్థూలాదాయంలోనుండి ఎంతో ఎక్కువశాతం ఇంధన దిగుమతులపై ఖర్చు పెడుతోంది.లేదా భూగర్భ ఇంధన వెతుకులాటకై పరిశొధనలలోనో, లేదా వెలికితీతలోనో వెచ్చిస్తోంది. అది బొగ్గు కావచ్చు, ఆయిలు కావచ్చు,గ్యాసు కావచ్చు. అణు యింధనం కావచ్చు.
వీటిని వినియోగించి నీటిని,వేడి చేసి ఆవిర్భవించిన శక్తిని వినియోగించి టర్బైన్ లను నడిపి విద్యుత్ జెనరేటర్లు నడపి విద్యుదుత్పాదన సాధించడమే అంతిమ లక్ష్యం. వీటన్నింటికీ యింధన లబ్ధి ముఖ్యం.అందుకొరకు భూమి లోలోతు పొరలపై ఆధారపడాలిసిందే.ఆ తరువాత భూ వుపరితలాన వాటిని వినియోగకరంగా మార్చే దిశలో ఎంతో పర్యావరణ కాలుష్యం. అదీ కాక యీ పైన పేర్కొన్న యింధనాల వెలికితీత కార్యక్రమం అభివ్రుద్ధి చెందుతున్న, చెందని దేశాలకు కఠిన పరీక్ష.ఎన్నో లక్షల మంది నిర్వాశితులౌతున్నారు. ఆపై వాటివల్ల వుత్పన్నమయ్యే పర్యావరణ సమస్యలు మరో పెద్ద సమస్య. భూగర్భం లోనుండి ప్రతి దేశం తమ ఇంధన అవసరాలకనో ,యితర కారణాలకో, భూగర్భ పదార్ధాలను వెలికి తీస్తూ పోతే, భూ గర్భంలో ఏర్పడే ఖాళీ వల్ల భూమికి వుత్పన్నమయ్యే తీవ్ర దుష్పరిణామాలు భూమి పై జీవుల వునికికే తీవ్ర విఘాతం కలిగించే దారుణ స్థితి యెర్పడే అవకాశాలు కనపడుతున్నాయి.
ఇప్పటికే ప్రాధమికంగా విద్యుత్పాదనకు సాంప్రదాయ వనరుగా ప్రసిధ్ధి చెందిన నీరు ఏయేటికాయేడు లబ్ధి లేకుండా పోతోంది. వర్షాలు లేక నీటి వనరులు అడుగంటి పోతున్నాయి.ప్రపంచ వ్యాప్తంగా భష్యత్తులో,.జల విద్యుత్ ప్రోజెక్టులు తీవ్ర సమస్యలలోకూరుకు పోయే ప్రమాదం వుంది. నీరు లబ్ధి లేకూంటే యితర సాంప్రదాయ వనరులైన ధర్మల్,ఆటమిక్ పవర్ వంటి వుత్పత్తులకూ తీవ్ర ఆటంకం ఏర్పడే పరిస్థితులు వుత్పన్నమౌతున్నాయి. ప్రపంచం ఎదుర్కొంటున్న యీ దారుణ పరిస్థితులను అధిగమించి ,యింధనంకొరకు యుద్ధాలు ఆపి ప్రత్యామ్న్యాయ విధానాలకొరకు పరిశోధనలు జరిపి సాంప్రదాయేతర విధానాలతో శక్తిని వుత్పత్తి చేసి వినియోగించ గలిగితే తాను కనిపెట్టిన అధునాతన పరికరాలు మానవుడు తన సౌకర్యార్ధం వినియోగించుకోగలుగుతాడు. లేకుంటే ఎన్ని పరికరాలు కనిపెట్టినా యేకొద్దిమందికో తప్ప వినియోగపడవు.
నిరంతర మైన, నిరాటంకమైన,పర్యావరణానికి ,భూమి వునికికి విఘాతంలేని ప్రత్యమ్నాయ వనరులలో 1) గాలి నుండి, wind energy, 2)సముద్ర అలలనుండి (Tidal energy).౩) సూర్య రశ్మి నుండి , Solar energy ముఖ్యంగా చెప్పవచ్చు.యిప్పుడు వాటి గురుంచి నాకున్న పరిమిత పరిగ్నానంలో వివరిస్తాను.
1) విండ్ ఎనెర్జీ (wind energy): గాలి విరివిగా వీచే ప్రదేశాలు కనిపెట్టి ఆయా ప్రాంతాలలో ఎక్కువ సంఖ్యలో గాలి మరలు యేర్పరచి,వాటిని విద్యుత్ జెనెరేటర్లకు అనుసంధానం చేసి తద్వారా ప్రతి మరనుండి వుత్పత్తి అయ్యే విద్యుత్తును సమాంతరంగా అనుసంధించి ప్రస్తుత కేంద్రీక్రుత గ్రిడ్ విధానంలో వినియోగదారులకు, ప్రస్తుత రీతిలోనే ఆయా వనరులు వినియోగించుకొని సరఫరా చేసుకోవచ్చు. దీని స్థాపనకై అయ్యే ఖర్చు యెక్కువేఅయినా నిర్వహణ ఖర్చులు ,అణు విద్యుత్ ప్రోజెక్టులకో, జల విద్యుత్ ప్రోజెక్టులకో ,ధర్మల్ విద్యుత్ ప్రోజెక్టులకో అయ్యే ఖర్చులో సగానికి సగం తగ్గించ వచ్చు. ఇంధనంపై ఖర్చు చేయవలసిన అవసరాలుండవు.అణు యింధనానికై విదేశాలపై ఆధారపడి దేశ సార్వభౌమాధికారాలకు ముప్పు తెచ్చుకోనవసరం లేదు.ఆ కారణంగా అంతర్యుధ్ధాలు కొని తెచ్చు కోనవసరం లేదు. ప్రస్తుత సాంప్రదాయవిద్యుఠ్ వనరులపై భవిష్యత్తులో పెట్టదలుచుకున్న ఆర్ధిక వనరులతో యీ ప్రోజెక్టులు చేపట్టి దేశ భవిష్యత్తును వుజ్వలం చేసుకోవచ్చు. యిబ్బందులు: గాలి అన్ని వేళలా ఆయా ప్రాంతాలలో అదే ఫోర్సు తో ప్రసరిస్తుందన్న నమ్మకం లేదు. కాబట్టి వుద్యుత్ నిలువ సామర్ధ్యం(storage capabilitiees) పెంచుకొనేందుకు ద్రుష్టి పెట్ట వలసిన అవసరం వుంది., ఆ ప్రత్యేక సాంకేతిక సామర్ధ్యం సమకూర్చుకోవలసిన అవసరం యేర్పడుతుంది ,
2) సముద్ర అలల నుండి(Tidal energy): భూమి పై మూడొంతులు సముద్రమే.భూమినిరంతరం తనచుట్టూ తాను పరిభ్రమించడం వల్ల యేర్పడే పరిస్టితి నుండి సముద్రాలలో నిరంతరం అతి శక్తి వంతమైన అలలు వుత్పన్నమౌతుంటాయి. ఆ శక్తిని వినియోగించుకొని అనేక ప్రాంతాలలో విద్యుదుత్పాదన చేయగలిగే సాంకేతిక, ఆర్ధిక సామర్ధ్యం వుంటే విద్యుత్ వుత్పత్తి చేసి ప్రస్తుత రీతిలోనే సరఫరా చేసుకోవచ్చు. దీని స్థాపనకై అయ్యే ఖర్చు యెక్కువేఅయినా నిర్వహణ ఖర్చులు ,అణు విద్యుత్ ప్రోజెక్టులకో, జల విద్యుత్ ప్రోజెక్టులకో ,ధర్మల్ విద్యుత్ ప్రోజెక్టులకో అయ్యే ఖర్చులో నాలుగో వంతుకు తగ్గించ వచ్చు. వినియోగదారునికి విద్యుత్ అందాలంటే ప్రస్తుత గ్రిడ్ విధానాలతో కేంద్రీక్రుత సరఫరా వ్యవస్త లను వినియోగించుకోవచ్చు ఇంధనంపై ఖర్చు చేయవలసిన అవసరాలుండవు.అణు యింధనానికై విదేశాలపై ఆధారపడి దేశ సార్వభౌమాధికారాలకు ముప్పు తెచ్చుకోనవసరం లేదు.ఆ కారణంగా అంతర్యుధ్ధాలు కొని తెచ్చు కోనవసరం లేదు. యిబ్బందులు: కావలిసిన సాంకేతిక పరిగ్నానం సమకూర్చుకోవలసిన అవసరం దానికి కావలసిన ఆర్ధిక వనరులు సమకూర్చుకోవడంలో సమస్యలు. కానీ ప్రస్తుత సాంప్రదాయవిద్యుత్ వనరులపై భవిష్యత్తులో పెట్టదలుచుకున్న ఆర్ధిక వనరులతో యీ ప్రోజెక్టులు చేపట్టి దేశ భవిష్యత్తును వుజ్వలం చేసుకోవచ్చు. యిక పోతే …
సొలార్ ఎనర్జీ (Solar Energy): the pure energy and green energy. యీ భూ ప్రపంచంలో వున్న మూడొంతుల భూ భాగంలోధ్రువ ప్రాంతాలు తప్పించి మిగతా 80% భూభాగంలో రోజుకు ఆరు గంటలనుండి పది గంటల వరకు సూర్య కాంతి లభిస్తుంది. ఆ కాంతి వల్ల లభించే శక్తిని మన దైనిక విద్యుత్ అవసరాలకు వినియోగించుకొనే శాస్త్ర పరిగ్నానం,పరిశోధనా స్థాయినుంచి వుత్పాదనా, వినియోగ స్థాయిలకు ఎదిగింది.కాని ,దాని వినియోగం కొన్ని దేశాలకే పరిమితమయింది కాని,అన్ని దేశాలకు, అన్ని స్థాయిల వినియోగదారులకు యింకా అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం వాడుకలో వున్నట్లుగా,చిన్న చిన్న పరికరాల చార్జింగుకో, నీటిని వేడి చెసుకొటానికో మాత్రమే పరిమితం కాకుండా,విద్యుత్త్ ను నిలువ చేసుకొనే ప్రత్యమ్న్యాయాలు అభివ్రుద్ధి పరచుకొని,పెరుగుతున్న అన్ని గ్రుహోపయోగావసరాలకూ సోలార్ విద్యుద్వినియోగం జరిగినప్పుడు, మన దేశం లాటి అభివ్రుద్ధి దిశలో పయనించే దేశాలకు క్రొత్త భారీ విద్యుత్ ప్రోజెక్టులపై, భారీ మొత్తంలొ వెచ్చించవలసిన అవసరం రాదు. తద్వారా మిగులుతున్న ఆర్ధిక వనరులతో యింటింటికీ ఓ 5k.w సోలార్ ఎనెర్జీ కిట్ గనుక, జాతీయ భాద్యతగా అందించితే..ఆ ధనాన్ని నెల నెలా విద్యుత్ బిల్లులా కొన్నినెలల కిస్తుల రూపంలో వెనక్కు రాబట్టుకోవచ్చు.సరఫరాకొరకు,స్థంభాలు, తీగలూ నియంత్రణ వ్యవస్త అవసరం వుండదు కాబట్టి ప్రభుత్వానికి సరఫరా, నియంత్రణ పై ఖర్చులు వుండవు.భారత దేశంలో ప్రతి పూరి గుడెసెకు,నట్ట నడి అడవిలో వున్నా,ఎడారి మధ్యలోవున్నా కూడావిద్యుత్అందినప్పుడే,దేశం కొంతలో కొంత అభివ్రుధ్ధి చెందినట్లు. .
ప్రతి గ్రుహ వినియోగదారుడూ తమ స్థాయిలోసూర్య శక్తి వినియోగించి ఓ విద్యుత్ వుత్పాదకుడవ్వాలి.. ప్రజలకు సరైన,అవగాహన, ఆర్ధిక సహకారం అంది, ప్రతి గ్రుహస్తుడూ తక్కువలో తక్కువ సగటున 05kw విద్యుత్తును వుత్పత్తి చేసుకోగలిగే లా , వ్యవస్త యెర్పడితే, విద్యుత్ అంతరాలనుండి విరామం దొరుకుతుంది. వినియోగ దారుడు, ఆర్ధిక పరిపుష్టి చెంది, మరిన్ని విద్యుత్పరికరాలు వినియోగించే స్థితికి చేరుతాడు. . తద్వారా ఆయా పరిశ్రమలూ పెరుగుతాయి. పారిశ్రామిక వుద్యోగ అవకాశాలు పెరుగుతాయి, యిలా ప్రతి దేశంలోనూ ఆచరిస్తే ప్రపంచ వ్యాప్తంగా ,నిరుద్యోగ సమస్య చాల వరకు పరిష్కరించబడుతుంది,కొనుగోలు శక్తి పెరుగుతుంది.
యీ ప్రక్రియ కెనడాలో అమలులో వున్నది. కాకుంటే ప్రభుత్వమే ప్రతి గ్రుహస్తుకూ సోలా ర్ ప్యానెల్ వ్యవస్త ఏర్పరుస్తారు.. అందు నుంచి వుత్పత్తి అయిన విద్యుత్ సరఫరా వ్యవస్తకు కలుపుతారు.ప్రతి యూనిట్ కూ వారి అవసరాలకు ప్రభుత్వం నుంచి అందే ధర కన్నా ఏడు రెట్లు ఎక్కువ ధర చెల్లిస్తారు.యీ విధానం గ్రీన్ ఎనెర్జి యాక్ట్ ద్వారా అమలు చేస్తున్నారు.
గ్రుహ విద్యుత్ అవసరాలు సూర్యుని శక్తితో తీర్చుకోగలిగినప్పుడు, క్రొత్తగాప్రతిపాదించి,నిర్ర్మించ తల పెట్టిన నూతన విద్యుత్ ప్రోజెక్టులను, విరమించుకొని, తద్వారా మిగిలే ఆర్ధిక వనరులు, యీ విధంగా సోలార్ ఎనెర్జీ వుత్పత్తికై ప్రోత్సాహకాల రూపంలొ అందించవచ్చు. నూనె, బొగ్గు, అణు యింధనం,వగైరాలను, యితర సామాజిక అవసరాలకు, శాంతియుత ప్రయోజనాలకు, అభివ్రుధ్ధికి, మళ్ళించ వచ్చు..
ప్రస్తుతం కెనడాలో వికేంద్రిత సోలార్ విద్యుదుత్పత్తి ఇంటింటా ప్రభుత్వ పర్యవేక్షణలో జరుగుతోంది. స్పైన్ దేశంలో11M.W to 50M.W వరకు,అమెరికాలో 64M.W నుండి 354 M.W వరకూ భారీ స్థాయిలో సోలార్ విద్యుత్ వుత్పత్తి చేస్తున్నారు.
మనం మన దేశం లో భారీ సోలార్ ప్రోజెక్టులు నిర్మించనవసరం లేదు.కెనడా దేశ విధానాన్ని కూడా పాటించనవసరం లేదు.పెద్ద సోలార్ ప్రోజెక్టులకయ్యేద్రవ్యాన్ని ,భవిష్యదవసరాలు ద్రుష్టిలో వుంచుకొని ప్రతి గ్రుహస్తుకు వారి వారి అవసరానికి విద్యుత్ వుత్పాదన చేసుకొని నిలవ చేసుకొనే పరికరాలను వుచితంగానో, సబ్సిడీ ధరలకో యేర్పాటు చేసి యిస్తే , ప్రతి యింటా విద్యుద్పత్తి జరిగి, దేశంలో ప్రస్తుతం జరుగుతున్న విద్యుదుత్పత్తినుండి గ్రుహావసరాలకు యివ్వ వలిసిన అవసరం వుండదు. తద్వారా మిగిలిన విద్యుత్ను యితర ప్రయోజనాలకు వినియోగించ వచ్చు. అదే విధంగా అన్ని పరిశ్రమలనూ నిర్బంధ సోలార్ విద్యుదుత్పాదనా సంవిధానంలోకి తెచ్చి,వుత్పత్తి ఖర్చులను నియంత్రించ వచ్చు.
విద్యుత్ లోటును పూడ్చుకొని దేశం పురోగమనం సాధించ వచ్చు. విద్యుదుత్పత్తికై ఆయా దేశాలు ఇంధనవనరులు వినియోగించ వలసిన అవసరంలేదు, ఇంధనం కొరకు యితర దేశాలపై ఆధారపడవలసిన అవసరం లేదు.
ఇంతటి బ్రుహత్తర బహుళ ప్రయోజనాలున్న యింటింటా సోలార్ ఎనెర్జీ వుత్పత్తికీ, వినియోగానికీ ప్రభుత్వాలు ఎక్కువ ప్రాధాన్యాన్నిచ్చి, ఆ దిశగా క్రుషి చేసి ఆ ఆశయాన్ని త్వరితగతిన సాధించేందుకు సాంకేతిక నైపుణ్యాన్ని అభివ్రుద్ధి చేసుకొని స్వయం సమ్రుద్ధి సాధించవలసిన అవసరం ఎంతైనా వుంది. ఇప్పటివరకు ఆ దిశగా క్రుషి జరగకపోయినా పొరపాటు కాక పోవచ్చుకానీ, యికనయినా స్పందించక ఆ దిశగా పయనించకపోతే , దానికై ఆర్ధిక వనరులు సమకూర్చకుంటే అంతకన్న దుర్గతి,ఘోర తప్పిదం మరేమీ వుండదు.
ఈ సూర్యశక్తి వినియోగించి చేసే విద్యుదుత్పాదన వల్ల, యే దేశమైనా ,తమ దేశ యింధన వనరులు వేరెవరో కొల్లగొట్టుకు పోతున్నారనే భావన ఆయా ప్రజల మనోభావాలనుండి తొలగి,వుగ్రవాద భావనలు సమసి పోయి, ప్రస్తుత భయానక ప్రపంచంలోని భయానక వుగ్రవాదం తిరోగమన పధంలో పయనించడానికి సోలార్ ఎనెర్జీ ముఖ్య భూమిక పోషిస్తుందనీ ప్రపంచాన శాంతి పరిఢవిల్లుతుందని నా ఆకాంక్ష.
అక్టోబర్ 24, 2009
Posted by Gijigaadu under
expressions
17 వ్యాఖ్యలు
ద్విశత టపోత్సవ వేళ….
( ….నా హ్రుది మెదిలిన భావన)
రచన: నూతక్కి
తేదీ:24-10-2009
అధ్భుతం అమోఘం
నాబోంట్లకు బ్లాగ్ప్రక్రియ……
ఎడారిన ఒయాసిస్సు
చలిలో వణికే వాడికి
చలిమంటే దరి చేరినట్లు
బ్లాగులలో నా భావనలు
వ్యక్తపరచు అవకాశం
శాస్త్రగ్నులక్రుషి ఫలితం
అంతర్జాల మాధ్యమాన ….
అందున తెలుగు లిపిన
ప్రక్రియనందించిన
క్రుషీవలులు అందరికీ
నేనేమివ్వగలను
నా బ్లాగ్ రచనా
ద్విశత టపోత్సవం
అతి చేరువనున్న వేళ…..
నా హార్ధిక శుభాకాంక్షలు దక్క
మది భావన వ్యక్త పరచి
పదిమందితితొ పంచుకొనే
సద్భాగ్యం కల్పించిన
బ్లాగుల నిర్వాహకుల
నిర్విరామ నిష్కల్మష
వ్రత దీక్షకు యివే నా జోహారులు..
బ్లాగు స్పాటు వారికీ
వర్డ్ ప్రెస్స్ వారికీ
కూడలి జల్లెడ హారాలకు
యే హారాలెయ్యాలో
నేనేమివ్వగలను
నా బ్లాగ్ రచనా
ద్విశత టపోత్సవం
అతి చేరువనున్న వేళ…..
నా హార్ధిక
శుభాభినందనలు దక్క
నా వ్యక్తీకరణల నాదరిస్తూ
నిరంతరం ప్రోత్సాహాన్నందిస్తూ
ఎందరో ఎందరెందరో!!
వ్యాఖ్యాతలు అందరికీ వందనాలు. !
నేనేమివ్వగలను
నా బ్లాగ్ రచనా
ద్విశత టపోత్సవం
అతి చేరువనున్న వేళ…..
నా హార్ధిక శుభాకాంక్షలు దక్క
నా “శిలాశిసువువు”ను
మహాకవి శ్రీ శ్రీ భావనలతో పోల్చి
నా ఆత్మ విశ్వాసాన్ని
వెయ్యింతలు పెంచిన
వసుంధర గారికి నేనేమివ్వగలను
నా బ్లాగ్ రచనా
ద్విశత టపోత్సవం
అతి చేరువనున్న వేళ…..
నా హార్ధిక శుభాకాంక్షలు దక్క .
ఏడు మాసాల క్రితం
నా బ్లాగు ప్రారంభంలొ
నా సత్తి గాడి కబుర్లు చదివి/చూసి
“I like INDIA” అని స్పందించిన
విదేశీ యువతి “కెనియా”
“ద్రుశ్య గీతం మంచు దుప్పటి”పై
స్పందించిన అగ్నాత,
చిలిపిగ్నాపకాల పై శ్రీ “కొత్తపాళి”
“శ్యామూఎ నేం ఇన్ శాన్డియాగో” పై
శ్రీ సి.బి.రావు
“నిరంతరం” పై శ్రీ కిరణ్ ప్రభ(కౌముది)
“దిగ్విజయం అన్నమయ్య లక్షగళార్చనపై
కూచిభొట్ల వారూ
అచార్య ఫణీద్రులకు,
బల్లోజు బాబాకు
యీ ఘనులకు నేనేమివ్వగలను …
నేనేమివ్వగలను నా బ్లాగ్ రచనా
ద్విశత టపోత్సవం
అతి చేరువనున్న వేళ…..
నా హార్ధిక శుభాకాంక్షలు దక్క
నను ఓ కవిగా అంతర్జాల
అం తర్జాతీయ వుగాది తెలుగు
కవి సమ్మేళనాన
వుచితాసనమిచ్చి
ఆదరించి ప్రపంచానికి
నను కవిగా పరిచయం చేసి
తన సాహితీ యగ్నాన
నాచేతనూ సమిధలు వేయించిన
సాహితీ ప్రఖండురాలు
స్వాతికుమారి కల్హారప్రియకు
నేనేమివ్వగలను నా బ్లాగ్ రచనా
ద్విశత టపోత్సవం
అతి చేరువనున్న వేళ…..
నా హార్ధిక శుభాకాంక్షలు దక్క
“కిటికీకావల” పులిస్తరాకులమధ్య
తచ్చాడుతున్న నన్ను నోరారా ఆర్యా!
అని సంభోదించి ఆదరించి అనునిత్యం
నేటికీ నా బ్లాగును వీక్షిస్తూ
సరిదిద్దుతూ నను
జాగ్రుత పరుస్తూ
చిరు కోపంతో చిరుబురులాడినా
బ్లాగ్లోకంలో అయోమయాన
నేనున్నప్పుడు నా కింత
ఆత్మీయత తినిపిస్తూ….
హితైషిణి అశ్వనిశ్రీకి
నేనేమివ్వగలను
నా బ్లాగ్ రచనా
ద్విశత టపోత్సవం
అతి చేరువనున్న వేళ…..
నా హార్ధిక శుభాకాంక్షలు దక్క
నా అక్షరాల కూర్పులలో
వ్యక్తపరచు భావనలో
తానేం వీక్షించెనోకాని
తన మహత్తర “జలపుష్పాభిషేకం”
యగ్నంలొ నా చేతా
కవితాభిషేకం చేయించిన
మరువం పు వన
విహారిణి వుషాబాల
నాపై వుంచిన నమ్మకానికి ,
అభిమానానికి
నేనేమివ్వగలను
నా బ్లాగ్ రచనా
ద్విశత టపోత్సవం
అతి చేరువనున్న వేళ…..
నా హార్ధిక శుభాకాంక్షలు దక్క
రాసిలో తక్కువే
నా బ్లాగ్మిత్రులు
వాసి లో వుద్దండులు
వ్రాసిన వాఖ్యలు
నా బ్లాగుకు పూదండలు.
నేనేమిత్తును నేనేమివ్వ గలను
నా బ్లాగ్ రచనా
ద్విశత టపోత్సవం
అతి చేరువనున్న వేళ….
నా హార్ధిక శుభాకాంక్షలు దక్క
అక్టోబర్ 24, 2009
Posted by Gijigaadu under
expressions
2 వ్యాఖ్యలు
మాత్రు సంరక్షణ-౩
రచన: నూతక్కి
తేదీ : 24-10-2009
ఆ రోజూ
మామూలుగ చెట్టెక్కి
తల్లి కాకి లేనప్పుడు
నా పండ్లునేను కోసుకొని
పనిలోపనిగా గూటి కడకు వెళ్ళి
గ్రుడ్లన్నీ లెక్కించి
వెనుదిరిగే టంతలో
కావు కావు మంటూ
కాకులు నా చుట్టూ….
కాళ్ళతోటిగుచ్చుతూ
ముక్కులతో పొడుస్తుంటే……
ప్రాణాలరచేతబట్టి
చెట్టుదూకి పారిపోయి
పళ్ళన్నీ పడిపోయి
ఒడలంతా రక్కులతో
అప్పటి నామనసుకు
అపుడే తట్టింది
(అప్పటికేమో నావయసు యింకా ఆరేళ్ళే)
మనిషైనా పశువైనా
పక్షైనా మరి యే జీవికాని
బిడ్డల సంరక్షణలో
యేమరపాటుండదని
జగతిలోన జీవుల
ప్రాణాల విలువ ఒకటేనని
అక్టోబర్ 24, 2009
Posted by Gijigaadu under
expressions
వ్యాఖ్యానించండి
మాత్రు సంరక్షణ -2
రచన: నూతక్కి
తేదీ : 24-10-2009
ప్రతీ దినం నా చేత్తొ
ప్రేమగా
తినిపించే తవుడు కోసం
ముద్దుగా నా మొఖాన్ని
నాకాలని చూసే
గవిడె గేదె
ఆరోజెందుకో నాపై
కొమ్మిసిరింది
క్రోధ ధ్రుఃక్కుల
నా కదలికలను వీక్షిస్తూ
తన దుడ్డె కు పాలిస్తూ
నను దరి చేరొద్దని
హెచ్చరిస్తూ……
తర్వాత పేజీ »