అప్పటికి నా వయసు యింకా అయిదేళ్ళే !!!
 
 తేది :01-10-2009 రచన :నూతక్కి రాఘవేంద్ర రావు.
 
( Inspiration :సునీత గారు వారి బ్లాగు లో వ్రాసిన ఇదీ సంగతి-9).
 
 
 
నేను మా యింట్లో మచ్చు(అదో పెద్ద అటక ) మీద, యింట్లో వాళ్ళకు
 
 తెలియకుండా వాళ్ళను మభ్య పెట్టి ఎన్ని సారులో. అవి పెట్టినగుడ్లను ఆ
 
కోడి పెట్టల చేతనే పొదిగించి, అన్ని గుడ్లూ పొదగబడి బయటకు వచ్చిన
 
తరువాత వాటిని క్రిందకు దించి యింట్లొ వాళ్ళను ఆశ్చర్యానికి గురిచేసిన
 
సందర్భాలు,మొట్టికాయలతో తల బొప్పి కట్టిన సందర్భాలు ,ఎన్నో
 
 ఎన్నెన్నో.ఆ బాధలన్ని….. గుడ్లలోని పిల్లలు బయట పడే ప్రయత్నంలో
 
గ్రుడ్డు మధ్యలోచుట్టూరా లోపలనుండే ముక్కుతో పొడుస్తూ గ్రుడ్డు డొల్లను
 
రెందు సమ భాగాలుగా చేసుకొని బయటకు రావడం చూస్తే ఆ
 
మొట్టీకాయల నొప్పులేపాటివి? …… ….సరేలెండి ….ఆ అనుభవం
 
అనుభవానికి రావలిసిందే కాని ……యింకా ఎంతో వుంది వ్రాయటానికి .ఆ పిల్లల్ని గద్దలనుంచి ,  

 

.ఎవరు నేర్పారమ్మ ఆపిల్లకూ

డొల్లనట్టుల పగులగొట్టాలనీ ,

పగుల కొట్టీ భువిని చేరాలనీ

తల్లి రెక్కల క్రింద దాగాలనీ..

.ఎవరు నేర్పారమ్మ…………..అలా అలా …వాటికి మరి ఆహారం….చిట్టు

 జల్లించి సన్నని బియ్యం ముక్కులు సేకరించి (కొట్టు గది నిండా చిట్టూ

తవుడూ వుండేదిలెండి. వాటి గొంతుకు అడ్డం పడగూడదని అతి సన్న

నూక కోసం దొరక్క యీ పని చేసేవాడిని. ) వాటికి మేపేవాడిని.ఆ పిల్లల్ని

 చూస్తే పిల్లలికే కాదు,ఎప్పుడూ మడీ తడీ ,శుచీ, శుధ్ధీ ,వుండే మా

ప్రక్కింటి బ్రామ్మల బామ్మగారు కామేశ్వరమ్మబామ్మ గారు కూడా ఎవరూ

చూడ కుండా తల్లిని తరిమి పిల్లల్ని చేతుల్లోకి తీసుకొని వళ్ళు తడిమి

వదిలేవారంటే!!(అయినా తల్లి కోడి ఆమెను వదిలేది కాదనుకోండి) మొదటి

నెలలోపు వయసు కోడి పిల్లలని చూస్తే ముట్టుకోవాలని ఎవరికి వుండదు

?

ఆ విషయంలో ఎవరూ అతీతులు కారు..

(ఆమె ను ఆటపట్టించే విషయమ్ అదో ప్రహసనమ్,)నేను కోడి పిల్లల్ని

పొదిగించినప్పుడల్లా నన్ను అన్ని రకాలుగా శాపనార్ధాలు

పెట్టేదనుకోండి.అందుకే మా గోడెక్కి వాళ్ళ దొడ్లోకి చూస్తూ యిట్లాంటివన్నీ

చూసినప్పుడు ఆట పట్టించేవాడిని. అది వేరే విషయం అనుకోండి.

యింకా ఎంతో వుంది వ్రాయటానికి .ఆ పిల్లల్ని గద్దలనుంచి ,

కాకులనుంచి,పిల్లులనుంచి, వూరకుక్కల నుంచి కాపాడుకోవడం మరో

పెద్ద ప్రహసనం. యిక పోతే ప్రక్కింటి వాళ్ళతో మరో గొడవ.ఇంతే కాదు మా

కోడి పెట్టలు వెళ్ళి వేరే వాళ్ళ దొడ్లలో గుడ్లు పెట్టడం,వాటి కోసం నేను ప్రతి

రోజూ వాళ్ళతో కొట్లాడి గుడ్లు తీసుకు రావడం మరో ప్రహసనమ్.

మా అమ్మ మీద గౌరవం తో నన్నేదన్నాఅనడానికి వెరచే వాళ్ళు. అదీకాక ……………….

అప్పటికింకా నా వయసు యింకా అయిదేళ్ళే!!!

.

 

 

 

 

ప్రకటనలు