చీమలు  రచన: నూతక్కి రాఘవేంద్ర రావు

తేది:

03-10-2009  అనంత పయనం లో

ఆ జీవకోటి

అను నిత్యం అన్వేషణ

ఆహారమో యేపదార్ధ్మమో

ఏదయినా అవసరార్ధం

తన శక్తికి మించిన పరిమాణం

నోటకరుచు కొని నిరంతరం

ఆహారం వెదికి తెచ్చేక్రుషిలో

సంతానపు సంరక్షణ విధి లొ

నిర్దేశిత పధం

సూచిత గమ్యం

ఆదేశ పాలనం

క్రమశిక్షిత సైనికవీరులు

పట్టుదలే ఆయుధం

విధేయులు, వినమ్రులు

అలుపూ సలుపూ

ఆకలి దప్పూ

గమ్యం అగమ్య మైనా

అగచాట్లూ పాట్లూ ఎన్నున్నా

ఆగదు

ఆ అనంత పయనం

కానీ…

గమ్యం చేరేదెందరో ?

సహ జీవుల పద ఘట్టనలో

విరిగినలిగి సమసేదెందరో

బెదిరి చెదరి పధం వీడి …..

ఎందరో! ఎందరెందరో

పాపం !దారి తప్పి….

సూచనలూ

సంకేతాలందక

గమ్యమెరుగక,

గమనమెరుగక

ఆకలైతే !దప్పికైతే !

అగమ్యంగా

అయోమయాంలో…..

ప్రకటనలు