ప్రకృతి విలయ తాండవం

రచన

:నూతక్కి రాఘవేంద్ర రావు. 

తేది:05-10-2009. ఎందరో తెలుగువారి 

ప్రాణాలు తీసిన మ్రుత్యు జల ప్రళయం

 

01-10-2009 నుండి యీరోజు వరకూ వసతి నష్టం,పశు నష్టం వేల కోట్ల పంట నష్టం,ఆస్తి నష్టం,

 ……… 

అటు మొన్న,  

నిన్న వరకు

మొన్నఒడలు కుములు

వుగ్ర వుష్ణ తాడనం

.నేడో జల కరాళ

వికృత నృత్య తాండవం

. అది ప్రకోపం

ఇది ప్రళయం

క్రోధిత ప్రకృతి

రూప వైవిధ్యం 

నాడు వేసవిలో ఘోరకలి

నేడు వికృతమై

భీతావహ జల ప్రవాహ కధాకళి

అపుడునీటి చుక్క దొరకక

దాహంతీరక

నాలుక పిడచకట్టి నిర్భాగ్యులు…..

యిపుడు చుట్టూరా నీరే

త్రాగేందుకు నీరులేక

జిహ్వ ఎండి దౌర్భాగ్యులు………

యిళ్ళనిండ నీరు

యిళ్ళ పైన గొంతులెండి

కళ్ళనిండ కన్నీరు

ఆకలితోకడుపు మండి

ప్రకృతితో పోరు