వితండ వాదం .

 రచన: నూతక్కి రాఘవేంద్ర రావు.

తేది:07-09-2009 ..02-00hrs

…. .( క్షుణ్ణంగా విషయ పరిగ్నానంతో సోదాహరణాస్త్రాలతో వుద్దండ పండితులు.

…నావితండ వాదం  అస్త్రంగా  నేను)

(యిలా ఎందుకు అయ్యుండ కూడదు? ) .. అసలు యీ అంశం పై చర్చించాలంటే నాకు కొన్ని సంశయాలు ఎవరైనా నివ్రుత్తిచేస్తే బాగుంటుంది.అవేమిటంటే…. మహాభారత కధ ,కాలమాన పరిస్తితులు, పాత్రలు,అవి నిర్వహించిన విధి నిర్వహణ ,వాటివాటి వ్యక్తిత్వాలు లాటి వాటి పైన, రచన చేసిన వ్యాస మహర్షి ఘనత పైన చర్చించాలా?……. ..లేక మహాభారతం నిజ చరిత్రా? ,రచనా వైదుష్యమా?అన్న విషయం పై చర్చించాలా? లేక మహాభారత సమయం మన యీ మానవ సమాజం నాటిదా లేక యింకా ముందుదా అని చర్చ చేయాలా? లేక మహాభారత కధ నుండి …ఆధ్యాత్మిక,.రాజకీయ, ఆర్ధిక, సాంఘిక,సాంకేతిక,విషయాలపైనా? లేక విద్య,మానవ సంబంధాలు,వుత్పత్తి,సేకరణ, రవాణా,పంపిణీ,,భూ,జల మార్గ సదుపాయాలూ,,సాధనాలు,పశుపక్ష్యాదులూ,వాటితో మానవ బంధనలూ,వ్రుక్ష సంపద,వినియోగం_ సంరక్షణ,జల వనరులు,పారుదల వ్యవస్త,వంటి సామాజిక జీవన వనరుల గురిచి చర్చించాలా? లేక అప్పటి సాంకేతిక పరిగ్నానం,నైపుణ్యం,మానవ వనరుల వినియోగం,సాంకేతిక విద్య వంటి విషయాలపై చర్చించాలా? లేక మహా భారత కధాంశాలూ,నేటి మానవ సమాజావసరాలకు, సంక్షేమానికి వాటి వుపయోగాలు వంటి విషయాలు చర్చించాలా? లేక తెలుగులో వ్రాయబడిన మహాభారత కధ లో సాహిత్యపు లో లోతులను విశ్లేశించాలా? క్షమించండి, అర్ధ గ్నానులకు ఇన్ని సందేహాలుండటం లో అగ్నానం యేమీ లేదని నా భావన. ఇక పోతే పైన పేర్కొన్న వాటినుండి యేదో అంశం తీసుకొని నాదైన శైలిలోనా ద్రుఃక్కోణంలో వ్రాసి మీ ముందుంచటానికి నా పరిమిత గ్నానంలో నా ప్రయత్నమ్ కొనసాగిస్తా. ——————————————————————————— మహాభారతం….మరో ద్రుఃక్కోణం .లో….విశ్లేషించడం….. సాహితీ క్రుషీవలులకు,ఆ మహథ్గ్రంధాన్ని పుక్కిట బట్టిన నిష్ణాతులైన స్కాలర్స్ కు దక్క అతి సామాన్యులైన నా బోంట్లకు వూహించ రాని విషయం. యేదో విన్నాం.ఇంకేదో చదివాం, మరింకేదో చూశాం. అవన్నీ వినిపించిన,చదివి చెప్పిన,చిత్రాలుగా,నాటకాలుగా ప్రదర్శించిన, వారి వారి ద్రుఃక్పధాన్ని బట్టి వుంటుంది. కానీ యిదే మహా భారత కధను ఎవరికి వారు వారి వారి రీతుల్లో విశ్లేషించ వచ్చు,అన్వయించ వచ్చు. యీ భువి పైన శబ్దం నుండి సంగ్న పుట్టి,పదం పుట్టి, భాష పుట్టి, లిపి పుట్టి,వ్రాత పుట్టిఎన్ని యేళ్ళయినా, వ్రాత విస్త్రుతంగా వాడుకలోకి వచ్చింది మాత్రం లోహాలు విస్త్రుతంగా వాడుకలోకి వచ్చినతరువాత  తామ్ర పత్రాలద్వారా, అంతకు ముందు శిలా శాసనాలద్వారా ,దారు శాసనాలద్వారా వ్రాతను విస్త్రుత పరిచారు. ఆ తరువాత, వృక్ష సంపద భువిపై వుధ్భవించిన తర్వాతే తాళ పత్ర గ్రంధాలద్వారా కవులు తమసాహితీ సామర్ధ్యాన్ని వెలుగులోకి తెచ్చారు. యింతకూ నేను చెప్పాలనుకున్న దేమంటే……వ్యాస మహాముని అని చెప్ప బడే ఆ మహా కవి మహాభారత కవ్యానికి ఎన్నుకున్న సమయం…. లిపి పుట్టి ,భాషలు వాడుకలోకి వచ్చిన తరువాత.

అదీకాక పశు వులను మానవులు తమ స్వాధీనంలోకి తెచ్చుకున్న తరువాత జరిగిన కధ, తాటి చెట్లు ,మర్రిచెట్లు పుట్టిన తరువాత జర్గినకథ.లోహాన్ని, మందుగుండు సామాగ్రిని కనిపెట్టి వాడుకలోనికి వచ్చిన తరువాత వ్రాసిన కథ. సమాజంలో నాగరికత ప్రబలిన నాటి కథ.అధికార కాంక్ష ,వారసత్వ రాజకీయం విస్త్రుతంగా ప్రబలి వున్న కాలం నాటి కథ. సాంకేతిక నైపుణ్యమ్ విస్త్రుతమౌతున్న నాటి కథ. యుధ్ధ నైపుణ్యం,అస్త్ర శస్త్ర వినియోగం ,వాటి కొరకు లోహ వినియోగం అధికమౌతున్న నాటి కథ. కుల మౌఢ్యందారుణంగా వున్న నాటి కథ. జంతు సామ్య వ్యవస్త నుండి సామాజిక వ్యవస్తగా రూపంతరం చెందిన నాటి కథ. యింకా చెప్పాలంటే మహాభారతమ్ ఆర్యుల కాలం నాటి కథ. ఆర్యులు భారత దేశాన్ని అన్యాక్రాంతం చేసుకొని గోవులను పెంచడం ప్రారంభించిన నాటి కథ. క్లుప్తంగా చెప్పాలంటే క్రీస్తుని క్రిష్ట్నునిగా స్తానికీకరణ చేసి క్రిష్ట్ణున్నినల్లగా చూపి,చలాకీగా చూపి స్తానికీకరణ చేసినప్పటి కథ . విదేశీ గోవుల పాలనే జీవన మార్గమైన నాటి కథ. ఆవులే ఆస్తులైన ఆర్యులు వ్రాయించిన కథ. యివన్నీ కథలే. ఆయా కాలాల స్తానిక ,సామాజిక, రాజకీయ స్తితి గతుల నేపధ్యంతో స్రుష్టింప బడిన కధనాలే. కానీ….కవిత్వం, భాష ,కధా, కధనం పాత్రల చిత్రణ,నేపధ్య వర్ణణ ,ఆనాటి వివిధరంగాల వ్యవహార శైలి, సామాజిక నైతిక వర్తనా నియమాలూ ,రాజకీయ చిత్రణ, వాస్తు, కళా వర్ణనఅమోఘం. న భూతో న భవిష్యతి. మహాధ్భుత కధనంతో ఆ నాటి సమాజ జీవన వివరణతొ, అన్ని రంగాల వారికీ వయసుతో నిమిత్తం లేని ఒక మహత్తర మైన ఎడ్యుకేషనల్ సిలబస్.( a greatest educational sylabus for every activist. even for this movement.) ఒక మహోత్క్రుష్ట గ్రంధ రాజం ….మహాభారతం. ముగింపుమాట: భారతం…. నాగరికత పెరిగిన తరువాత, సమాజంలో ,నాది నీది, నా భార్య నా పిల్లలు అనే సంకుచిత భావనలకు అంకురమ్ పడిన తరువాత,స్వార్ధ భావనలు పెరిగిన తరువాత, అన్ని రంగాలలోనూ పరిశొధనలు జరిగి ఆయా రంగాలు సమ్రుద్ధి చెందిన తరువాత ,లోహ వినియోగం, జంతు మాలిమి జరిగి వాటి వుపయోగం పెరిగిన తరు వాత ……….ఆ సమాజపు రూపు రేఖలు, విధి విధానాల,కర్తవ్య్యాల వివరణే మహాభారత కధ.