మహోత్క్రుష్ట గ్రంధావిష్కారం.

 రచన: నూతక్కి రాఘవేంద్ర రావు.

 తేది:08-10-2009

వాల్మీకి రామయణం రాసేనాటికి

 మత్స్య జీవనం లేదనుకుంటా భువిపై

 మహోత్క్రుష్ట సాంఘిక కధనం

 ఆద్యంతం మత్స్యోదంత రహితం

ఆనాటికి జలజీవన ధ్రుఃక్కోణంలో

 ఆలోచనలే సాగలేదు ఎందువలనో

అంటే ఆనాటికి యీ భువిపై జలపుష్పం

 పుష్పించలేద?

దుస్తులున్నయ్,నీళ్ళూ వున్నాయ్

 వుతుకులున్నయ్, చెప్పులున్నాయ్,

 అంటే వ్రుత్తులూ ,కులాలూ వున్నాయని

 కదా నిజానికి ఆ కధలో

వాల్మీకే యివి యన్నీరాసి వుంటే

 రామాయణం రాసి ఎన్నెన్నో

వేల యేళ్ళు అయ్యుండదు.

వాల్మీకియె తద్వుదంతాలు

వ్రాయక పోయిన అవి యన్నీ

కవుల కల్పనే తమ జీవన శైలిని ,

తత్సమాజపు సాంకేతిక పరిణామం

 జొప్పించే క్రమాన….. ఆ కధనంలో

 విమాన ప్రయోగం ఆ కోవలోనిదే

 మహాభారత కాలంనాటికి

అంతా మత్స్య మాత్రు సామ్యం

 మహత్తర శాస్త్ర విగ్నాన పర్వం

 ఆయుధ తయారీ శస్తాస్త్రప్రయోగం

 ,వాహన నిర్మాణం మహాధ్భుత

వాస్తుశాస్త్ర విన్యాసం

 ఆకాశవాణి, దూరదర్శనం,

యీ కధనాలలో, శతవత్సరాల

పూర్వపు శాస్త్రగ్నుల

 వూహలకోరూపమ్

యీ కధనాలలో ప్రాణ ప్రతిష్టతం.

అందులకె యీ కధలన్నీ

 పురాణం ,భారతం ,భాగవతం,

భగవంతునిగా చెప్పిన గీతా

ఇతిహాసాలేవయినా…… మానవ జీవన

సంవిధాన సంక్షేమానికి

ఆ మానవ మాత్రులు ,మహాను భావులు

మన సమకాలీనులు కాకున్నా ,

వందల యేళ్ళ పూర్వం మాత్రమే

 లిఖించిన ఆ మహా కవుల కల్పిత భావన,

మహత్తర,వూహాశక్తి. భవిష్య దర్శనమ్.

మహోత్క్రుష్ట గ్రంధావిష్కారమ్.

(నా యీ భావనలో పురాణేతిహాసాలపై వుపనిషత్తులపై అవగాహనాలోపం కనిపిస్తూంటే…, నా ఆలోచనలు సరిదిద్దండి, ,క్రోధోద్రిక్తులు కాకండి. యిలానూ కావచ్చు కదా అని యోచనతో,పునరాలోచనతో వాస్తవాలు వెలికి తెచ్చే దిశలో పయనించండి పరిశోధించండి).

ప్రకటనలు