దాన ఫలం

రచన:నూతక్కి రాఘవేంద్ర రావు.

తేది: 14-010-2009

బంగారం రంగుల …

బగ్గ మగ్గిన సిన్న రసం

మాయిడి పండు లెక్క

 వడిలి ఏలాడి

ముడతలు పడ్డ

సెరీరం మంచిగ

బతికి సెడిన ట్టుగ…….

 నిలుసుండే సెక్తి లేక

 వున్న తాననె నేలకొరిగి……….

 అరటి తొక్కలూ ,

పాను థూకులూ

 ముసురుతున్న యీగలూ

 యెండిన కట్టె లెక్క

 గా బతుక్కన్న,

సావే శాన నయం

 పక్కంగనే సివికిన

 గుడ్డ పరచి…..

పడిన కాసు

 పడినట్టుగ

యెవురొ యేరుకుంట్టున్నరు …..

 బిడ్డా! గా ముసిల్దాని పక్కన

 పరిసిన గా పాత నాది ..

నీ తల్లి… పైసల్గిన ముట్టితివో

 ముడుసులిరుగుతై బిడ్డ!

ఎవరో ఎవరికో బెదిరింపులు.

సత్తు బొచ్చెల్లో పైసలు

 గలగల లాడించుకుంట

హంగమా జేస్త

అడుక్కొంటున్నరు

 కొందరు…….

రిచ్చలు తొక్కెటోల్లు,

ఆటొఓల్లు సాయిలమ్మెటోల్లు,

స్సెనగపల్లి బుట్టలోళ్ళు

 గన గన గంట మోగించు కుంట

పీసు మిటాయోడు…….

అంతా లొల్లి లొల్లి

 యిటుసూడు అటు సూడు

 యెటు సూసిన లొల్లి లొల్లి.

సింపిరి తలా ,తెల్ల జుట్టు.

సిరిగిన బట్ట, సివికిబోయె

జరిగిందేందో,జరిగెడిదేందో

 జరుగుతున్నదదేందో

మనసుకి ఎర్కలేకుంట

పాపం గాయమ్మకు

 తెల్వకున్నట్లుంది.

అమ్మా ఏందమ్మా!

 యీడికొచ్చి కూసున్నవు!!?

పాపిష్టి సచ్చినోళ్ళు

గాళ్ళిల్లల పీనిగెల్ల…..

 అడుక్కొంటున్నరు తల్లి

 నిన్నడ్డం పెట్టుకుంట.

తల్లీ నీ సేతిపున్నెంల !…..

 

ఎంతమంది గరీబులు

 యిన్నేళ్ళుగ బతకిన్రో

గాల్లకు యేమెరుక తల్లి?……..

నిన్నునే బతికించుకుంట

అమ్మతోడు

నిన్నునే సాక్కుంట తల్లి.

పున్నాత్మురాలు

 గీ హవేలీ దుకాణాల్

 గవన్నీ ఆమె సంతం

 నాబతుక్కింత దారి సూపె

 నాలెక్కనె యేలమంది

మంచిగ దినాం బతుకుతున్రు

ముంజెయ్యికి బొక్కలేదు.

ఆకలేసి అడిగినోనికి

కొసరి మరీ పెట్టెడిది

అయినోళ్ళు అందినంత

దోసుకొని తగిలేస్తిరి

నెత్తిపైన మోదిరేమొ

 మాట, మంతి కరువాయె

“మారాణిల” బతికినామె

 మతిపోయి బతుకు మాసి….

మాతల్లి ఆ యమ్మను…

నా పంచన జేర్చుకొంటి

దానం సేసిన బతుకిచ్చిన

 నాయమ్మను

 నడి బాటల యెట్లిడుస్త…..?

 సాయం పట్టనీకొచ్చిన

 గా నల్గురికీ

యివరం…. సెప్పుకుంట

….. ….ఆమె…….