మతాబులు 

( అప్పట్లో యింట్లో దీపావళి కి మేమే తయారు చేసుకున్న  టపాసులు)…2

: సమర్పణ/నూతక్కి రాఘవేంద్ర రావు

తేది: 18-09-2009

 నిన్న రోలు రోకలి గురించి చెప్పుకున్నాం కదా ,యీ రోజు మీకు మతాబులు చేసే విధానం గురించి చెబుతాను. మెగ్నీషియం రజను(స్క్రాప్) (రసాయన నామం తెలియదు), గంధకమ్(సల్ఫర్),ఆముదమ్ (కాస్టర్ ఆయిల్)ప్రత్యేకమైన పాళ్ళల్లో కలిపి, ఎండలో ఎండబెట్టి,వుంచుకోవాలి….. ముప్పావు అంగుళము డయామీటరు లో మందపాటి కాగితంతో గొట్టాలు తయారు చేసి, ఒక ప్రక్కన మూసి ఒక అంగుళం మేర యిసుక పోసి (చేత్తో పట్టుకొనే వీలుగా చివరిదాకా కాలినా చేయి కాలకుండా,గుర్తించడానికి యేదయినా మార్క్ పెట్టుకుంటే మంచిది) మిగతా భాగం యీ తయారు చేసుకున్న మిశ్రమంతో ఒక అంగుళం వదిలి కూరాలి. తరువాత ఖాళీ భాగం మూసేయాలి. .అవి కొన్ని రోజులు బాగా ఎండలో వుంచి ఎండనిచ్చి కాల్చుకుంటే (వళ్ళుకాల్చుకోకూడదు సుమా) అవేమతాబులు.ఫూల్ చడీ. చక్కని పూల వర్షం..యీ రోజుల్లో రంగు రంగులలో ధారలు కురిసేలా కూడా పదార్ధాలు కలుపుతున్నారని తెలిసింది. వాటి వివరాలు నాకు తెలియదు.