“ఇదో సులుసూత్రం…..జలవాయు మంత్రం

(“నీరెక్కువ త్రాగు ,గాలెక్కువ పీల్చు,ఆరోగ్యంగా వుండు.” )

రచన: నూతక్కి తేదీ: 20-10-2009

చిన్న విషయాలే, అలోచించి ఆచరించటానికి యేమంత కష్టమూ కాదు. కానీ యీ విషయాలపై శ్రద్ధపెట్టి మనసు కేంద్రీకరించి ఆచరించాలన్న ఆలోచన కు ఎవరూ ప్రాధాన్యత నివ్వడం లేదు. ఆచరిస్తే అమూల్య మైన ఆరోగ్యం తమచేతుల్లోనే వుంటుంది. “నీరెక్కువ త్రాగు ,గాలెక్కువ పీల్చు,ఆరోగ్యంగా వుండు.”    ఇదో సులుసూత్రం…..జలవాయు మంత్రం. 

1) దాహమైందంటే శరీరానికి మనం నీరు అందించాలని సంకేతం.కాని మనం నీటికి బదులు,కాఫీ, టీ,కల్లు సారాయి, బ్రాందీ,విష్కీ లేక మరో,కల్మషభూయిష్ట పదార్ధాలో (సాఫ్ట్ కూల్ డ్రింక్సో) త్రాగుతుంటాం. వాటి వల్ల హానికారకారక పదార్ధాలను శరీరం లోకి చేర్చుకుంటూ,కల్మషాలను కడిగే నీటి ని శరీరానికి అందించక లేక పోవడం వల్ల శరీరం రోగ భూయిష్టమౌతోంది. 2)మనలో అనేక మంది పనుల వత్తిడిలోనో, యేవేవో సమస్యల పై అలోచిస్తూనో, ఎక్కువగా మాట్లాడుతూనో, కావలిసినంతగా గాలిని పీల్చక, శరీరానికి కావలిసిన ప్రాణ వాయువును అందించ లేక పోతున్నారు.యీ సెల్ ఫోనులు వచ్చిన తరువాత మరీ అన్యమనస్కంగా మారిపోయి గాలి పీల్చడం తగ్గి పోతోంది.కంప్యూటర్ యుగంలో మరింతగా ఆలోచనల సుడిగుండంలొ కూరుకు పోతున్నారు.గాలి పీల్చడం తగ్గిస్తున్నారు. నేను నా శరీరావసరానుగుణ్యంగా నీరు ఎక్కువ త్రాగుతూ ఆరోగ్య లబ్ధి పొందుతూ నలుగురికీ తెలియ చెప్పుతుంటాను. నేడు ప్రతి మనిషీ యేదో ఆలోచనలూ,తాపత్రయం వెంట పరుగు.దాహం వేసినప్పుడల్లా టీయో,కాఫీయో,బ్రాండీయో, విస్కీయో, తప్ప కావలిసిన నీరు మాత్రం ముట్టటంలేదు. అందువల్ల అనేక రుగ్మతలున్నూ.కనీసం త్రాగే అనర్ధ దాయక పదార్ధాలు కలిగించే కల్మషాలు శరీరమ్ నుంచి కడిగేందుకైనా నీరు ఎక్కువగా త్రాగమని చెబుతుంటాను. శరీరాన్ని విక్రుతంగా మార్చగలిగే ద్రావకాన్ని కూడా నీటి తో మాత్రమే కడగ గలుగుతాం.నీటికి అంతటి మహత్తరమైన శక్తి వుంది. ప్రతి దినం నీరు లేందే నిత్యక్రుత్యాలు జరుగవు. నిత్యం చాలా నీరు వాడుతుంటాము. కాని, నీరు మాత్రం తగినంతగా త్రాగం. శరీరానికి కావలసిన నీరు ఎంత అన్న విషయం పై అనేక మంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారు. కానీ ముందు మనం నీటి వినియోగం(త్రాగే దిశగా) పెంచే ప్రయత్నం ప్రారంభించడం చాలా ముఖ్యం. (one should start cultivating the habbit of consuming of more drinking water).యిందువల్ల నీరు యిప్పడు త్రాగే దానికన్న ఎక్కువ త్రాగే అలవాటు పెంపొంది, క్రమేణా నిత్యక్రుత్యమై,అనేకానేక శారీరక రుగ్మతలను ఆదిలోనే నియంత్రించ గలిగే అవకాశం కలుగుతుంది. అదే విధంగా చాలామంది కి ఎక్కువగా మాట్లాడటం అలవాటు. ఆ మాట్లాడే ప్రక్రియలో గాలి పీల్చడం మానేయరు గాని, లంగ్స్ కు పని తగ్గిస్తారు. దానితో ఆక్సిజెన్ శరీరానికి కావలిసినంత అందదు. కొందరు అనేక దినవారీ కార్యక్రమాలవత్తిడిలో ఆలోచనలలో,తక్కువ గాలి పీలుస్తుంటారు. అప్పుడూ యిదే పరిస్తితి. “నీరెక్కువ త్రాగు ,గాలెక్కువ పీల్చు,ఆరోగ్యంగా వుండు.” అనే స్లోగన్ వినే వాళ్ళ చెవుల్లో వూదుతుండటం నాకు అలవాటుగా మారింది. బహిరంగంగా వేదికలెక్కి చెప్పకపోయినా ,గుంపుల్లో వూదరగొట్టిన రోజులూ వున్నాయనుకోండి……అమెరికాలోనూ. వయసైన ముండావాణ్ణని అక్కడ నా మాట కనీసం వింటారు, చర్చిస్తారు. భేష్, శహ్భాష్ అంటారు. కాని ,వినేవాడికి చేప్పేవాడు లోకువవుతున్న రోజులాయె. ఎక్కడైనా ఆచరించేవారు అంతంత మాత్రమే.