నమ్మకాల సవ్వడుల పీట ముడులు

రచన: నూతక్కి

తేది: 21-10-2009

ఏ మతమైనా

మతగ్రంధమైన

హిందూ,ముస్లిం,

క్రైస్తవ,సిక్కు

 గీతైనా, ఖురానైన,

 బైబులైన గురుగ్రంధా సాహెబైన

 మరే మతమైనా

మరోగ్రంధమైన

అన్నిటికీ మూలం, మం త్రం

 మానవ జీవ సజీవ

సహజీవన హితం

ఆ హిత యోచన

మతమై మూఢమై……

విక్రుతమై భూతలాన…..

చంపేదీ చంపించేదీ

రక్షించేదీ భయపెట్టేదీ

 కాటేసేదీ,కాల్చేదీ,

ముంచేదీ,

రోగం రొష్టూ ఆపిందని

 గంగానమ్మో ,

పోలేరమ్మో,

కంకాళమ్మో…….

చెట్టూ,పుట్టా,

గుట్టా మెట్టా ,

కూలిందనో…….

 నీరూ, నింగీ,

అగ్గీ, పామూ,

తేలూ,తాబేలూ

ముంచిదనో,

కాల్చిందనో,

కాటెసిందనొ

చేపా,ఎద్దూ,

ఆవూ, దున్నా,

వరాహ రూపమ్,

యేనుగు,,మొసలీ,

 డేగా, నెమలీ

ఆఖరుకా ఎలుక పిల్ల

 సుడిగాలీ గాలివాన,

కూలే చెట్టూ

పాములకిరువై

చెదలపుట్ట

మానవ జీవనాన

ఆనందమో,

వుత్పాతమో

స్రుష్టించినవని

అన్నీ మన దేవుళ్ళై

మన నమ్మకాల

సుడి తిరిగిన పీట

 ముడులు,

పుణ్యంతో స్వర్గానికి

 నిచ్చనలు,

నరకానికి పాప ఖడ్గ

 చేదనలు

 పాపం, పుణ్యం,

 స్వర్గం, నరకం,

 తత్ భావోధ్భవ,

భయోధ్భవ

వుధ్భవాలు …..

భువి భారతిన

అసంఖ్యాక దేవుళ్ళు