మాత్రు సంరక్షణ-౩

 రచన: నూతక్కి

 తేదీ : 24-10-2009

ఆ రోజూ

 మామూలుగ చెట్టెక్కి

తల్లి కాకి లేనప్పుడు

నా పండ్లునేను కోసుకొని

పనిలోపనిగా గూటి కడకు వెళ్ళి

గ్రుడ్లన్నీ లెక్కించి

వెనుదిరిగే టంతలో

కావు కావు మంటూ

 కాకులు నా చుట్టూ….

 కాళ్ళతోటిగుచ్చుతూ

ముక్కులతో పొడుస్తుంటే……

 ప్రాణాలరచేతబట్టి

చెట్టుదూకి పారిపోయి

పళ్ళన్నీ పడిపోయి

ఒడలంతా రక్కులతో

అప్పటి నామనసుకు

 అపుడే తట్టింది

 (అప్పటికేమో నావయసు యింకా ఆరేళ్ళే)

 మనిషైనా పశువైనా

పక్షైనా మరి యే జీవికాని

 బిడ్డల సంరక్షణలో

యేమరపాటుండదని

 జగతిలోన జీవుల

ప్రాణాల విలువ ఒకటేనని