భవిష్యత్ రారాజు. సోలార్ ఎనెర్జీ
( విద్యుదుత్పత్తి_ యితర ప్రత్యామ్నాయ విధానాలు )
యీ బ్లాగులో ప్రచురించబడిన 200 వ టపా
రచన: నూతక్కి రాఘవేంద్ర రావు తేదీ: 26-10-2009
_ ద్విశత టపోత్సవం _
ప్రపంచ వ్యాప్తంగా యీ రోజున యింధన సమస్య, విద్యుత్ సమస్య. మానవుడు తాను కనిపెట్టి తన సౌకర్యానికై వినియోగించుకోవాలనుకున్న పరికరాలకుకావలిసిన విద్యుత్శ్చక్తి లభించడం లేదు.అధునాతన సౌకర్యాలకై అధునాతన పరికరాలు వినియోగించుకొనే దిశగా అడుగులు ముందుకు వేయలేకపోతున్నాడు. యీ భూ ప్రపంచంలోని ప్రతి దేశం తన నిత్యావసర ఇంధనావసరాలకై జాతీయ స్థూలాదాయంలోనుండి ఎంతో ఎక్కువశాతం ఇంధన దిగుమతులపై ఖర్చు పెడుతోంది.లేదా భూగర్భ ఇంధన వెతుకులాటకై పరిశొధనలలోనో, లేదా వెలికితీతలోనో వెచ్చిస్తోంది. అది బొగ్గు కావచ్చు, ఆయిలు కావచ్చు,గ్యాసు కావచ్చు. అణు యింధనం కావచ్చు.
వీటిని వినియోగించి నీటిని,వేడి చేసి ఆవిర్భవించిన శక్తిని వినియోగించి టర్బైన్ లను నడిపి విద్యుత్ జెనరేటర్లు నడపి విద్యుదుత్పాదన సాధించడమే అంతిమ లక్ష్యం. వీటన్నింటికీ యింధన లబ్ధి ముఖ్యం.అందుకొరకు భూమి లోలోతు పొరలపై ఆధారపడాలిసిందే.ఆ తరువాత భూ వుపరితలాన వాటిని వినియోగకరంగా మార్చే దిశలో ఎంతో పర్యావరణ కాలుష్యం. అదీ కాక యీ పైన పేర్కొన్న యింధనాల వెలికితీత కార్యక్రమం అభివ్రుద్ధి చెందుతున్న, చెందని దేశాలకు కఠిన పరీక్ష.ఎన్నో లక్షల మంది నిర్వాశితులౌతున్నారు. ఆపై వాటివల్ల వుత్పన్నమయ్యే పర్యావరణ సమస్యలు మరో పెద్ద సమస్య. భూగర్భం లోనుండి ప్రతి దేశం తమ ఇంధన అవసరాలకనో ,యితర కారణాలకో, భూగర్భ పదార్ధాలను వెలికి తీస్తూ పోతే, భూ గర్భంలో ఏర్పడే ఖాళీ వల్ల భూమికి వుత్పన్నమయ్యే తీవ్ర దుష్పరిణామాలు భూమి పై జీవుల వునికికే తీవ్ర విఘాతం కలిగించే దారుణ స్థితి యెర్పడే అవకాశాలు కనపడుతున్నాయి.
ఇప్పటికే ప్రాధమికంగా విద్యుత్పాదనకు సాంప్రదాయ వనరుగా ప్రసిధ్ధి చెందిన నీరు ఏయేటికాయేడు లబ్ధి లేకుండా పోతోంది. వర్షాలు లేక నీటి వనరులు అడుగంటి పోతున్నాయి.ప్రపంచ వ్యాప్తంగా భష్యత్తులో,.జల విద్యుత్ ప్రోజెక్టులు తీవ్ర సమస్యలలోకూరుకు పోయే ప్రమాదం వుంది. నీరు లబ్ధి లేకూంటే యితర సాంప్రదాయ వనరులైన ధర్మల్,ఆటమిక్ పవర్ వంటి వుత్పత్తులకూ తీవ్ర ఆటంకం ఏర్పడే పరిస్థితులు వుత్పన్నమౌతున్నాయి. ప్రపంచం ఎదుర్కొంటున్న యీ దారుణ పరిస్థితులను అధిగమించి ,యింధనంకొరకు యుద్ధాలు ఆపి ప్రత్యామ్న్యాయ విధానాలకొరకు పరిశోధనలు జరిపి సాంప్రదాయేతర విధానాలతో శక్తిని వుత్పత్తి చేసి వినియోగించ గలిగితే తాను కనిపెట్టిన అధునాతన పరికరాలు మానవుడు తన సౌకర్యార్ధం వినియోగించుకోగలుగుతాడు. లేకుంటే ఎన్ని పరికరాలు కనిపెట్టినా యేకొద్దిమందికో తప్ప వినియోగపడవు.
నిరంతర మైన, నిరాటంకమైన,పర్యావరణానికి ,భూమి వునికికి విఘాతంలేని ప్రత్యమ్నాయ వనరులలో 1) గాలి నుండి, wind energy, 2)సముద్ర అలలనుండి (Tidal energy).౩) సూర్య రశ్మి నుండి , Solar energy ముఖ్యంగా చెప్పవచ్చు.యిప్పుడు వాటి గురుంచి నాకున్న పరిమిత పరిగ్నానంలో వివరిస్తాను.
1) విండ్ ఎనెర్జీ (wind energy): గాలి విరివిగా వీచే ప్రదేశాలు కనిపెట్టి ఆయా ప్రాంతాలలో ఎక్కువ సంఖ్యలో గాలి మరలు యేర్పరచి,వాటిని విద్యుత్ జెనెరేటర్లకు అనుసంధానం చేసి తద్వారా ప్రతి మరనుండి వుత్పత్తి అయ్యే విద్యుత్తును సమాంతరంగా అనుసంధించి ప్రస్తుత కేంద్రీక్రుత గ్రిడ్ విధానంలో వినియోగదారులకు, ప్రస్తుత రీతిలోనే ఆయా వనరులు వినియోగించుకొని సరఫరా చేసుకోవచ్చు. దీని స్థాపనకై అయ్యే ఖర్చు యెక్కువేఅయినా నిర్వహణ ఖర్చులు ,అణు విద్యుత్ ప్రోజెక్టులకో, జల విద్యుత్ ప్రోజెక్టులకో ,ధర్మల్ విద్యుత్ ప్రోజెక్టులకో అయ్యే ఖర్చులో సగానికి సగం తగ్గించ వచ్చు. ఇంధనంపై ఖర్చు చేయవలసిన అవసరాలుండవు.అణు యింధనానికై విదేశాలపై ఆధారపడి దేశ సార్వభౌమాధికారాలకు ముప్పు తెచ్చుకోనవసరం లేదు.ఆ కారణంగా అంతర్యుధ్ధాలు కొని తెచ్చు కోనవసరం లేదు. ప్రస్తుత సాంప్రదాయవిద్యుఠ్ వనరులపై భవిష్యత్తులో పెట్టదలుచుకున్న ఆర్ధిక వనరులతో యీ ప్రోజెక్టులు చేపట్టి దేశ భవిష్యత్తును వుజ్వలం చేసుకోవచ్చు. యిబ్బందులు: గాలి అన్ని వేళలా ఆయా ప్రాంతాలలో అదే ఫోర్సు తో ప్రసరిస్తుందన్న నమ్మకం లేదు. కాబట్టి వుద్యుత్ నిలువ సామర్ధ్యం(storage capabilitiees) పెంచుకొనేందుకు ద్రుష్టి పెట్ట వలసిన అవసరం వుంది., ఆ ప్రత్యేక సాంకేతిక సామర్ధ్యం సమకూర్చుకోవలసిన అవసరం యేర్పడుతుంది ,
2) సముద్ర అలల నుండి(Tidal energy): భూమి పై మూడొంతులు సముద్రమే.భూమినిరంతరం తనచుట్టూ తాను పరిభ్రమించడం వల్ల యేర్పడే పరిస్టితి నుండి సముద్రాలలో నిరంతరం అతి శక్తి వంతమైన అలలు వుత్పన్నమౌతుంటాయి. ఆ శక్తిని వినియోగించుకొని అనేక ప్రాంతాలలో విద్యుదుత్పాదన చేయగలిగే సాంకేతిక, ఆర్ధిక సామర్ధ్యం వుంటే విద్యుత్ వుత్పత్తి చేసి ప్రస్తుత రీతిలోనే సరఫరా చేసుకోవచ్చు. దీని స్థాపనకై అయ్యే ఖర్చు యెక్కువేఅయినా నిర్వహణ ఖర్చులు ,అణు విద్యుత్ ప్రోజెక్టులకో, జల విద్యుత్ ప్రోజెక్టులకో ,ధర్మల్ విద్యుత్ ప్రోజెక్టులకో అయ్యే ఖర్చులో నాలుగో వంతుకు తగ్గించ వచ్చు. వినియోగదారునికి విద్యుత్ అందాలంటే ప్రస్తుత గ్రిడ్ విధానాలతో కేంద్రీక్రుత సరఫరా వ్యవస్త లను వినియోగించుకోవచ్చు ఇంధనంపై ఖర్చు చేయవలసిన అవసరాలుండవు.అణు యింధనానికై విదేశాలపై ఆధారపడి దేశ సార్వభౌమాధికారాలకు ముప్పు తెచ్చుకోనవసరం లేదు.ఆ కారణంగా అంతర్యుధ్ధాలు కొని తెచ్చు కోనవసరం లేదు. యిబ్బందులు: కావలిసిన సాంకేతిక పరిగ్నానం సమకూర్చుకోవలసిన అవసరం దానికి కావలసిన ఆర్ధిక వనరులు సమకూర్చుకోవడంలో సమస్యలు. కానీ ప్రస్తుత సాంప్రదాయవిద్యుత్ వనరులపై భవిష్యత్తులో పెట్టదలుచుకున్న ఆర్ధిక వనరులతో యీ ప్రోజెక్టులు చేపట్టి దేశ భవిష్యత్తును వుజ్వలం చేసుకోవచ్చు. యిక పోతే …
సొలార్ ఎనర్జీ (Solar Energy): the pure energy and green energy. యీ భూ ప్రపంచంలో వున్న మూడొంతుల భూ భాగంలోధ్రువ ప్రాంతాలు తప్పించి మిగతా 80% భూభాగంలో రోజుకు ఆరు గంటలనుండి పది గంటల వరకు సూర్య కాంతి లభిస్తుంది. ఆ కాంతి వల్ల లభించే శక్తిని మన దైనిక విద్యుత్ అవసరాలకు వినియోగించుకొనే శాస్త్ర పరిగ్నానం,పరిశోధనా స్థాయినుంచి వుత్పాదనా, వినియోగ స్థాయిలకు ఎదిగింది.కాని ,దాని వినియోగం కొన్ని దేశాలకే పరిమితమయింది కాని,అన్ని దేశాలకు, అన్ని స్థాయిల వినియోగదారులకు యింకా అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం వాడుకలో వున్నట్లుగా,చిన్న చిన్న పరికరాల చార్జింగుకో, నీటిని వేడి చెసుకొటానికో మాత్రమే పరిమితం కాకుండా,విద్యుత్త్ ను నిలువ చేసుకొనే ప్రత్యమ్న్యాయాలు అభివ్రుద్ధి పరచుకొని,పెరుగుతున్న అన్ని గ్రుహోపయోగావసరాలకూ సోలార్ విద్యుద్వినియోగం జరిగినప్పుడు, మన దేశం లాటి అభివ్రుద్ధి దిశలో పయనించే దేశాలకు క్రొత్త భారీ విద్యుత్ ప్రోజెక్టులపై, భారీ మొత్తంలొ వెచ్చించవలసిన అవసరం రాదు. తద్వారా మిగులుతున్న ఆర్ధిక వనరులతో యింటింటికీ ఓ 5k.w సోలార్ ఎనెర్జీ కిట్ గనుక, జాతీయ భాద్యతగా అందించితే..ఆ ధనాన్ని నెల నెలా విద్యుత్ బిల్లులా కొన్నినెలల కిస్తుల రూపంలో వెనక్కు రాబట్టుకోవచ్చు.సరఫరాకొరకు,స్థంభాలు, తీగలూ నియంత్రణ వ్యవస్త అవసరం వుండదు కాబట్టి ప్రభుత్వానికి సరఫరా, నియంత్రణ పై ఖర్చులు వుండవు.భారత దేశంలో ప్రతి పూరి గుడెసెకు,నట్ట నడి అడవిలో వున్నా,ఎడారి మధ్యలోవున్నా కూడావిద్యుత్అందినప్పుడే,దేశం కొంతలో కొంత అభివ్రుధ్ధి చెందినట్లు. .
ప్రతి గ్రుహ వినియోగదారుడూ తమ స్థాయిలోసూర్య శక్తి వినియోగించి ఓ విద్యుత్ వుత్పాదకుడవ్వాలి.. ప్రజలకు సరైన,అవగాహన, ఆర్ధిక సహకారం అంది, ప్రతి గ్రుహస్తుడూ తక్కువలో తక్కువ సగటున 05kw విద్యుత్తును వుత్పత్తి చేసుకోగలిగే లా , వ్యవస్త యెర్పడితే, విద్యుత్ అంతరాలనుండి విరామం దొరుకుతుంది. వినియోగ దారుడు, ఆర్ధిక పరిపుష్టి చెంది, మరిన్ని విద్యుత్పరికరాలు వినియోగించే స్థితికి చేరుతాడు. . తద్వారా ఆయా పరిశ్రమలూ పెరుగుతాయి. పారిశ్రామిక వుద్యోగ అవకాశాలు పెరుగుతాయి, యిలా ప్రతి దేశంలోనూ ఆచరిస్తే ప్రపంచ వ్యాప్తంగా ,నిరుద్యోగ సమస్య చాల వరకు పరిష్కరించబడుతుంది,కొనుగోలు శక్తి పెరుగుతుంది.
యీ ప్రక్రియ కెనడాలో అమలులో వున్నది. కాకుంటే ప్రభుత్వమే ప్రతి గ్రుహస్తుకూ సోలా ర్ ప్యానెల్ వ్యవస్త ఏర్పరుస్తారు.. అందు నుంచి వుత్పత్తి అయిన విద్యుత్ సరఫరా వ్యవస్తకు కలుపుతారు.ప్రతి యూనిట్ కూ వారి అవసరాలకు ప్రభుత్వం నుంచి అందే ధర కన్నా ఏడు రెట్లు ఎక్కువ ధర చెల్లిస్తారు.యీ విధానం గ్రీన్ ఎనెర్జి యాక్ట్ ద్వారా అమలు చేస్తున్నారు.
గ్రుహ విద్యుత్ అవసరాలు సూర్యుని శక్తితో తీర్చుకోగలిగినప్పుడు, క్రొత్తగాప్రతిపాదించి,నిర్ర్మించ తల పెట్టిన నూతన విద్యుత్ ప్రోజెక్టులను, విరమించుకొని, తద్వారా మిగిలే ఆర్ధిక వనరులు, యీ విధంగా సోలార్ ఎనెర్జీ వుత్పత్తికై ప్రోత్సాహకాల రూపంలొ అందించవచ్చు. నూనె, బొగ్గు, అణు యింధనం,వగైరాలను, యితర సామాజిక అవసరాలకు, శాంతియుత ప్రయోజనాలకు, అభివ్రుధ్ధికి, మళ్ళించ వచ్చు..
ప్రస్తుతం కెనడాలో వికేంద్రిత సోలార్ విద్యుదుత్పత్తి ఇంటింటా ప్రభుత్వ పర్యవేక్షణలో జరుగుతోంది. స్పైన్ దేశంలో11M.W to 50M.W వరకు,అమెరికాలో 64M.W నుండి 354 M.W వరకూ భారీ స్థాయిలో సోలార్ విద్యుత్ వుత్పత్తి చేస్తున్నారు.
మనం మన దేశం లో భారీ సోలార్ ప్రోజెక్టులు నిర్మించనవసరం లేదు.కెనడా దేశ విధానాన్ని కూడా పాటించనవసరం లేదు.పెద్ద సోలార్ ప్రోజెక్టులకయ్యేద్రవ్యాన్ని ,భవిష్యదవసరాలు ద్రుష్టిలో వుంచుకొని ప్రతి గ్రుహస్తుకు వారి వారి అవసరానికి విద్యుత్ వుత్పాదన చేసుకొని నిలవ చేసుకొనే పరికరాలను వుచితంగానో, సబ్సిడీ ధరలకో యేర్పాటు చేసి యిస్తే , ప్రతి యింటా విద్యుద్పత్తి జరిగి, దేశంలో ప్రస్తుతం జరుగుతున్న విద్యుదుత్పత్తినుండి గ్రుహావసరాలకు యివ్వ వలిసిన అవసరం వుండదు. తద్వారా మిగిలిన విద్యుత్ను యితర ప్రయోజనాలకు వినియోగించ వచ్చు. అదే విధంగా అన్ని పరిశ్రమలనూ నిర్బంధ సోలార్ విద్యుదుత్పాదనా సంవిధానంలోకి తెచ్చి,వుత్పత్తి ఖర్చులను నియంత్రించ వచ్చు.
విద్యుత్ లోటును పూడ్చుకొని దేశం పురోగమనం సాధించ వచ్చు. విద్యుదుత్పత్తికై ఆయా దేశాలు ఇంధనవనరులు వినియోగించ వలసిన అవసరంలేదు, ఇంధనం కొరకు యితర దేశాలపై ఆధారపడవలసిన అవసరం లేదు.
ఇంతటి బ్రుహత్తర బహుళ ప్రయోజనాలున్న యింటింటా సోలార్ ఎనెర్జీ వుత్పత్తికీ, వినియోగానికీ ప్రభుత్వాలు ఎక్కువ ప్రాధాన్యాన్నిచ్చి, ఆ దిశగా క్రుషి చేసి ఆ ఆశయాన్ని త్వరితగతిన సాధించేందుకు సాంకేతిక నైపుణ్యాన్ని అభివ్రుద్ధి చేసుకొని స్వయం సమ్రుద్ధి సాధించవలసిన అవసరం ఎంతైనా వుంది. ఇప్పటివరకు ఆ దిశగా క్రుషి జరగకపోయినా పొరపాటు కాక పోవచ్చుకానీ, యికనయినా స్పందించక ఆ దిశగా పయనించకపోతే , దానికై ఆర్ధిక వనరులు సమకూర్చకుంటే అంతకన్న దుర్గతి,ఘోర తప్పిదం మరేమీ వుండదు.
ఈ సూర్యశక్తి వినియోగించి చేసే విద్యుదుత్పాదన వల్ల, యే దేశమైనా ,తమ దేశ యింధన వనరులు వేరెవరో కొల్లగొట్టుకు పోతున్నారనే భావన ఆయా ప్రజల మనోభావాలనుండి తొలగి,వుగ్రవాద భావనలు సమసి పోయి, ప్రస్తుత భయానక ప్రపంచంలోని భయానక వుగ్రవాదం తిరోగమన పధంలో పయనించడానికి సోలార్ ఎనెర్జీ ముఖ్య భూమిక పోషిస్తుందనీ ప్రపంచాన శాంతి పరిఢవిల్లుతుందని నా ఆకాంక్ష.
అక్టోబర్ 26, 2009 at 4:47 ఉద.
మంచి విషయం రాసినందుకు అభినందనలు.ఇలాంటి విషయాలమీద సాంకేతిక సమాచారం ఉంటే రాయండి. అంటే ఉదాహరణకు వొక చదరపు మీటరు పానెల్ నుండి యెంత శక్తిని సంగ్రహించవచ్చు మొదలైనవి.
అక్టోబర్ 26, 2009 at 4:54 ఉద.
Thank you, Mr.SeetaramReDdy gaaru.I will try to do that.Thanks again for visiting my blog..with wishes…Nutakki
అక్టోబర్ 26, 2009 at 5:58 ఉద.
నా కోరిక మన్నించి సౌరశక్తిపై వివరంగా టపా వ్రాసినందుకు నెనర్లు.
కెనడాలాంటి చలిదేశంలోనే సౌరశక్తిని అంతగా వినియోగంలోకి తేగలిగితే ఇక మన దేశంలో ఎంత అవకాశముందో ఊహించవచ్చు.
మన ప్రభుత్వాలు ఎప్పుడు మేలుకుంటాయో?
అక్టోబర్ 26, 2009 at 6:06 ఉద.
Dear Appaarao garu.Really you are my motivator in this concern.Thank you very much.let’s work on that further….with wishes…Nutakki
అక్టోబర్ 28, 2009 at 10:53 ఉద.
Nice info.. very informative… Thanks for bringing here.. 😉
అక్టోబర్ 28, 2009 at 5:54 సా.
Thank you very much for your visit to my blog also for your comment…..Nootakki
సెప్టెంబర్ 20, 2010 at 8:58 సా.
welldone.give information how to build home made solar energy step by step
సెప్టెంబర్ 21, 2010 at 12:12 ఉద.
Dear Narendra ,
Thank you very.much for visiting my blog n appreciate my work.According to my limited knowledge ,I am trying to explain you as follows.
1)light energy will be converted in to electrical energy.That will be done through Solar cells.solar panel will be focused to sun which will be moved according to the movement of sun with the help of electric/electronic/ mechanical technologies together..
(I have least knowledge about Solar cell technology.)
2)Generated electricity will be in the form of “Direct current”(D.C) (1)which can be stored in electrical storage units such as lead acid batteries etc.and converted to A.c (alternate current.)by using converters/ inverters and regulate it to required A.c voltage which can be used for presently available electrical equipment.
3) Other way is….the generated and stored solar energy can be used to run the Alternator which can generate required alternat current and regulate it for required voltage, which is suitable for present day used electrical equipment.
for this required equipment :
1)solar panel of required capacity,
2)storage unit of required capacity./
3))converters/inverters of required capacity/or alternator of required capacity
4).step up Transformers of required capacity.
5)Distribution equipment and safety accessories of required capacity.
This procedure can be adopted and used for domestic,commercial, and Industrial units
individually or with multi user manner.or can be adopted for agriculture sector too.
If solar kits (includes,solar cells,storage batteries,converters/inverters with transmission and protection equipment)available to your power requirements of ranges ,..5kw,10kw,20kw etc. of ,your domestic or commercial,agricultural,industrial electrical power needs,
those can be installed over every hut or a building or over an industrial building. or over a tree in agricultural fields.
with this,every sector can generate power and use for their requirements to maximum extent and give relief to present grid systems and generating stations from overload trip pings.. and shortage of fuels, water etc.
with wishes…Nutakki Raghavendra rao..
నవంబర్ 14, 2010 at 9:23 సా.
please inform cost of 5kw, 10kw domestic
నవంబర్ 14, 2010 at 11:59 సా.
Dear sir,Sharma garu,
I am unable to provide you required information for now.But I will try to get information and inform you shortly. Many manufacturers are at CHAINA. you can browse “5kW Solar energy generating kits”. you may get plenty of information I feel .With wishes …Nutakki Raghavendra Rao.
నవంబర్ 15, 2010 at 4:46 సా.
Dear Sri Sharmaji ,
Thanks for visiting my blog n showing interest to know some components about green energy. sir , I am also an enthusiast to know about solar power and green energy. and I normally will share the collected information with interested persons..
(Geographically to explore Solar energy we are at great location on the planet earth.)
As you asked… As per the information available with me , ….
“5kw off grid …solar generating kit” with out batteries, may cost us in Indian currency about Rs 7,50,000-00 approximately .If you want to store it and use ,cost of Batteries extra.
Personally I feel This is huge amount for a common man. or for a middle income group.
Governments only can do this by procuring systems in bulk and fix kits over every residential roof tops/industrial sheds etc on Gov. cost ( from the allocated budgets for installing huge solar projects with public funds).and collect back the incurred expense’s in installments, which will give quick results.
Users can pay back the installments from the saved expenses of power bills. Or otherwise governments can procure back the excess power generated ,to local/national power grid.
If you want any more detailed information , can browse for manufacturers of solar power generating equipment and request for the prices…..with regards ….Nutakki
నవంబర్ 26, 2011 at 7:25 సా.
hi sir
u r story is very use full,
but we want to establish one 2-3 kva solar power center for our home please told about the cast, eqpments, etc…. at hyderabad
డిసెంబర్ 8, 2011 at 4:17 సా.
Sir ! In India Low powered Equipment like Solar water heaters ,chargers ,cookers are available. I will provide you latter some addresses of suppliers who can supply 1,2, k,w solar power generating systems. Thanks for your interestshown.
మార్చి 27, 2012 at 10:37 ఉద.
nenu energy manegement lo mtech chesanu.kani intlo kaleeega vunnanu .anukontanu koddi rojullo asalu apgenco aptransco ane padale vinamemo andaru non conventional energy sources vadutaremo ee apseb board anedi futurelo vundademo anukontanu.naaku intiki vaka solar plant build cheyyali anukontanu.capital yekkuva ina,running charges vundavu kada.govt intiki konta loan iste solar plants intiki okati pettukovachu.
మే 8, 2012 at 10:06 ఉద.
Dear Sarada Palamala jee ,Thank you very much for visiting my blog. If you browse on line for 5Kw solar energy pack you can get plenty of information about Manufacturers of Solar energy Genrating kits. Yah it’s very expensive n Surface occupation problem to instal pannels. for domestic needs.
Only Govt Can Think n take decissions for residential user sector.
మే 8, 2012 at 9:20 ఉద.
namaste merepotes challabhagundi mecell noeyandi myno 9848502089 pl call me kvprasad my fb user name kommarajuvaraprasad
మే 8, 2012 at 12:43 సా.
Thank you Very Much Dear Kommaraju Varaprasad garu for visiting my blog n liking my post..Sure. I will call you with in short time when iam free.
సెప్టెంబర్ 4, 2012 at 7:09 సా.
Dhini Gurunchi Mrinthaga Pracharam Ayethatattu Prayatninchandhi..
అక్టోబర్ 29, 2012 at 11:38 సా.
తప్పక.
డిసెంబర్ 17, 2012 at 9:19 సా.
its very good information
ఏప్రిల్ 8, 2013 at 7:45 ఉద.
Thanks Dear Mr Ravi ..Thank you very much for visiting my blog.
ఏప్రిల్ 8, 2013 at 9:14 ఉద.
@ ప్రతి గ్రుహస్తుకు వారి వారి అవసరానికి విద్యుత్ వుత్పాదన చేసుకొని నిలవ చేసుకొనే పరికరాలను వుచితంగానో, సబ్సిడీ ధరలకో యేర్పాటు చేసి యిస్తే , ప్రతి యింటా విద్యుద్పత్తి జరిగి, దేశంలో ప్రస్తుతం జరుగుతున్న విద్యుదుత్పత్తినుండి గ్రుహావసరాలకు యివ్వ వలిసిన అవసరం వుండదు. తద్వారా మిగిలిన విద్యుత్ను యితర ప్రయోజనాలకు వినియోగించ వచ్చు.
ఆ విద్యుత్ ను చిన్న పరిశ్రమలకు కేటాయించి వాటిని మూత పడకుండా చూడ వచ్చు..ఈ క్రింది వార్త చూడండి..
“విద్యుత్ కొరత కారణంగా తీసుకున్న ఆర్డర్లకు అనుగుణంగా వస్తువులను సరఫరా చేయలేక మూసివేస్తున్నారు. 334 పారిశ్రామిక ప్రాంతాలలో గత ఏడాది కాలంగా 18 వేలకు పైగా పరిశ్రమలు మూతపడ్డాయి. కార్మిక కుటుంబాలు ఉపాధిని కోల్పోయాయి. హైదరాబాద్ మల్లాపూర్ పారిశ్రామిక వాడలో 280 పరిశ్రమలు మూతపడ్డాయి. కార్మిక కుటుంబాలు ఉపాధిని కోల్పోయాయి. హైదరాబాద్ మల్లాపూర్ పారిశ్రామిక వాడలో 280 పరిశ్రమలుండగా, 94 చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మూతపడ్డాయి. 6290 పరిశ్రమలు సిక్ జాబితాలో ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ అధికారికంగాప్రకటించాల్సిన పరిస్థితి…“.
ఈ పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల పారిశ్రామిక వాడల్లో ఉంది
అందువల్ల మీరు చేసిన సూచన అత్యంత వేగంగా అమలు చేయదగ్గది…వీదిన పడ్డ కుటుంబాలు నిరుద్యోగ సమస్యతో వేగిపోతున్నాయి..మనీ సర్క్యులేషన్ లేక రాష్ట్రం లో అన్ని ప్రాంతాల్లో ౩౦ నుంచి 6౦ శాతం వరకూ వ్యాపారాలు తగ్గిపోయాయి మరియూ డబ్బుతో ముడిపడిన అన్ని వ్యవహారాలూ లావాదేవీలు స్థంభించిపో యాయి.అన్ని రంగాల వారూ తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు..
కానీ వీటిని ఆచరించే వారెవరు?… వీధి *** కాట్లాడుకునే మన నాయకుల ఓట్ల పధకాలను పెట్టినంత హడవిడి ఇంపార్టెన్స్ ఇలాంటి వాటికి అంతగాఇవ్వరుగా??
ఏప్రిల్ 8, 2013 at 10:07 ఉద.
డియర్ ఎస్ వి ఎస్ వి జి ,నాలుగేళ్ల క్రితం ఈ వ్యాసం రాసిన నాటి దుర్భర పరిస్థితులు మరింతగా దిగజారి నేడీ దుస్థితి .. ప్రభుత్వాన్ని నడుపినా ప్రతిపక్షంగా వున్నా .. మీరన్నట్లు రాజకీయులకు ఓట్ల రాజకీయాలు, స్వలాభేపెక్షలు తప్ప ప్రజావసరాలపట్ల, సమస్యల పరిష్కారాల పట్ల తీసుకోవలసిన శాశ్వత చర్యల యడల నిబద్ధత లేదు.నా ఈ వ్యాసం మిమ్ము ఆకర్షించినందుకు ,బ్లాగును వీక్షించి మీ అభిప్రాయం .తెలియజెప్పినందుకు ధన్యుణ్ణి.