స్కై స్కేప్

(నా కుంచె నర్తించి స్రుష్టించిన ఓ వర్ణ చిత్రం)

 రచన:నూతక్కి, తేది:27-10-2009

నా నేత్ర ద్వయ కెమేరా

మనోఫలకంపై చిత్రించిన

         ద్రుశ్యం

    చిత్రాతి చిత్రంగా

మనోహర వర్ణ రూపమై……

 నీల గగన వూర్ధ్వ తలాన

వివిధ కల్పిత రూప

విన్యాసాల

 మేఘమాలికల

 వుధ్ఠాన పతనాలలో

 దాగుడుమూతల

 సయ్యాటల వుధ్భవిత

 చిత్ర విచిత్ర వర్ణ

 సమ్మిళిత ఛాయల

నీలి నీడలు …….

 కాన్వాస్ పై నా కుంచె

 వివిధ భంగిమల

నర్తిత పద తాళిత

 ముద్రలు

 స్రుష్టిత మనోహర

 మహాధ్భుత

 వర్ణ చిత్ర  కావ్యం