నిశ్శబ్ధ నిశీధి (A moon less night scape)తేది:28-10-2009
రచన: నూతక్కి రాఘవేంద్ర రావు
నిశ్శబ్ధ నిశీధికి వీనుల విందన్నట్లు
ఆలాపననందుకున్న
నేపధ్య గాయకులు కీచురాళ్ళు
మ్రుదంగ వాద్యాన్నందిస్తూ బెకబెకలు
శ్రుతి కలుపినట్లు
గాలి వాలుగా వేగంగా
వాయులీనాలువూదుతూ
ఎదురు పొదల చివళ్ళు
గగనతలాన అమవసనిశిలో
రేరేడేడని యింకను రాలేదమని
ఎదురు తెన్నుల నిర్వేదనలో
మధన పడి అలగిన తారల
నేత్రాలనుండి రాలిన
అశ్రు ముత్యాల్లా వుల్కలు
అంతర్గర్భాన చిక్కడిన ఆత్మల
నిశ్శబ్ద వేదనా రోదనలు
మౌనంగా భరిస్తూ సమాధి రాళ్ళు
విక్రుత వేదనలో
ఎక్కడో సుదూరాన నక్కలు
అనుబంధం వ్యక్తపరుస్తూ
గళంవిప్పిన వూర కుక్కలు
కళాప్రదర్శనకు యీ రేయే అనువని
పూనుకొన్న చోర శేఖరులు
(యీమాట ఆనాటి రోజులకే మాత్రమే వర్తిస్తుందిసుమండి..ఈనాడు వారి కళా పటిమ వినూత్న రీతిన మహోన్నత స్థాయికి చేరింది లెండి
)
అక్టోబర్ 29, 2009 at 3:12 ఉద.
ఇటువంటి ఓ నిశీధిరేయిలో నాలోకి నేను తొంగి చూసుకుని వ్రాసుకున్నాను. కీచురాళ్ళ ప్రయోగంతో గుర్తుకు వచ్చింది…
నాడు ఊగిసలాడి, వేగిరపడి తృళ్ళిపడిన ఉవ్విళ్ళు,
నన్ను నేనే దోచుకుని వేడుకచూసిన సందళ్ళు.
నేడు సత్తువలేక, సాగిలపడి నిట్టూరుస్తున్న సవ్వళ్ళు,
నన్ను నేనే మరిచిన ఈ నిశీధి పయనంలో కీచురాళ్ళు.
అక్టోబర్ 29, 2009 at 4:57 ఉద.
థాంక్యూ వుషా ! అంత బాధలోనూ
అంత్య ప్రాసలందించినందుకు…
రియల్లీ అత్యధ్భుతం
యీ నీ భావజనితం
“ఉవ్విళ్ళు,సందళ్ళు
,సవ్వళ్ళు, కీచురాళ్ళు ”
అంత్యపదాల సయ్యాటలు…….
నాటి ఆనందపు అనుభూతుల వింజామరలు…,
నేటి నిట్టూర్పుల పొగల సెగలు….
జీవన వాస్తవాలలో వ్యత్యాసాలు.
లోపిస్తున్నాయెక్కడో సమన్వయాలు
వెలుగులు లేనప్పుడునీడలనే మాటెక్కడ,
పల్లమంటు లేకుంటే ఎత్తుకు విలువెక్కడ
నాడన్నది వున్నపుడే నేటికి వునికిక్కడ
కష్టమంటు లేకుంటే సుఖం విలువ యింకెక్కడ?…………
అలా అలా సాగిపోయేదే జీవితం….నెనరులు…….నూతక్కి
కొనసాగింపు…..
అది సరే !రాయొద్దని చెప్పినా రాసుకొంటు పోతే యెలా!
అక్కడ యాంటీ బైటిక్స్ అంత త్వరగా వాడరు కదా?
యిప్పుడు యెలా వుంది నీ చేతిబాధ? జాగ్రత్తమ్మా వుషా!
అక్టోబర్ 30, 2009 at 3:41 సా.
“నిశ్శబ్ద వేదనా రోదనలు
మౌనంగా భరిస్తూ సమాధి రాళ్ళు
విక్రుత వేదనలో
ఎక్కడో సుదూరాన నక్కలు
అనుబంధం వ్యక్తపరుస్తూ
గళంవిప్పిన వూర కుక్కలు” …. వాహ్ ….!!!
మీ దగ్గర ఒక క్లాస్ అటెండ్ అవ్వాలండి నేను…!
అక్టోబర్ 30, 2009 at 5:40 సా.
థాంక్ యూ, నెల బాలుడు గారూ, …..అభినందనలతో …నూతక్కి
అక్టోబర్ 31, 2009 at 10:52 ఉద.
బావుందండీ.
మరో విషయం:నాకు మీరనుకున్నంత అర్హత లేదు.’ఈ మాట చెప్పడానికి ఇంత ఆలస్యమా?’ అనకండి.ఆలస్యంగానైనా,అంచనాలని అందుకుంటానన్న ఆశతో ఆపుకున్నాను.
నవంబర్ 1, 2009 at 9:33 ఉద.
రేరాజు గారూ,అభినందనలు.వెరే పనుల వత్తిడి లో వుండి సమయానికి మీకు సమాధానం వ్రాయలేక పోయాను.
అర్హతానర్హతల ప్రస్తావన .
అర్హత ను గుర్తించాల్సిన
భాధ్యత ఎల్లప్పుడూఎదుటి వారిదే. .
సామర్ధ్యం మనకు మనకుగా తెలిసేది.
దానిని గుర్తిస్తే ఆచరిస్తే ఆత్మవిశ్వాసమౌతుందది
అది ముదిరితే అనరా అహంకామని.
మనలను మనం తక్కువగా
భావించుకుంటూవుంటే
అనిపించదా ఆత్మ న్యూనతని.
మీకు విశదీకరించేంతటి వాణ్ణా నేను.
నవంబర్ 6, 2009 at 9:29 ఉద.
నూతక్కి గారికి, నమస్కారములు.
కవిత అద్భుతంగా వున్నది.
భవదీయుడు,
మాధవరావు.
నవంబర్ 6, 2009 at 10:48 ఉద.
“నిశ్శబ్ధ నిశీధి” : మీకు నచ్చినందుకుధన్యుణ్ణి మాధవ రావ్ గారూ, ఎలా వున్నారు?. ఈ మధ్య వేరే కార్యక్రమాల వత్తిడిలో బ్లాగ్వీక్షణలు తగ్గాయి. అతి త్వరలో మనం కలుద్దాం…..శ్రేయోభిలాషి …..నూతక్కి రాఘవేంద్ర రావు.