సమన్వయం
రచన:నూతక్కి రాఘవేంద్రరావు
తేదీ: 31-10-2009
నాటి
ఆనందపు అనుభూతుల
వింజామరల పిల్ల గాలులను
మనసుల దరిచేరనీక
నేటి
అస్తవ్యస్త అంతరంగ
విన్యాసాలు వైవిధ్యభరితమై
జీవన వ్యత్యాసాలు
వాస్తవంలో నలిగుతున్న
సున్నిత భావనల
జీవితాలు
లోపిస్తున్నవెక్కడో
సమన్వయాలు
అక్టోబర్ 31, 2009 at 10:58 సా.
ఈ నేడే రేపటికి నాడు… కనుక ఇవి తప్పని సంవేదనలు. అనుకూలించని సమన్వయాలు. ఎప్పుడూ నిన్న వంక చూపులతో, రేపు కొరకు కలలతో నేడు చేజార్చుకునే వెర్రి బ్రతుకులు…
నవంబర్ 1, 2009 at 8:26 ఉద.
Dear Usha, thank you very much for your expressions… your words are nice.. In this connection….i want you to go through my expression. (for your ready reference which was posted by me ….on July 10th 2009 in this blog ).Take care of your health .with wishes….Nutakki
భవిత
( ఓ ఎండమావి )
రచన:నూతక్కి రాఘవేంద్ర రావు
తేది:11-07-2009
గతం నుండి బయటకొచ్చి
వర్తమానం ఆ చివరి నుండి
భావిలోకి … తొంగి చూడాలని
ఆత్రంగా అడుగులేస్తూ
వర్తమానాన నా మానాన
నే నడుస్తూ మరో అంచు కు
చేరానని భ్రాంతిపడుతూ ….
భంగ పడుతూ ….
వెనుతిరిగి చూస్తె !!!
ఆశ్చర్యం
నావేనుకంతా భూతం ….
వేస్తున్న అడుగొక్కటే వర్తమానం ….
భవిత వర్తమానమై …
తత్క్షణమే భూతమై….
గోచరా గోచరమై
అగమ్య మై …….
నా కనుల ముందే
క్షణ దూరంలో భవిత ….
పొందలేక ఆశక్తుడనయి
అయోమయంలో