వ్యత్యాసాలు

 రచన: నూతక్కి రాఘవేంద్ర రావు  తేదీ: 31-10-2009

వెలుగులే లేనప్పుడు

నీడలనే మాటెక్కడ,

 పల్లమంటు లేకుంటే

ఎత్తుకు విలువెక్కడ

నాడన్నది వున్నపుడే

నేటికి వునికిక్కడ

కష్టమంటు లేకుంటే 

సుఖం విలువ యింకెక్కడ

 అలా అలా ఒడిదుడుకులలోవాస్తవాల క్రీనీడల

పారాడేదే జీవితమట