సమన్వయం

 రచన:నూతక్కి రాఘవేంద్రరావు

 తేదీ: 31-10-2009

నాటి

ఆనందపు అనుభూతుల

వింజామరల పిల్ల గాలులను

 మనసుల దరిచేరనీక

నేటి

అస్తవ్యస్త అంతరంగ

 విన్యాసాలు  వైవిధ్యభరితమై

 జీవన వ్యత్యాసాలు

వాస్తవంలో నలిగుతున్న

 సున్నిత భావనల

జీవితాలు

లోపిస్తున్నవెక్కడో

సమన్వయాలు