అక్టోబర్ 2009


మాత్రు సంరక్షణ-1

 రచన: నూతక్కి

తేదీ : 24-10-2009

కిచ్ కిచ్ శబ్దాలు విని

 గ్రుడ్లు పొదగబడ్డాయని,

 చూద్దామని మచ్చెక్కినంత

 తమకేదో మూడిందని

 పొడిచి తరిమె పొదుగు పెట్ట

కాలాంతర్గమనం లో

(విరోధినామ వుగాదిన వ్రాసుకున్న నా మనోభావన) 

రచన:నూతక్కి , తేదీ :24-10-2009

 మూడు కోట్ల

 పదహారు లక్షల

 ఇరవై రెండువేల

 నాలుగు వందల క్షణాలు…..

 సర్వధారి రహధారిన

 కష్ట నష్టాలకోర్చి

 నా సుధీర్ఘ పయనం….

 క్రొత్తంటే ఎంతైనా యిష్టం

 కదా ఎవరికైన…..

విరోధిని పలుకరిద్దామని 

స్నేహ హస్తమందిద్దామని

సుస్వాగతమందామని

  అత్యుత్సాహంతో

వేగిర పడ్డానని

 కలత చెంది

అలక పొందెనేమో

 మరి

ఒకే ఒక్క క్షణంలో

క్షణికావేశంలో

కనుమరుగై

 సర్వధారి !

 యీ జన్మన నిను కను

 అవకాశం రాదిక యని

కళ్ళల్లో సుళ్ళుతిరిగె కన్నీరు 

 బై బై….మిత్రమా !సర్వధారి!

నమ్మకాల సవ్వడుల పీట ముడులు

రచన: నూతక్కి

తేది: 21-10-2009

ఏ మతమైనా

మతగ్రంధమైన

హిందూ,ముస్లిం,

క్రైస్తవ,సిక్కు

 గీతైనా, ఖురానైన,

 బైబులైన గురుగ్రంధా సాహెబైన

 మరే మతమైనా

మరోగ్రంధమైన

అన్నిటికీ మూలం, మం త్రం

 మానవ జీవ సజీవ

సహజీవన హితం

ఆ హిత యోచన

మతమై మూఢమై……

విక్రుతమై భూతలాన…..

చంపేదీ చంపించేదీ

రక్షించేదీ భయపెట్టేదీ

 కాటేసేదీ,కాల్చేదీ,

ముంచేదీ,

రోగం రొష్టూ ఆపిందని

 గంగానమ్మో ,

పోలేరమ్మో,

కంకాళమ్మో…….

చెట్టూ,పుట్టా,

గుట్టా మెట్టా ,

కూలిందనో…….

 నీరూ, నింగీ,

అగ్గీ, పామూ,

తేలూ,తాబేలూ

ముంచిదనో,

కాల్చిందనో,

కాటెసిందనొ

చేపా,ఎద్దూ,

ఆవూ, దున్నా,

వరాహ రూపమ్,

యేనుగు,,మొసలీ,

 డేగా, నెమలీ

ఆఖరుకా ఎలుక పిల్ల

 సుడిగాలీ గాలివాన,

కూలే చెట్టూ

పాములకిరువై

చెదలపుట్ట

మానవ జీవనాన

ఆనందమో,

వుత్పాతమో

స్రుష్టించినవని

అన్నీ మన దేవుళ్ళై

మన నమ్మకాల

సుడి తిరిగిన పీట

 ముడులు,

పుణ్యంతో స్వర్గానికి

 నిచ్చనలు,

నరకానికి పాప ఖడ్గ

 చేదనలు

 పాపం, పుణ్యం,

 స్వర్గం, నరకం,

 తత్ భావోధ్భవ,

భయోధ్భవ

వుధ్భవాలు …..

భువి భారతిన

అసంఖ్యాక దేవుళ్ళు

నవ భారతిలో మహాభారతం

రచన: నూతక్కి తేది: 19-10-2009

నవ భారతిలో మహా భారతాన్ని

 చదివేవాడుండాలే కాని,

తిరగరాసుకొంటూ పోరా

 నవ్య మహాభారతంగా…..

నమ్మేవారుండాలికాని

అదే నిజ భారతమని రమ్యంగా…..

 సమకాలీన సమాజాన్ని

 కాల గతిన మిళితం చేసి

దివంగత రాజకీయులను

కధానాయకులు గా పేర్చి,

 భువిపై మహోద్ధారకులని,

 ప్రజల వుధ్ధరణకై ప్రభవించిన

దేవుళ్ళని ,

 ప్రస్తుతించి టామ్ టాంచేసే

 వంది మాగధుల తోడుండాలే కాని .

కధకుల కల్పనా సామర్ధ్యం

 నవ దేవుళ్ళను స్రుష్టిస్తూ

 రాయించలేదా రమ్యంగా

మరో భారతం…….. నఃభూతోనఃభవిష్యతి

 యని పలువుర మది తొలిచేలా

 సమసమాజ జీవనాన

నాగరీక సమాజాన

 మానవ జీవితాలుకొన్ని

 విచిత్రంగా చిత్రితమై.

దైవాంశ సంభూతులుగా

మారు తున్నమన కాలంలో…..

“ఇదో సులుసూత్రం…..జలవాయు మంత్రం

(“నీరెక్కువ త్రాగు ,గాలెక్కువ పీల్చు,ఆరోగ్యంగా వుండు.” )

రచన: నూతక్కి తేదీ: 20-10-2009

చిన్న విషయాలే, అలోచించి ఆచరించటానికి యేమంత కష్టమూ కాదు. కానీ యీ విషయాలపై శ్రద్ధపెట్టి మనసు కేంద్రీకరించి ఆచరించాలన్న ఆలోచన కు ఎవరూ ప్రాధాన్యత నివ్వడం లేదు. ఆచరిస్తే అమూల్య మైన ఆరోగ్యం తమచేతుల్లోనే వుంటుంది. “నీరెక్కువ త్రాగు ,గాలెక్కువ పీల్చు,ఆరోగ్యంగా వుండు.”    ఇదో సులుసూత్రం…..జలవాయు మంత్రం. 

1) దాహమైందంటే శరీరానికి మనం నీరు అందించాలని సంకేతం.కాని మనం నీటికి బదులు,కాఫీ, టీ,కల్లు సారాయి, బ్రాందీ,విష్కీ లేక మరో,కల్మషభూయిష్ట పదార్ధాలో (సాఫ్ట్ కూల్ డ్రింక్సో) త్రాగుతుంటాం. వాటి వల్ల హానికారకారక పదార్ధాలను శరీరం లోకి చేర్చుకుంటూ,కల్మషాలను కడిగే నీటి ని శరీరానికి అందించక లేక పోవడం వల్ల శరీరం రోగ భూయిష్టమౌతోంది. 2)మనలో అనేక మంది పనుల వత్తిడిలోనో, యేవేవో సమస్యల పై అలోచిస్తూనో, ఎక్కువగా మాట్లాడుతూనో, కావలిసినంతగా గాలిని పీల్చక, శరీరానికి కావలిసిన ప్రాణ వాయువును అందించ లేక పోతున్నారు.యీ సెల్ ఫోనులు వచ్చిన తరువాత మరీ అన్యమనస్కంగా మారిపోయి గాలి పీల్చడం తగ్గి పోతోంది.కంప్యూటర్ యుగంలో మరింతగా ఆలోచనల సుడిగుండంలొ కూరుకు పోతున్నారు.గాలి పీల్చడం తగ్గిస్తున్నారు. నేను నా శరీరావసరానుగుణ్యంగా నీరు ఎక్కువ త్రాగుతూ ఆరోగ్య లబ్ధి పొందుతూ నలుగురికీ తెలియ చెప్పుతుంటాను. నేడు ప్రతి మనిషీ యేదో ఆలోచనలూ,తాపత్రయం వెంట పరుగు.దాహం వేసినప్పుడల్లా టీయో,కాఫీయో,బ్రాండీయో, విస్కీయో, తప్ప కావలిసిన నీరు మాత్రం ముట్టటంలేదు. అందువల్ల అనేక రుగ్మతలున్నూ.కనీసం త్రాగే అనర్ధ దాయక పదార్ధాలు కలిగించే కల్మషాలు శరీరమ్ నుంచి కడిగేందుకైనా నీరు ఎక్కువగా త్రాగమని చెబుతుంటాను. శరీరాన్ని విక్రుతంగా మార్చగలిగే ద్రావకాన్ని కూడా నీటి తో మాత్రమే కడగ గలుగుతాం.నీటికి అంతటి మహత్తరమైన శక్తి వుంది. ప్రతి దినం నీరు లేందే నిత్యక్రుత్యాలు జరుగవు. నిత్యం చాలా నీరు వాడుతుంటాము. కాని, నీరు మాత్రం తగినంతగా త్రాగం. శరీరానికి కావలసిన నీరు ఎంత అన్న విషయం పై అనేక మంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారు. కానీ ముందు మనం నీటి వినియోగం(త్రాగే దిశగా) పెంచే ప్రయత్నం ప్రారంభించడం చాలా ముఖ్యం. (one should start cultivating the habbit of consuming of more drinking water).యిందువల్ల నీరు యిప్పడు త్రాగే దానికన్న ఎక్కువ త్రాగే అలవాటు పెంపొంది, క్రమేణా నిత్యక్రుత్యమై,అనేకానేక శారీరక రుగ్మతలను ఆదిలోనే నియంత్రించ గలిగే అవకాశం కలుగుతుంది. అదే విధంగా చాలామంది కి ఎక్కువగా మాట్లాడటం అలవాటు. ఆ మాట్లాడే ప్రక్రియలో గాలి పీల్చడం మానేయరు గాని, లంగ్స్ కు పని తగ్గిస్తారు. దానితో ఆక్సిజెన్ శరీరానికి కావలిసినంత అందదు. కొందరు అనేక దినవారీ కార్యక్రమాలవత్తిడిలో ఆలోచనలలో,తక్కువ గాలి పీలుస్తుంటారు. అప్పుడూ యిదే పరిస్తితి. “నీరెక్కువ త్రాగు ,గాలెక్కువ పీల్చు,ఆరోగ్యంగా వుండు.” అనే స్లోగన్ వినే వాళ్ళ చెవుల్లో వూదుతుండటం నాకు అలవాటుగా మారింది. బహిరంగంగా వేదికలెక్కి చెప్పకపోయినా ,గుంపుల్లో వూదరగొట్టిన రోజులూ వున్నాయనుకోండి……అమెరికాలోనూ. వయసైన ముండావాణ్ణని అక్కడ నా మాట కనీసం వింటారు, చర్చిస్తారు. భేష్, శహ్భాష్ అంటారు. కాని ,వినేవాడికి చేప్పేవాడు లోకువవుతున్న రోజులాయె. ఎక్కడైనా ఆచరించేవారు అంతంత మాత్రమే.

చిచ్చుబుడ్లు

( అప్పట్లో యింట్లోనే మేమే తయారు చేసుకున్న మా టపాసులు)…3

రచన: నూతక్కి రాఘవేంద్ర రావు.తేది:18-10-2009

కోను షేపులో లోపల హాలోగా వుండే ప్రత్యేకరీతిలోచేసి కాల్చిన చిన్న మట్టి పాత్ర లాటిది) రక రకాల సైజుల్లో దొరుకుతాయి. కంపనీ తయారీ కాగితపు చిచ్చు బుడ్లు అదేలెండి… ఫ్లవర్ పాట్స్..వాడుకలోకి విరివిగా వచ్చిచాలాసంవ త్సరాలయినా, యిప్పటికీ యివి విరివిగా వాడుకలో వున్నాయి .కాకుంటే ఖాళీ చిచ్చు బుడ్లే కాక , మిశ్రమం నింపిన చిచ్చు బుడ్లు కూడా అందుబాటులో వుంటున్నాయి. ఇందులో కూడా మతాబులలో కూరిన పొడినే, కూరవలసి వుంటుంది. పైనున్న బెజ్జంలోకి ఆముదము,సూరెకారం పొడిలో ముంచి పిండిన వత్తి టైటుగా కూర్చి వెనుక నుండి, ముందుగా తయారుచేసుకున్న (మతాబులకూ,చిచ్చు బుడ్లకూ ఒకే మిశ్రమం.)తయారు చేసుకుని ఎండబెట్టిన) మిశ్రమం పోసి, కూరి ,వెనుక బంక మన్నుతో మూసి, కొద్ది రోజులు ఎండబెట్టి.ఆ తరువాత, చీకటి పడిన తరువాత, వత్తి ముట్టిస్తే అదే అగ్ని పూల ఫౌంటైన్,అదే చిచ్చుబుడ్డి,అదే ఫ్లవర్ పాట్. అదే దీపావళికి అసలైన స్వాగతం.

మతాబులు 

( అప్పట్లో యింట్లో దీపావళి కి మేమే తయారు చేసుకున్న  టపాసులు)…2

: సమర్పణ/నూతక్కి రాఘవేంద్ర రావు

తేది: 18-09-2009

 నిన్న రోలు రోకలి గురించి చెప్పుకున్నాం కదా ,యీ రోజు మీకు మతాబులు చేసే విధానం గురించి చెబుతాను. మెగ్నీషియం రజను(స్క్రాప్) (రసాయన నామం తెలియదు), గంధకమ్(సల్ఫర్),ఆముదమ్ (కాస్టర్ ఆయిల్)ప్రత్యేకమైన పాళ్ళల్లో కలిపి, ఎండలో ఎండబెట్టి,వుంచుకోవాలి….. ముప్పావు అంగుళము డయామీటరు లో మందపాటి కాగితంతో గొట్టాలు తయారు చేసి, ఒక ప్రక్కన మూసి ఒక అంగుళం మేర యిసుక పోసి (చేత్తో పట్టుకొనే వీలుగా చివరిదాకా కాలినా చేయి కాలకుండా,గుర్తించడానికి యేదయినా మార్క్ పెట్టుకుంటే మంచిది) మిగతా భాగం యీ తయారు చేసుకున్న మిశ్రమంతో ఒక అంగుళం వదిలి కూరాలి. తరువాత ఖాళీ భాగం మూసేయాలి. .అవి కొన్ని రోజులు బాగా ఎండలో వుంచి ఎండనిచ్చి కాల్చుకుంటే (వళ్ళుకాల్చుకోకూడదు సుమా) అవేమతాబులు.ఫూల్ చడీ. చక్కని పూల వర్షం..యీ రోజుల్లో రంగు రంగులలో ధారలు కురిసేలా కూడా పదార్ధాలు కలుపుతున్నారని తెలిసింది. వాటి వివరాలు నాకు తెలియదు.

 రోలు రోకలి

( అప్పట్లో యింట్లో దీపావళి కి మేమే తయారు చేసుకున్న  టపాసులు)…1

 రచన: నూతక్కి రాఘవేంద్ర రావు.

తేది:17-10-2009

దీపావళి కి యీ రోజుల్లో అందుబాట్లో వున్న, తుపాకులు, తుపాకి బిళ్ళలు, ప్లవర్ పాట్స్, (కాగితపు చిచ్చు బుడ్లు) ఫ్లవర్ పెన్సిల్స్ ( మతాబులు ) వినియోగంలోకి రాని 1950-1970- సం.రాల మధ్య కాలమది,రోలు,రోకళ్ళు ,గంధకం పొటాషులతో,శబ్దాలు శ్రుష్టించే వాళ్ళం. (రోలు రొకలి బొమ్మ యిక్కడ ఎటాచ్ చే్సే సదుపాయం నాకు అందు బాటులోలేక యివ్వ లేక పోతున్నాను.) తలుచుకుంటే యిప్పటికీ నాకు అనిపిస్తూ వుంటుంది….అలాటి పదార్ధాలను పిల్లలకు ఎలా అందుబాట్లోకి రానిచ్చేవారోనని.

రోలు ఆకారం లో పొతపోసిన చిన్న యినప తొట్టె, రోకలి ఆకారంలో క్రింద కొన దేరి ,పొత పోసిన యినప ముక్క, వాటి వెనుక లో బలమైన ,తీగ బిగించడానికి, బెజ్జాలు. ఒక లావు పాటి జి.అయ్ వైరుకు ఒక ప్రక్క రోలు, (అటు,యిటు కదలటానికి వీలుగా )మరో ప్రక్క రోకలి, ఒక దానిలో ఒకటి యిమిడేలా అమర్చిఒక మూరెడు పొడవుండెలా గుప్పెట్లో అమరేలా వైరు యేర్పాటు చేసుకొని, పొటాషు(రసాయనిక నామం పొటాషియం క్క్లోరైడు అనుకుంటా సరీగ్గా తెలియదు), ఎక్కువ వత్తిడి కాకుండా, గంధకం విడి విడిగా నూరుకొని, విడి విడి డబ్బాలలో పోసుకొని , చిటికెడు లో సగం సగం (సమపాళ్ళలో) రెండు పొడులూ రోటిలో వేసి రోకలి, రోకట్లో బిగించి తీగ చివర పట్టుకొని రోకలి క్రింది వైపు కు పెట్టి బలంగా కనక ఏదయినా బండ మీద కొడితే లక్ష్మీ బాంబు కన్నా భయంకర మైన మోత పుడుతుంది.

గంధకమ్ ఎక్కువైతే పొగ ఎక్కువ ,మోత తక్కువ. పొటాషు ఎక్కువైతే మోత మంట యెక్కువ, పొగ తక్కువ ,వచ్చేవి. యీ సాధనాలు అన్ని కిరాణా దుకాణాల్లోనూ లభించేవి. కలిపిన పొడి కూడా ఒక్కొక్క మోతదు పొట్లాలు కట్టి లభించేవి. జాగ్రత్తలు తీసుకోకపోతె మాత్రం, యీ ప్రక్రియ చాల ప్రమాదకరం.అందుకే పెద్ద వాళ్ళపర్యవేక్షణలోనే వుపయోగించేవాళ్ళం.

పొరబాటున గంధకం పొటాషు కలిపి నూరినా, ఒక్క పొటాషుకే ఎక్కువ వత్తిడి తగిలినా,భయంకరంగా ప్రేలుతుంది. చేతులు, వ్రేళ్ళు, కళ్ళు ముఖం చాతీ కాలి పోవడం జరుగుతుంది. నేను దీపావళి సమయాలలో నా స్వంతంగా చేసిన ప్రయోగాల్లో అనేక పర్యాలు అలాటి అనుభవాలు పొందాను.యిలాటి పెద్ద ప్రమాదాలనుండి లక్కీగా బయట పడిన అనేక సంఘటనల్లో., నుండి యేదో అలా బ్రతికి బయట పడ్డాను కాబట్టే యిలా మీకీ జాగ్రత్తలు చెప్పడం.

మతాబులు, చిచ్చుబుడ్లు,దీవిటీలూ, అవ్వాయి చువ్వాయిలు, యివన్నీ కూడా యింట్లోనే తయారు చేసేవాళ్ళం. వాటి తయారీ విధానాలు మరో టపాలో. అలా అని మీరు తయారు చేసుకోమని కాదు.

దీపావళి శుభాకాంక్షలు

సమర్పణ /నూతక్కి

తేది:16-10-2009
బ్లాగ్మిత్రులకు,సాహితీ ప్రియులకు,

ప్రపంచ వ్యాప్త ఆంధ్రులకు, భారతీయులకు,

కష్టాల కడలి లోతెలియాడుతున్న తెలుగులకు

కష్టాలొచ్చాయని కళ వెలవెల పోతూ

కన్నీరుకారుస్తూ కలకాలం వుండలేం కదా!

 

దివ్వెల దీపోత్సవం మీ అందరి జీవితాల

దివ్యకాంతి నింపాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ

 రండి  రండి రండికడలి తరంగాల్లా

నవ్య భావ వుషోదయాన

దివ్య కాంతి వీక్షణకై

……మీ  అందరి రాఘవేంద్ర

దాన ఫలం

రచన:నూతక్కి రాఘవేంద్ర రావు.

తేది: 14-010-2009

బంగారం రంగుల …

బగ్గ మగ్గిన సిన్న రసం

మాయిడి పండు లెక్క

 వడిలి ఏలాడి

ముడతలు పడ్డ

సెరీరం మంచిగ

బతికి సెడిన ట్టుగ…….

 నిలుసుండే సెక్తి లేక

 వున్న తాననె నేలకొరిగి……….

 అరటి తొక్కలూ ,

పాను థూకులూ

 ముసురుతున్న యీగలూ

 యెండిన కట్టె లెక్క

 గా బతుక్కన్న,

సావే శాన నయం

 పక్కంగనే సివికిన

 గుడ్డ పరచి…..

పడిన కాసు

 పడినట్టుగ

యెవురొ యేరుకుంట్టున్నరు …..

 బిడ్డా! గా ముసిల్దాని పక్కన

 పరిసిన గా పాత నాది ..

నీ తల్లి… పైసల్గిన ముట్టితివో

 ముడుసులిరుగుతై బిడ్డ!

ఎవరో ఎవరికో బెదిరింపులు.

సత్తు బొచ్చెల్లో పైసలు

 గలగల లాడించుకుంట

హంగమా జేస్త

అడుక్కొంటున్నరు

 కొందరు…….

రిచ్చలు తొక్కెటోల్లు,

ఆటొఓల్లు సాయిలమ్మెటోల్లు,

స్సెనగపల్లి బుట్టలోళ్ళు

 గన గన గంట మోగించు కుంట

పీసు మిటాయోడు…….

అంతా లొల్లి లొల్లి

 యిటుసూడు అటు సూడు

 యెటు సూసిన లొల్లి లొల్లి.

సింపిరి తలా ,తెల్ల జుట్టు.

సిరిగిన బట్ట, సివికిబోయె

జరిగిందేందో,జరిగెడిదేందో

 జరుగుతున్నదదేందో

మనసుకి ఎర్కలేకుంట

పాపం గాయమ్మకు

 తెల్వకున్నట్లుంది.

అమ్మా ఏందమ్మా!

 యీడికొచ్చి కూసున్నవు!!?

పాపిష్టి సచ్చినోళ్ళు

గాళ్ళిల్లల పీనిగెల్ల…..

 అడుక్కొంటున్నరు తల్లి

 నిన్నడ్డం పెట్టుకుంట.

తల్లీ నీ సేతిపున్నెంల !…..

 

ఎంతమంది గరీబులు

 యిన్నేళ్ళుగ బతకిన్రో

గాల్లకు యేమెరుక తల్లి?……..

నిన్నునే బతికించుకుంట

అమ్మతోడు

నిన్నునే సాక్కుంట తల్లి.

పున్నాత్మురాలు

 గీ హవేలీ దుకాణాల్

 గవన్నీ ఆమె సంతం

 నాబతుక్కింత దారి సూపె

 నాలెక్కనె యేలమంది

మంచిగ దినాం బతుకుతున్రు

ముంజెయ్యికి బొక్కలేదు.

ఆకలేసి అడిగినోనికి

కొసరి మరీ పెట్టెడిది

అయినోళ్ళు అందినంత

దోసుకొని తగిలేస్తిరి

నెత్తిపైన మోదిరేమొ

 మాట, మంతి కరువాయె

“మారాణిల” బతికినామె

 మతిపోయి బతుకు మాసి….

మాతల్లి ఆ యమ్మను…

నా పంచన జేర్చుకొంటి

దానం సేసిన బతుకిచ్చిన

 నాయమ్మను

 నడి బాటల యెట్లిడుస్త…..?

 సాయం పట్టనీకొచ్చిన

 గా నల్గురికీ

యివరం…. సెప్పుకుంట

….. ….ఆమె…….

« గత పేజీతర్వాత పేజీ »