నవంబర్ 2009


బ్లాగ్ మిత్రులూ ! తీర్చరూ నా సంశయా లు

రచన :నూతక్కి

27-11-2009

ఎవరైనా వివరిస్తారా !

నాకు తెలియని కొన్నైనా

కంప్యూటర్ వినియోగాలు.

డిజిటల్ కెమేరాతో

 నే చిత్రించిన చిత్రప్రతులు

 నే తీసిన ఫోటో వైచిత్రులు

నా బ్లాగుకు

 ఏతీరున

అనుసంధించాలో !

 నే మెచ్చిన బ్లాగుల

నెటుల అమర్చాలో

 నను మెచ్చే బ్లాగర్ల

నెటుల సూచించాలో

నా బ్లాగ్వీక్షకులెందరో

పోస్టులను చదివినవారెందరో

తద్వివరాలను ఏ తీరున

నాబ్లాగున సమకూర్చాలో ?

 యిలా ఎన్నెన్నో

 సంశయా లు

ఇంకెన్నో శంకలు

ఎన్నెన్నో అభిలాషలు

 మరెన్నో ఆకాంక్షలు

 వివరిస్తే ఆనందిస్తా

పగుళ్ళు బారిన ప్రజాస్వామ్యం!!!

 (ఓటరు ఫోటో గుర్తింపు కార్డులు అంతా ఓ త్రాష్ !)

రచన: నూతక్కి. తేదీ:25-11-2009

 మొన్న జరిగిన హైద్రాబాద్ మహానగరపాలిక ఎన్నికల్లో ఓటరుగుర్తింపు కార్డులు అభాసు పాలయ్యాయి. ఓట్లు ఎందుకు తక్కువ పోలయ్యాయి? ఓటరు నిరాసక్త కారణమా? కానే కాదు.యింకా అనేక యితర కారణాలు వున్నాముఖ్య కారణాలు మాత్రం…, ప్రభుత్వ విధాన వైఫల్యం.ఎన్నికల కమీషన్ ,చేతకాని తనం. కాళ్ళరిగేలా తిరిగి ఓటరు గుర్తింపు కార్డు సంపాయించి ఓ పెద్ద నిట్టూర్పు విడచి నాకింకేమ్ పర్లేదని బే ఫికరుగా వుండి, ఎన్నిక రోజున ఓట్లేద్దామని పోలింగు బూతుకు పోతే, మా లిస్టులో ఓటు లేదని పోలింగు ఆఫీసరు చెబితే, ఖిన్నుడై వెనుతిరిగిన ఓటరు, దానికి భాద్యులెవరు? ఒక సారి ఓటరు గుర్తింపు కార్డు యిచ్చిన తరువాత,లిస్ట్ లో పేరులేదనో, యీ బూతు కాదనో, ఓటు లేదనే హక్కు ప్రభుత్వానికి కానీ ,ఎన్నికల కమీషన్ కు కానీ వుండరాదు. సాంకేతికఒరవడిలో సాగుతున్న ఎన్నికల పర్వంలో వోటరు ఎక్కడినుండైనాఓటు చేసే అవకాశంవుండాలి. కార్డున్నా ఓటు లేకుండా పోయి కనీసం కార్డు మీద పొందుపరిచిన బూతులో కూడా ఓటేసేహక్కు కోల్పోతే, తాము ప్రవేశపెట్టిన విధానాలకు తామే తిలోదకాలిస్తే, యింకా యీ ఎన్నికల కమీషన్లెందుకు? ఆ రోజున యేమి జరిగిందంటే ఓటరు కార్డు తీసుకొని వుదయాన్నే ఆ కార్డులో రాసి వున్న పోలింగు బూతుకు వెళ్ళిన అనేకమందికి అక్కడ వోటు లేదని తెలిసి మరో బూతు, మరో బూతు, అలా తిరుగుతూ ఓటు హక్కును అడుక్కుంటూ మధ్యాహ్నం వరకూ తిరిగి తిరిగి విసిగి వేసారిన వోటరు నిరాశతో వెనుతిరుగుతున్న ద్రుశ్యాలు చూస్తే ప్రజాస్వామ్యం పగుళ్ళు బారుతున్న ద్రుశ్యం కళ్ళముందు కదిలింది.

హంతః(ర్)జాలం

 (నీలిపుంతల ఇంటర్నెట్)

రచన:నూతక్కి

తెదీ:23-11-2009

 పరిణతిలేని వయసు న

 పరుచుకొంటున్న

 అంతర్జాల నీలినీడల

 వుచ్చులు

 పరిపక్వత చెందని

 మనసున ప్రేమంటూ

కామపిచ్చి

యాసిడు దాడుల్లో

 కత్తి పోటుల్లో

కాటికెళుతున్న కన్నెలు

చిద్రమైన సామాజిక

 కట్టుబాట్లు

నియంత్రణ,

నిర్దేశికతా రాహితిలో   

వసివాడుతున్న

భావి.. యువత

వ్యక్తిత్వ పునాదులు

 రచన: నూతక్కి

తేదీ: 22-11-2009

 (శ్రీ మిరియాల శ్రీసత్యభ్రమరార్జున ఫణి ప్రదీప్ గారి క్షణానికో రాత……..స్ఫూర్తితో )

అంధకార కుహరంలో

రూపు దిద్దుకొంటూ

 జీవి వింత వింత

 బాహ్య శబ్దప్రకంపననలకు

 స్పందిస్తూ ……

ఆహ్లాదభరితమై కొన్ని

 భయ భీకరమై మరికొన్ని

 భ్రుకుటి ముడుస్తూ

 ముడులు విప్పార్చుతూ

మనోఫలకమనే హార్డ్ డిస్క్ పై

 నిక్షిప్తమై విశ్లేషించి రాసిన రీతులే

భ్రుకుటి ముడతల గీతలు

బ్రహ్మ రాతలు

 యిరుకిరుకుగా

గర్భ కుహరాన

యిముడుతూ

ముడుచుకున్న

అరచేతుల మడతలలోగీతలు

 అరి కాలిలోని రేఖలూ

ఆకారం పొందుతున్న

 గర్భావస్త జీవ

భావోద్వేగ ప్రకంపనల

విశ్లేషణలు

మానవ వ్యక్తిత్వ

ప్రాకారాల పునాదులు

త్రిశంఖు స్వర్గమదేనా !

రచన: నూతక్కి

తేదీ: 22-11-2009

మహోన్నత పర్వత

 శ్రుంగాలనుండి

అవని అందాలు ,

మహాధ్భుత సుందర

ద్రుశ్యాలను అవలోకిస్తున్న

 అనుభూతి .

అపార జలధులు,

నదీనదాలు

 జలపాత ద్రుశ్యమాలికలు

 హిమవత్పర్వత శ్రేణులు ,

వున్నత శిఖరా గ్రాలూ,

లోయలు,…….

శ్వేతవర్ణ మేఘమాలికల

 దొంతరలు,

దినకరుని

 కిరణపుంజాల

 సయ్యాటలు,

సృష్టించిన నీలినీడలు …..

కళ్యాణ ప్రాంగణాన

సర్వాంగభూషితలై

సందడి చేసే కన్నెల్లా

 విశ్రుంఖలంగా

విహరిస్తూ పిల్ల మేఘాలు

 తెల్లని దూది పింజల్లా

 ఆకసాన విహరిస్తున్న

శ్వేతాంచల శ్రేణుల్లా,

 వాటి నీడలు

లోయలలో నడయాడే

 జీవన స్రవంతిలా

భ్రమింపజేస్తూ,

వేలాది అడుగుల యెత్తున

ఆకసాన పయనిస్తూన్న…

నా   అంతరాంతరాళాలకు

విందొనరించిన ప్రక్రుతి

విరచించిన నేత్రపర్వ

 గానామృతమది

 మహాధ్భుత సుందర

 వర్ణచిత్రమది

 తనువున అణువణువూ

 నర్తించగ.

త్రిశంఖు స్వర్గమని

 భ్రమింపచేస్తూ

 వీనులు పఠియించే

శ్రవ్య కావ్యమది,

 

మౌనప్రేరణం

రచన

:నూతక్కి

తేది: 20-11-2009

ఆకలి రుచి యెరుగదు

 నిద్ర సుఖం యెరుగదు

 అది నానుడి

 పుట్టెడాకలితో వున్నవాడిని …

వుప్పులేని గంజి,

 తాన్సెన్ సంగీతం….

ఒకదానినే ఎంచుకొమ్మంటే,

గంజికే నాఓటని,…

ఎలిగెత్తి అరిపించదా

 ఆతని కుక్షి?

కక్షలు, కార్పణ్యాలూ,

క్రోధాలూ,ద్వేషాలూ,

 మారణాయుధాలూ,

 మానవ కారణ వుత్పాతాలూ,

అణుక్షిపణులూ, యుద్ధాలూ,

దారుణమారణకాండలు,

 మరోగ్రహయానాలూ,

అధ్భుత ఆవిష్కరణలూ

అవియివియని కాదు

అన్నింటికీ

మౌన ప్రేరణం కుక్షి..

“అస్తవ్యస్త యింటి నంబర్ల వ్యవస్త వల్ల అభివ్రుద్ధికి కలిగే అఘాతం ”

రచన:నూతక్కి రాఘవేంద్ర రావు. తేదీ: 18-11-2009

అభివ్రుద్ధి చెందిన దేశాలలో లా మ్యాపు లయితే తయారు చెయవచ్చేమో కాని,యింటి నంబర్ ఫీడ్ చేసి గూగుల్ సీర్చ్ చేసి అడిగారనుకోండి ,గూగుల్ కే కాదుకదా ఆ బ్రహ్మ్మ దేవుడికి కూడా సాధ్యం కాదు. జంటనగరాలలోనే కాదు చుట్టూరా వున్న మహానగరంలో విలీనమైన పురపాలక సంఘాలలో కూడా సరైన యిళ్ళ నంబర్ల విధానం లేదు. క్రొత్తగావచ్చి ఏదైనా ప్రాంతంలో తమకు కావలిసిన యిల్లు తెలుసుకోవాలంటే (పూర్తి అడ్డ్రెస్స్ వున్నా కూడా) ఎంత కష్టమో, ఎందరి అడగాలో ? కాలనీల పేర్లు వుండవు.కాలనీలకు సూచకలుండవు. కాలనీలలో రోద్లలో యింటి నంబర్ల సూచికలుండవు. పురపాలక సంఘాలు కూడా నంబర్లు ఒక వరుసలో యివ్వరు. ఆధునిక సాంకేతిక సౌకర్యాలూ యాజమాన్య విధానాలూ వున్నా కూడా ప్రజానుకూల విధానాలు రచించి అమలుపరచడానికి అధికారులు సంసిద్ధంగాలేరు. ముందు వారి శిరఃప్రక్షాళన జరగాలి. తరువాత ప్రభుత్వాల ప్రక్షాళన గూర్చి ఆలోచించ వచ్చు. యీ యింటి నంబర్ల వ్యవస్త అస్తవ్యస్తంగా వుండటంతో వోటరు లిస్టులు కూడా అస్తవ్యస్తంగా మారి ఓటరు ఎన్నికలలో తమ ఓటు సద్వినియోగ పరచుకోలేక 30% to 50% ఓట్లు మాత్రమే పోలై మైనారిటీ అభిప్రాయంతోనే అభ్యర్ధులు ఎన్నిక కాబడుతున్నారు. యీ యింటి నంబర్ల విధానం ఆధు నీకరణ ,సరళీకరణ జరగకపోయినట్లయిన పైన చెప్పిన ప్రజలకు కలిగే అసౌకర్యాలెకాక ,ప్రభుత్వ ప్రజోపకార్యక్రమాలు ,ప్రజలకు చేరేందు కు అడ్డ్రెస్సులు లేక ఆయా కార్యక్రమాల అడ్డ్రెస్సే గల్లంతయ్యే ప్రమాదాలున్నాయి. కాబట్టి యిప్పటికైనా ప్రజల కొరకు,ఎన్నికైన ప్రభుత్వాలు, ప్రజా ప్రయోజనార్ధం ప్రజల డబ్బుతో నియమింపబడిన అధికారులు , వారి వునికి…వారి అధికారం ప్రజలకు వున్నత ప్రమాణాల్లో ప్రయోజనాలు అందించేందుకనీ ,వారికీ గౌరవ మర్యాదలు యివ్వవలసిన అవసరం వుందనీ గుర్తించి తదనుగుణంగా వ్యవహరించాలి.

పీడితులు

 రచన:నూతక్కి రాఘవేంద్ర రావు.

సమాజపీడితులై

 పట్టపగలే ఆ జీవితాలు

 నిభిడాంధకార కూపంలో

నిర్విరామ వేదనలు

ఆక్రందనారోదనలు

 వంచితులై …… కొందరు

 క్షుధ్భాధతో కొందరు, .

దౌష్ట్యంతో కొందరు

 దారి తప్పి మరికొందరు

 దారులు మళ్ళింప బడి

 యిం కొందరు

సమాజ త్రాష్ట జనుల

 మ్రుగానంద బంధనలో

 క్రుళ్ళి పోయి క్రుంగి పోయి

 తమ తనువులు తమవి కావు

 తమ మనసులు తమకు లేవు

తమ బ్రతుకులు తమ జీవన

తమ భావన లేవీ తమ చెంత లేవు

 తద్ర్రుధిరవర్ణ కిరణావ్రుత స్థలిలో

 కళ్ళల్లో వత్తులతో నింగి లోకి

 నిర్భాగ్యుల నిరీక్షణలు

కరుణారుణ కాంతి పుంజమై

తమ రక్షకు డెవరో వస్తాడని..

 ఆశగా ఎదురుతెన్నులు

సమాజ ధ్రుఃక్కులలో..

 నీచులు నిక్రుష్టులు

ఆ జీవితాలు ఆ తనువులు

 విఫణినందు అంగడిబొమ్మలు

 విక్రుత మానవ చేష్ఠకు

 ప్రతిబింబాలు

యీవూరు,యీ నగరం,

యీ దేశం, యిక్కడ అక్కడ

 ఒక చోటా ! ధరిత్రి నందు

 ప్రతి కొనలో 

విచలితలై ఆ తరుణులు

నేర్చుకో

రచన:నూతక్కి రాఘవేంద్ర రావు

తేదీ:
16-11-2009

 

చిలుకనో వుడతనో

చూసి నేర్చుకో

కాయ

పండుగా మారేదెప్పుడో

తినగలిగే దెప్పుడో

కాకిని చూసి తెలుసుకో

కష్ట కాలాన

కలిసుండేదెటులనో

దొరికిందేదో అందరూ కలిసి

పంచుకు తినే దెట్టులో

శునకాన్ని చూసి తెలుసుకో

విశాల విశ్వంలో

విశ్వాసమన్నయేమిటో

కాట్లాడుతు చింపుకున్న

జీవితమదెట్టులో

సింహాన్ని చూసి నేర్చుకో

స్థిరచిత్తత గంభీరత

కుక్షికి వలసినంత కన్న

సంపాదన, తప్పనీ అవసరాన్ని

అధిగమించి ఆరాటపడుతు బ్రతకొద్దని

పికిలిపిట్టనో,పిచ్చుకనో,గువ్వనో,

చదపురుగునో, చూసి నేర్చుకో

భవననిర్మాణ చాతుర్యాన్ని

సామరస్య సాంఘిక క్రమశిక్షణ

సమ, శ్రమ జీవన సౌందర్యాన్ని

కానీ బాబూ !

యేమరిపడి యేమాత్రం

నేర్చుకోకు తోటి మనిషినుండి

మతమౌఢ్యపుదౌష్ట్యాలను

అత్యాశల ద్వేషాలను

ఈర్ష్యాధిపత్య, క్రోధాలను

 

 

కాన్వాసు
 
(నను వెక్కిరిస్తూ.)
రచన : నూతక్కి రాఘవేంద్ర రావు   తేదీ :12-11-2009

ఓ  సంవత్సరకాలం చిత్ర కు దూరంగా వుండి

 

కవితతో కాలం గడిపి యిన్నినాళ్ళకు

చిత్ర ఒడిన ఒకింత సేద

తీరాలనిఆశగావెనుదిరిగి  

వెళ్ళానా

 

 

యింతకాలం

తమవంకకన్నెత్తెనా

చూడలేదని

 కుంచెలు

 
ఖ్రుద్దులై చూస్తున్నాయ్
 

కాన్వాసు కోపంతో
 
చుట్ట చుట్టుకొని
 
దూరంగా పరిగిడుతోంది
తనపై నున్న వివిధ వర్ణాలను

తనకు తానే తనువుపై ఒలుపుకొని

మనోహర వర్ణ సమ్మిళితమై
 
సుందర చిత్రమై
 
నీ అవసరమిక యేముందని
నను వెక్కిరిస్తూ

గాలిగుర్రమెక్కి ఎగిరిపోయింది.

 

 

 

 

 

 

 

 

 

 

తర్వాత పేజీ »