వుత్తరాంధ్రలో..నా..భుక్తి వేట

 ( వెంపర్లాట… స్మ్రుతుల సవ్వడులు)

రచన: నూతక్కి తేదీ :04-11-2009

నాగ్నాపకాలు

 సుడులు గా తిరిగి

సుడి గాలులై

నాగావళీ నదీతీరాన చేర్చి

 భూతం లో నువు

నెరపిన చెలిమిని

 నెమరు వేసుకో మంటూ

 నను ఒంటరిగా 

వదలి వెడలి పోతే…..

 సాలూరు ,విజయనగరం

బొబ్బిలి, పార్వతీపురం,

పాలకొండ

ఆముదాల వలస,

ఒరిస్సా లో రాయగడ లో

నాగావళి వడిలో

వుద్రుత జలపాత హోరులో

తారాడిన గ్నాపకాల తుంపరలు

 మజ్జి గౌరి సన్నిధిలో 

గెడ్డ పైన

 (గెడ్డ=వాగు/సెలయేరు )

 వందడుగుల యెత్తున

 రైలువంతెన పై

 పట్టాల మీదుగా

 నడయాడిన గ్నాపకాలు..

ఘన వనావ్రుత

వర్ణమయ పర్వాతాల

అత్యధ్భుత సుందర

మేఘావ్రుత శిఖరాగ్రాలూ

 లోయలూ గ్రామ జీవన

సౌందర్యాలూ

ప్రక్రుతి స్రుష్ఠిత విక్రుతాలపై

సంగ్రామాలూ నా కాన్వాస్ పై

 చిత్రించిన గ్నాపకాల సుడులు

 నాగావళీ వంశధారల నడుమ,

జీవన గమ్యాని కై దారులు

వెదుకులాడిన రోజులు

ఆ నదీగర్భాల్లో యీదులాడి

జలకాలాడిన గ్నాపకాల వూసులు

 పార్వతీ పురం నుంచి సిక్కొల్లు

దారిలో తోటపల్లి డ్యాం పై

 వందల మారులు తిరుగాడిన 

 ఆ తలపులు నామది తలుపులు

 ప్రతినిత్యం తడుతూ

ఆప్యాయంగా నను పలకరిస్తూ

 యీనాటికీ వాటన్నిటి

 మనమున భద్ర పరచుకొని

కుక్షి పట్టుకొని

మరో గుప్పెడు

మెతుకుల కొరకు

 సుదూరంగా భాగ్యనగరికి

 ఆయ్ ! ఎల్పోయొచ్చీసినాను

 తప్పు సేసేసినానేటి ?

(నే ను వ్రాసిన గడ్డ అన్న పదాన్ని గెడ్డ గా సరిచేసిన శ్రీ దొప్పలపూడి రవికుమార్ గారి సూచనకు  నా ధన్య వాదాలు.)
ప్రకటనలు