ముదావహం
(సోలారు ఎనెర్జీ వైపు ప్రభుత్వముందడుగు)
రచన: నూతక్కి, తేదీ:09-11-2009
ప్రభుత్వం విన్నదా నేనన్న,
“భవిష్యత్ రారాజు సోలార్ ఎనెర్జీ”
అన్నట్లు అటుగా తన ధ్రుఃక్కులు
సారిస్తూ ఆంధ్ర ప్రదేశ ప్రభుత.
యింతదనుక నిరాసక్త ,అలసత్వ,
విధానాల సుధీర్ఘ కాల విలంబనలు
అయినా,యిప్పటికైనా ఆ దిశగా
తప్పటడుగులైనా
పరిణామం ప్రశంసనీయం.
అభినందనీయులు
ముఖ్యామాత్యులు
శ్రీరోశయ్య వరేణ్యులు .
అడుగులేయడం
నేర్చుకుంటే నే కదా
నడకైనా, పరుగైనా.
సాంప్రదాయ విధానాలు
ఇంధన అలభ్యత.
ఒట్టిపోతూ జల వనరులు,
పరుషమైన పర్యావరణం
యిబ్బడి ముబ్బడి
యిబ్బందులు యేనాడూ
అంతరాయం లేకుండా
అందని నిరంతరమన్న విద్యుత్తు
ఇంధనానికై విదేశీ గుమ్మాలెక్కి….
సార్వభౌమత్వాన్నిఫణంగా పెట్టిమరీ……
ఇంకానా !!! ఏమాత్రం అక్ఖరలేదిక
విద్యుదుత్పాదనలో ! ! !
ఇంధనం అపార సూర్య రశ్మి
వుచితం …సంకల్పం సమయోచితం..
ముదావహం
నవంబర్ 9, 2009 at 6:19 సా.
సోలార్ ఎనెర్జీ – ప్రసుతానికి పెట్టుబడి అధికం..
నవంబర్ 9, 2009 at 9:07 సా.
మంచు పల్లకి వారికి,
మీరు నా బ్లాగ్ వీక్షించి అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదాలు.మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తాను. కానీ మొదట్లొ సెల్ ఫోన్ Rs.35000-00 వుండెది. యిప్పుడొ అదే ఫెసిలిటీస్ వున్న సెల్ రు.1500-00 లు .
సంకల్పం వుండాలే కాని …పెద్ద పెద్ద ప్రాజెక్టుల పై వేల కోట్లు ఖర్చుపెట్టినా ఫలితాలేముంటున్నాయి.నీరు లేదు, బొగ్గు లేదు,అణుఇంధనం అందుబాట్లో లేదు. ఎవరిపైనో ఆధార పడే దానికన్న ముందు గ్రుహావసారాలకు, రైతులకూ ఎవరింటికివారికి , ఎవరి పొలంలో వారికి ఓ అయిదు కిలోవాట్ల సెట్ అమర్చి యిచ్చి, కిస్తుల్లో వసూలు చేసుకుంటే ప్రస్తుతమున్న డొమెస్టిక్ లోడ్ తగ్గి,ఆ పవర్ యితర ప్రయోజనాలకు వినియోగించవచ్చు కదా.యీ విధానంలో ప్రజలు వాడుకోగా మిగిలిన పవర్ యేమన్నా వుంటే గ్రిడ్ కు తీసుకో వచ్చు.
కెనడా లో లా వికేంద్రీకరణ చేస్తే ప్రతీ గ్రుహస్తూ విద్యుదుత్పాదకుడవుతాడు.ట్రాన్స్మిషన్ ఖర్చులు తగ్గుతాయి. పెద్ద పెద్ద ప్రోజెక్ట్ లకు మీరన్నట్లు బడ్జెట్ఎక్కువవుతుందేమొ కాని చిన్న చిన్న యూనిట్లు ప్రతి యింటికీ పెడితే ఖర్చులు తిరిగి రాబట్టుకోవచ్చు. కాకుంటే ఆ వుత్పాదక యూనిట్లు తయారు చేయడానికి సాంకేతిక పరిగ్నానం సమకూర్చుకోవాలి. దెశీయంగా వుత్పత్తి చేయాలి.యిది ఆసాధ్యమైన విషయమేమీ కాదు..
యీ పందుగ సీజన్లో మీకు సకల శుభాలూ చేకూరాలని అభిలషిస్తూ నా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను……శ్రేయోభిలాషి..నూతక్కి
నవంబర్ 9, 2009 at 9:28 సా.
పెద్దలకు నమస్కారం.. మంచుపల్లకీ అని పిలవండి చాలు.. గారు వారు వద్దు.. నేను మీకన్న చాలా చిన్నవాడిని..
ఇక పొతే ఈ విషయం మీద గతం లొ చిన్న చర్చ జరిగింది..
http://sahacharudu.blogspot.com/2009/10/blog-post_05.html
మీరిచ్చిన సెల్ ఉదాహరణలా సొలార్ కూడా అందుబాటులొకి వస్తుంది.. మీరు చెప్పినట్టు కెనడా , జర్మని, ఫ్రాన్స్ మంచి ఉదాహరణలు.. జర్మని లొ గ్రిడ్ కి వినియొగదారుడు సప్ప్లయ్ చేసిన యునిట్ కి , ప్రబుత్వం (బొర్డ్) సప్ల్లయ్ యునిట్ కి రెట్టింపు ధర చెల్లిస్తుంది.. మన దేశం లొ వడ్డి రేట్ ఎక్కువ కాబట్టి , ఆ పెట్టుబడికి కి మనకి వచ్చే వడ్డి మరియు సొలార్ ఎనర్జి వల్ల వచ్చే రిటర్న్స్ పొల్చి చుస్తే సొలార్ పెట్టుబడి అంత అశాజనకం గా లేదు.. గ్రిడ్ మనకి కాస్త అకర్షణీయమయిన ధర నిర్ణయిస్తే సమీకరణాలు మారుతాయి..
విద్యుత్ వికేంద్రీకరణ గురించి వివరించారంటే మీకు ఈ సబ్జెక్ట్ లొ అవగాహన వుందని అర్దం అవుతుంది.
Xantrex (solar power) company in Canada is part of our company.
నవంబర్ 9, 2009 at 9:30 సా.
మీకు మరియూ మీ కుటుంబానికి సకల శుభాలూ చేకూరాలని కోరుకుంటూ -మంచుపల్లకీ
నవంబర్ 10, 2009 at 6:53 సా.
Tankyou very much మంచుపల్లకీ.
నవంబర్ 10, 2009 at 6:53 ఉద.
నూతక్కి గారు, బాగా చెప్పారు. ఇప్పటికైనా మన ప్రభుత్వం కళ్ళు తెరిచినందుకు సంతోషం. కేంద్ర ప్రభుత్వానికున్న శ్రధ్ధ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకీ ఉంటే ఎంతో కొంత సాధించవచ్చు. ఇక్కడ బెంగుళూరులో చాలామంది వేడినీటికోసం సోలార్ హీటర్లు ఏర్పాటు చేస్తున్నారు.
మనదేశం భవిష్యత్తులోనైనా సౌరశక్తి మీదే ఆధారపడాలి.
మంచుపల్లకి గారు, మీరు సోలార్ పరిశ్రమలో పనిచేస్తుంటే మరిన్ని టపాలు వ్రాయవచ్చుకదా!
నవంబర్ 10, 2009 at 7:37 సా.
Dear bonagiri,thank you for participation in this discussion.with cardial wishes…Nutakki
నవంబర్ 10, 2009 at 2:28 సా.
ఇల్లు కట్టుకోవడానికి లక్షలు, కోట్లు ఖర్చు చేస్తారు. కొంత బడ్జెట్ కంటె ఎక్కువ ఖర్చుతొ ఇల్లు కట్టెవారికి సోలారు యూనిట్ పెట్టుకొనేవిధంగా నిబంధన పెట్టితె బాగుంటుంది. ఈ విధంగా మొదలుపెడితె బాగుంటుంది. టెక్నాలజి సమస్య కాదు. రాజకీయ సంకల్పం మాత్రమె సమస్యగా ఉన్నది.
నవంబర్ 10, 2009 at 6:25 సా.
మాష్టారూ, చర్చలో పాలు పంచుకుంటున్నందుకు మీకు హార్దిక స్వాగతం.
యీ మధ్య కాలంలో గ్రుహావసరాల్లో విద్యుత్ వినియోగం ,లోగడకన్న ఎన్నెన్నో రెట్లు పెరిగింది. విద్యుదుత్పత్తి పెరగలేదు.దానితో పవర్ కట్స్.ట్రాన్స్మిషన్ కొలాప్స్. యీ పరిస్తితులను అధిగమించాలంటే,……ప్రత్యామ్న్యాయాలవైపు ద్రుష్టి పెట్టాలి. దానికి……మీరన్నట్లు సంకల్పం వుండాలి. వాస్తవం. ఎవరికీ? ప్రభుత్వాలకు.మీరన్నట్లు, ప్రతి యిల్లు కట్టుకొనేవాడూ సోలార్ యూనిట్ పెట్టుకోవాలంటే ….ముందు ప్రభుత్వం వాటి లభ్యతను కలిగించాలి కదా.యిప్పటివరకు ఆ దిశగా జరిగిందేమీ లేదుకదా. యీ రోజున ముఖ్యమంత్రి రోశయ్య గారికి సంకల్పం ఎలా కలిగిందో కాని కలిగింది.
త్రికరణ శుద్ధిగా ఆచరించాలంటే అనేక మార్గాలుంటాయి,కాదనను.
ఆయా విద్యుత్ అవసరాలను బట్టి సోలార్ విద్యుత్ కిట్స్ ,అనేక పవర్ రేంజ్ లలో
(01 k.w to 20kw) యేర్పాటు చేయాలి.ప్రస్తుతానికి.. ,గ్రుహ, వ్యవసాయ, వాణిజ్య వర్గాలు వారి వారి విద్యుత్తును వారే వుత్పత్తి చేసుకొనేలా, వినియోగించుకొనేలా,ఆయా కిట్లను మొదట్లో దిగుమతి చేసుకొని, కొన్నిప్రాంతాల ప్రజలకు అందించి,యీలోపు ఆయా ప్యానెళ్ళూ,యితర పరికరాలూ,మనమే వుత్పత్తి చేసుకొనేలా ప్రణాళిక రచించుకొని,వుత్పత్తి ప్రారంభించి, గ్రుహ వ్యవసాయావసరాలకు, చిన్న చిన్న వాణిజ్యావసరాలకూ, కిట్స్ అందించ గలిగితే, రాబోయే కొన్ని దశాబ్దాలు మనకు విద్యుత్ కొరత వుండదు.
నవంబర్ 10, 2009 at 6:49 సా.
Thank you Mr. Samatalam for your participation.and welcome to my blog. You are true .
Things has to be started from some where from some point and from some point of time..welwisher ..Nutakki
నవంబర్ 10, 2009 at 4:00 సా.
సమతలం గారు చెప్పింది నాకు నచ్చింది.. కొంత బడ్జెట్ కంటె ఎక్కువ ఖర్చుతొ ఇల్లు కట్టెవారికి సోలారు యూనిట్ పెట్టుకొనేవిధంగా నిబంధన పెట్టితె బాగుంటుంది. ఎక్కువమంది వాడే కొద్ది ఖరీదు తక్కువవుతుంది. అలాగే మొదటగా సామాన్య ప్రజలమీద భారం వెయ్యకుండా హొటల్స్ , గవర్న్మెంట్ అఫీసులు, సాఫ్ట్ వేర్ అఫీస్ లాంటి వాటికి ఉపయొగిస్తే బావుంటుంది..
బొనగిరి గారు నేను సోలార్ పరిశ్రమలో పరిశ్రమ లొ పనిచెయ్యడం లేదు.. అలాంటిదే ఇంకోటి.. అందువల్ల renewable energy sources కొంత అవగాహన వుంది..
నవంబర్ 10, 2009 at 6:19 సా.
కవిత ఆలోచింపచేస్తుంది అనటానికి చక్కని ఉదాహరణగా నిలిచింది మీ కవిత.
ఆశక్తికరమైన, నేటి పరిస్థితులకు అవసరమైన చర్చ.
బొల్లోజు బాబా
నవంబర్ 10, 2009 at 6:41 సా.
స్వాగతంబాబా గారూ,
ధాంక్యూ, ధన్యుణ్ణి.
భావావేశం
రసనిర్దేశం
కావాలోయ్
నవకవనానికి
అని మహాకవి శ్రీ శ్రీ మహాశయులు నుడివినట్లు ,దానికి రమ్యత చేకూరాలంటే, మీ బోంట్ల ప్రోత్సాహం కూడా కావాలి. అది మీ వ్యాఖ్యనుంచి నాకు లభిస్తోంది.ధన్యవాదాలు. …Nutakki Raghavendra Rao
నవంబర్ 10, 2009 at 6:57 సా.
స్వాగతంబాబా గారూ, ధాంక్యూ, ధన్యుణ్ణి.
భావావేశం
రసనిర్దేశం
కావాలోయ్
నవకవనానికి
అని మహాకవి శ్రీ శ్రీ మహాశయులు నుడివినట్లు ,దానికి రమ్యత చేకూరాలంటే, మీ బోంట్ల ప్రోత్సాహం కూడా కావాలి. అది మీ వ్యాఖ్యనుంచి నాకు లభిస్తోంది.ధన్యవాదాలు.