నేర్చుకో

రచన:నూతక్కి రాఘవేంద్ర రావు

తేదీ:
16-11-2009

 

చిలుకనో వుడతనో

చూసి నేర్చుకో

కాయ

పండుగా మారేదెప్పుడో

తినగలిగే దెప్పుడో

కాకిని చూసి తెలుసుకో

కష్ట కాలాన

కలిసుండేదెటులనో

దొరికిందేదో అందరూ కలిసి

పంచుకు తినే దెట్టులో

శునకాన్ని చూసి తెలుసుకో

విశాల విశ్వంలో

విశ్వాసమన్నయేమిటో

కాట్లాడుతు చింపుకున్న

జీవితమదెట్టులో

సింహాన్ని చూసి నేర్చుకో

స్థిరచిత్తత గంభీరత

కుక్షికి వలసినంత కన్న

సంపాదన, తప్పనీ అవసరాన్ని

అధిగమించి ఆరాటపడుతు బ్రతకొద్దని

పికిలిపిట్టనో,పిచ్చుకనో,గువ్వనో,

చదపురుగునో, చూసి నేర్చుకో

భవననిర్మాణ చాతుర్యాన్ని

సామరస్య సాంఘిక క్రమశిక్షణ

సమ, శ్రమ జీవన సౌందర్యాన్ని

కానీ బాబూ !

యేమరిపడి యేమాత్రం

నేర్చుకోకు తోటి మనిషినుండి

మతమౌఢ్యపుదౌష్ట్యాలను

అత్యాశల ద్వేషాలను

ఈర్ష్యాధిపత్య, క్రోధాలను