పీడితులు

 రచన:నూతక్కి రాఘవేంద్ర రావు.

సమాజపీడితులై

 పట్టపగలే ఆ జీవితాలు

 నిభిడాంధకార కూపంలో

నిర్విరామ వేదనలు

ఆక్రందనారోదనలు

 వంచితులై …… కొందరు

 క్షుధ్భాధతో కొందరు, .

దౌష్ట్యంతో కొందరు

 దారి తప్పి మరికొందరు

 దారులు మళ్ళింప బడి

 యిం కొందరు

సమాజ త్రాష్ట జనుల

 మ్రుగానంద బంధనలో

 క్రుళ్ళి పోయి క్రుంగి పోయి

 తమ తనువులు తమవి కావు

 తమ మనసులు తమకు లేవు

తమ బ్రతుకులు తమ జీవన

తమ భావన లేవీ తమ చెంత లేవు

 తద్ర్రుధిరవర్ణ కిరణావ్రుత స్థలిలో

 కళ్ళల్లో వత్తులతో నింగి లోకి

 నిర్భాగ్యుల నిరీక్షణలు

కరుణారుణ కాంతి పుంజమై

తమ రక్షకు డెవరో వస్తాడని..

 ఆశగా ఎదురుతెన్నులు

సమాజ ధ్రుఃక్కులలో..

 నీచులు నిక్రుష్టులు

ఆ జీవితాలు ఆ తనువులు

 విఫణినందు అంగడిబొమ్మలు

 విక్రుత మానవ చేష్ఠకు

 ప్రతిబింబాలు

యీవూరు,యీ నగరం,

యీ దేశం, యిక్కడ అక్కడ

 ఒక చోటా ! ధరిత్రి నందు

 ప్రతి కొనలో 

విచలితలై ఆ తరుణులు