మౌనప్రేరణం

రచన

:నూతక్కి

తేది: 20-11-2009

ఆకలి రుచి యెరుగదు

 నిద్ర సుఖం యెరుగదు

 అది నానుడి

 పుట్టెడాకలితో వున్నవాడిని …

వుప్పులేని గంజి,

 తాన్సెన్ సంగీతం….

ఒకదానినే ఎంచుకొమ్మంటే,

గంజికే నాఓటని,…

ఎలిగెత్తి అరిపించదా

 ఆతని కుక్షి?

కక్షలు, కార్పణ్యాలూ,

క్రోధాలూ,ద్వేషాలూ,

 మారణాయుధాలూ,

 మానవ కారణ వుత్పాతాలూ,

అణుక్షిపణులూ, యుద్ధాలూ,

దారుణమారణకాండలు,

 మరోగ్రహయానాలూ,

అధ్భుత ఆవిష్కరణలూ

అవియివియని కాదు

అన్నింటికీ

మౌన ప్రేరణం కుక్షి..