పగుళ్ళు బారిన ప్రజాస్వామ్యం!!!

 (ఓటరు ఫోటో గుర్తింపు కార్డులు అంతా ఓ త్రాష్ !)

రచన: నూతక్కి. తేదీ:25-11-2009

 మొన్న జరిగిన హైద్రాబాద్ మహానగరపాలిక ఎన్నికల్లో ఓటరుగుర్తింపు కార్డులు అభాసు పాలయ్యాయి. ఓట్లు ఎందుకు తక్కువ పోలయ్యాయి? ఓటరు నిరాసక్త కారణమా? కానే కాదు.యింకా అనేక యితర కారణాలు వున్నాముఖ్య కారణాలు మాత్రం…, ప్రభుత్వ విధాన వైఫల్యం.ఎన్నికల కమీషన్ ,చేతకాని తనం. కాళ్ళరిగేలా తిరిగి ఓటరు గుర్తింపు కార్డు సంపాయించి ఓ పెద్ద నిట్టూర్పు విడచి నాకింకేమ్ పర్లేదని బే ఫికరుగా వుండి, ఎన్నిక రోజున ఓట్లేద్దామని పోలింగు బూతుకు పోతే, మా లిస్టులో ఓటు లేదని పోలింగు ఆఫీసరు చెబితే, ఖిన్నుడై వెనుతిరిగిన ఓటరు, దానికి భాద్యులెవరు? ఒక సారి ఓటరు గుర్తింపు కార్డు యిచ్చిన తరువాత,లిస్ట్ లో పేరులేదనో, యీ బూతు కాదనో, ఓటు లేదనే హక్కు ప్రభుత్వానికి కానీ ,ఎన్నికల కమీషన్ కు కానీ వుండరాదు. సాంకేతికఒరవడిలో సాగుతున్న ఎన్నికల పర్వంలో వోటరు ఎక్కడినుండైనాఓటు చేసే అవకాశంవుండాలి. కార్డున్నా ఓటు లేకుండా పోయి కనీసం కార్డు మీద పొందుపరిచిన బూతులో కూడా ఓటేసేహక్కు కోల్పోతే, తాము ప్రవేశపెట్టిన విధానాలకు తామే తిలోదకాలిస్తే, యింకా యీ ఎన్నికల కమీషన్లెందుకు? ఆ రోజున యేమి జరిగిందంటే ఓటరు కార్డు తీసుకొని వుదయాన్నే ఆ కార్డులో రాసి వున్న పోలింగు బూతుకు వెళ్ళిన అనేకమందికి అక్కడ వోటు లేదని తెలిసి మరో బూతు, మరో బూతు, అలా తిరుగుతూ ఓటు హక్కును అడుక్కుంటూ మధ్యాహ్నం వరకూ తిరిగి తిరిగి విసిగి వేసారిన వోటరు నిరాశతో వెనుతిరుగుతున్న ద్రుశ్యాలు చూస్తే ప్రజాస్వామ్యం పగుళ్ళు బారుతున్న ద్రుశ్యం కళ్ళముందు కదిలింది.