నవంబర్ 2009


సమాజపు ఓ చీకటి కోణం

రచన: నూతక్కి

 తెదీ: 12-10-2009

వెదుకుతూనే వున్నా

అనునిత్యం వెంపర్లాడుతూ

అంధకారభూయిష్ట సమాజపు

 చీకటి కోణాలను

 మానవతా వీక్షణా కాంతులలో

 ఓ కోణంలో గాంచిన ద్రుశ్యం…

పుట్టెడు పిల్లల కడుపులకై

 పిడికెడు మెతుకులైన

పెడదామని కడుపు కోత భరిస్తూ..

.సోకిస్తూ తన కన్నపిల్లనమ్మేందుకు

 సిద్ధపడిందా బిచ్చగత్తె

పుట్టెడు ధుఃఖంతో……

తప్పుచేసిందని జెయిలుపాలు

 అనాధలైన బిడ్డలు.. .

అయోమయంలో అడుక్కు తింటూ..

తిట్లూ చీత్కారాలూ,

 తన్నులూ తాపులూ కూడా తింటూ….

నాధులమేమున్నామని

వచ్చిన నేరస్తుల చేతుల్లో

 నేరగాళ్ళుగా మారుతున్నబిడ్డలు……

 

 ( ప్రభుత్వాలు కొన్నినైతిక సూత్రాలకు

కట్టుబడి నేరస్తులని భావించి ఎవరినైనా,

 అరెస్ట్ చేసినప్పుడు,ఆ నేరం వెనుక ఆర్ధిక

 కోణాలు అన్వేషించాలి.

వారి కుటుంబ సభ్యులు రోడ్డున పడకుండా

వారి యోగ క్షేమాల భాద్యత ప్రభుత్వమే

తీసుకొని మంచి పౌరులుగా తీర్చిదిద్ది

బ్రతుకు మార్గం నిర్దేసించే కార్యక్రమం

 చేపట్టాలి లేకుంటే క్రొత్త నేరస్తులను

 తయారుచేసే చీకటి మూకలు వారిని

ఆకట్టుకొనేందుకు ఎల్ల వేళలా కాచుకునుంటాయ్

రక్కసి మూకల రాజ్యంలో:….రచయిత)

ముదావహం

(సోలారు ఎనెర్జీ వైపు ప్రభుత్వముందడుగు)

రచన: నూతక్కి, తేదీ:09-11-2009

 ప్రభుత్వం విన్నదా నేనన్న,

 “భవిష్యత్ రారాజు సోలార్ ఎనెర్జీ”

అన్నట్లు అటుగా తన ధ్రుఃక్కులు

సారిస్తూ ఆంధ్ర ప్రదేశ ప్రభుత.

యింతదనుక నిరాసక్త ,అలసత్వ,

విధానాల సుధీర్ఘ కాల విలంబనలు

అయినా,యిప్పటికైనా ఆ దిశగా

 తప్పటడుగులైనా

పరిణామం ప్రశంసనీయం.

అభినందనీయులు

ముఖ్యామాత్యులు

 శ్రీరోశయ్య వరేణ్యులు .

 అడుగులేయడం

నేర్చుకుంటే నే కదా

 నడకైనా, పరుగైనా.

సాంప్రదాయ విధానాలు

 ఇంధన అలభ్యత.

ఒట్టిపోతూ జల వనరులు,

 పరుషమైన పర్యావరణం

యిబ్బడి ముబ్బడి

 యిబ్బందులు యేనాడూ

 అంతరాయం లేకుండా

అందని నిరంతరమన్న విద్యుత్తు

 ఇంధనానికై విదేశీ గుమ్మాలెక్కి….

సార్వభౌమత్వాన్నిఫణంగా పెట్టిమరీ……

 ఇంకానా !!! ఏమాత్రం అక్ఖరలేదిక

విద్యుదుత్పాదనలో ! ! !

ఇంధనం అపార సూర్య రశ్మి

వుచితం …సంకల్పం సమయోచితం..

 ముదావహం

వుత్తరాంధ్రలో..నా..భుక్తి వేట

 ( వెంపర్లాట… స్మ్రుతుల సవ్వడులు)

రచన: నూతక్కి తేదీ :04-11-2009

నాగ్నాపకాలు

 సుడులు గా తిరిగి

సుడి గాలులై

నాగావళీ నదీతీరాన చేర్చి

 భూతం లో నువు

నెరపిన చెలిమిని

 నెమరు వేసుకో మంటూ

 నను ఒంటరిగా 

వదలి వెడలి పోతే…..

 సాలూరు ,విజయనగరం

బొబ్బిలి, పార్వతీపురం,

పాలకొండ

ఆముదాల వలస,

ఒరిస్సా లో రాయగడ లో

నాగావళి వడిలో

వుద్రుత జలపాత హోరులో

తారాడిన గ్నాపకాల తుంపరలు

 మజ్జి గౌరి సన్నిధిలో 

గెడ్డ పైన

 (గెడ్డ=వాగు/సెలయేరు )

 వందడుగుల యెత్తున

 రైలువంతెన పై

 పట్టాల మీదుగా

 నడయాడిన గ్నాపకాలు..

ఘన వనావ్రుత

వర్ణమయ పర్వాతాల

అత్యధ్భుత సుందర

మేఘావ్రుత శిఖరాగ్రాలూ

 లోయలూ గ్రామ జీవన

సౌందర్యాలూ

ప్రక్రుతి స్రుష్ఠిత విక్రుతాలపై

సంగ్రామాలూ నా కాన్వాస్ పై

 చిత్రించిన గ్నాపకాల సుడులు

 నాగావళీ వంశధారల నడుమ,

జీవన గమ్యాని కై దారులు

వెదుకులాడిన రోజులు

ఆ నదీగర్భాల్లో యీదులాడి

జలకాలాడిన గ్నాపకాల వూసులు

 పార్వతీ పురం నుంచి సిక్కొల్లు

దారిలో తోటపల్లి డ్యాం పై

 వందల మారులు తిరుగాడిన 

 ఆ తలపులు నామది తలుపులు

 ప్రతినిత్యం తడుతూ

ఆప్యాయంగా నను పలకరిస్తూ

 యీనాటికీ వాటన్నిటి

 మనమున భద్ర పరచుకొని

కుక్షి పట్టుకొని

మరో గుప్పెడు

మెతుకుల కొరకు

 సుదూరంగా భాగ్యనగరికి

 ఆయ్ ! ఎల్పోయొచ్చీసినాను

 తప్పు సేసేసినానేటి ?

(నే ను వ్రాసిన గడ్డ అన్న పదాన్ని గెడ్డ గా సరిచేసిన శ్రీ దొప్పలపూడి రవికుమార్ గారి సూచనకు  నా ధన్య వాదాలు.)

శ్రీ కిరణ్ సాంస్క్రుతిక సమాఖ్య , వారి కార్యక్రమం.

రచన: నూతక్కి రాఘవేంద్ర రావు. తేది:02-10-2009

శ్రీ కిరణ్ సాంస్క్రుతిక సమాఖ్య (కల్యాణ్ నగర్,ఈస్ట్ ఆనంద్ భాగ్,మల్కాజ్ గిరి,) వ్యవస్తాపక అధ్యక్షుకులు శ్రీ లంకా వెంకట సుభ్రహ్మణ్యం గారి ఆహ్వానం పై ,తేదీ 02-11-2009 న డా.ఎయస్.రావ్ నగర్ లో సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్ అసొసియేషన్ సౌజన్యంతో డా.ఏ.ఎస్ రావు నగర్ లో( స్.సి.వె.ఎ) వారి వేదికపై , కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన….. “భారతీయసంస్క్రుతి మూల సూత్రాలు” అనే అంశంపై చారిత్రక నవలా చక్రవర్తి డా.ముదుగొండ శివప్రసాద్ గారి ప్రసంగం విందామని వెళ్ళడం జరిగింది. శ్రీ ముదిగొండ వారు, నిర్ణీత సమయానికే సభాస్తలికి విచ్చేశారు కాని ,సభకు అద్యక్షత వహించవలసిన దూరదర్శన్,ప్రోగ్రాం ఎక్సిక్యుటివ్ శ్రీ డా.ఓలేటి పార్వతీశం గారి ఆగమన విలంబనతో సభ కొంచెం లేటు గా ప్రారంభమైనా…..ఆద్యంతం అత్యధ్భుతంగా కొనసాగింది. ఓలేటి వారి ప్రసంగం సెలయేటి గలగలలా ,ఓ చిరు జల్లులా వుంటే,ముదిగొండవారి ప్రసంగం వుద్రుత జలపాతపు హోరులా,మహోద్రుత గంగా ప్రవాహంలా కొనసాగి ఆద్యంతమూ ప్రేక్షకులను కట్టి పడేసింది.ఆయన ప్రసంగం వినడం, విని ఆనందించడం మరచి పోలేని అనుభూతికి లోను చేసింది. ముది గొండవారు, అతి సామాన్యంగా,అతి సామాన్య దుస్తుల్లో నిరాడంబరంగా… చూపరులకు ఒ అతి సామాన్యునిలా కనిపించినా,ఆయనలో సమ్మోహన పరచే వాగ్ధాటి,అబ్బుర పరిచే విషయ పరిగ్నానం…….ప్రేక్షకులను ఎన్ని గంటలైనా కుర్చీలకు కట్టిపడేశాయి. ప్రపంచంలోనే మహోత్క్రుష్టమైన భారతీయ సంస్క్రుతి, దాని మూలాలు, మూల్యాలు, ఔన్నత్యాల, గూర్చిప్రసంగిస్తూ,ప్రస్తుత స్తితిగతులగురించి అనర్గళంగా సోదాహరణంగా వివరించారు. మారుతున్న సామాజిక స్తితి గతులలో చిద్రమౌతున్న భారతీయ సంస్క్రుతీ విలువలను,పరి రక్షించుకోవలసిన ఆవస్యకతను వివరించారు. వయోవ్రుద్ధులు, గ్నానసమ్రుధులనుండి సమాజం తెలుసుకోవల్సింది, నేర్చుకోవలసింది ఎంతో వుందని, వారి అపార అనుభవాన్ని,యువత గ్రహించి లబ్ధి పొంది ఆ సారాన్ని, భారతీయ సంస్క్రుతీ పరి రక్షణకై ,వికాసాని కై, వినియోగించి భావి తరాలకు యీ దిశగా మార్గదర్శకత్వం వహించాలని విన్నవించారు. సభా ప్రారంభం… కుమారి లలిత తన సుస్వర గాత్రం తో పాడిన లలిత గీతం తో ప్రారంభమై, శ్రీ నూతక్కి రాఘవేంద్ర రావు గారు (కవులు, మరియు బ్లాగ్ లోకంలో మునుముందుకు సాగిపోతున్న ,తెలుగు బ్లాగర్ http://www.nutakki.wordpress.com,నిర్వాహకులు) మరియు వుషారాణి గారు,డా.సునీత గారు,రామ మోహన రావు గారు, తమ కవితలతో సభను అలరించారు. శ్రీఅచ్యుతరామ రాజు గారు చదివి వినిపించిన ఆటవెలదులు, సామాజిక విలువలపై వెలువరించిన వ్యక్తీకరణ అధ్భుతం..అక్కి రాజు రమాపతి రావు గారు తమ అధ్భుత గాత్రం తొ పౌరాణిక పద్యాలతో సభను అలరించారు. సభకు క్రుతగ్నతలు సమర్పిస్తూ సభా నిర్వాహకులు శ్రీ లంకా సుభ్ర్హ్మణ్యం గారు,తమ సహధర్మచరిణి సంపూర్ణ సహకారం వల్ల తన సాహితీ వ్యాసంగం, సభా నిర్వహణ కార్యక్రమాలు నిర్వర్తించుకో గలుగు తున్నానని తెలిపారు., తన ప్రియ మిత్రులు, సన్నిహితులు , శ్రీ విజయకుమార్ గారి సంపూర్ణ సహకారం లభించడం వల్ల యీ సభను యీ రీతిన దిగ్విజయం చేసుకోగలిగానని క్రుతగ్నతలు తెలియబరచారు.శ్రీమతి లంకా సుబ్రఃమణ్యం గారి వందన సమర్పణతో సభ ముగిసింది.

« గత పేజీ