అయినా వీడ్కోలిస్తూ రెండు వేల తొమ్మిదికి
(స్వాగతిద్దాం రెండు వేల పదిని.)
రచన: నూతక్కి
తేది:31-12-2009
పయనిస్తూ కాలం స్వయం గమన వేగంలో
సంవత్సరాలనే మైళ్ళ రాళ్ళు దాటుకుంటూ
తన పయనంలో తాను సుడి గాలిలా సర్వాన్ని
తనలోకి యిముడ్చుకుంటూ 2009 వ
మైలు రాయినుంచి 2010 వ మైలు రాయి
మధ్యన పయనించినదాదిగా…. తెలుగులపై
నిరంతర వుల్కా పాతపు కఠిన శిలా విస్ఫోటనలా
యిముడ్చుకున్న వాటన్నిటినీ విసరివేస్తూ….
నిర్ధాక్షిణ్యంగా మోర చాచిన కరువు
అధినాయక నిధన కధనం
జలప్రళయ వికటాట్ట హాసం
సమైక్య,విభజనాందోళనల
విక్రుత నాట్య విన్యాసం
వేలాది కోట్ల సంపదల
విశ్రుంఖల విధ్వంస రచన
అసమర్ధ నాయకత్వ నిర్దేశకతన
రాష్ట్రం, దేశం,పాలనా వ్యవస్తలు
యేమని వీడ్కోలివ్వను 2009 కి
యేలాగున స్వాగతించగలనని
అనుకున్నా తప్పదుకద ఆహ్వానించక
2010 ని చేసేదేముందని
వీడ్కోలందించక 2009 కి
అందుకనే అందరం వీడ్కోలందిద్దాం
రెండు వేల తొమ్మిదికి.
ఆహ్లాదం ఆశిస్తూ స్వాగతిద్దాం
రెండు వేల పదిని.
ద్రుష్టి సారించని మరో ద్రుఃక్కోణం.
(ద్రుష్టి సారించని, కీలక ధ్రుఃక్కోణం… కేంద్ర పరిశ్రమలు,ల్యాబులూ,కార్యాలయాలూ)
నూతక్కి: 30-12-2009
ప్రపంచంలో ఎక్కడైనా జీవన ప్రమాణాలు వూర్ధ్వ గతిలో కొనసాగటంలో, విద్యుదుత్పత్తి, పారిశ్రామికీకరణ,
వ్యవసాయ వుత్పత్తులకు,జలవనరులు, అతిముఖ్య భూమిక పోషిస్తాయన్న విషయం యెవరూ కాదనలేనిది.ఈవిషయంపై అవగాహనలేకో ,మరి అత్యుత్సాహమో కాని, రాష్ట్రం మొత్తానికి చెందవలసిన కేంద్ర ప్రభుత్వ సంస్థలనూ, రాష్త్ర ప్రభుత్వ విభాగాలనూ ఒకే చోట రాజధాని హైద్రాబాద్ లోనే కేంద్రీకరించి ఆ ఒక్క నగరం మాత్రమే అభి వ్రుద్ధి చెందేలా, వారు ఆ రోజున చేసిన విధాన నిర్ణయానికి, యీ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్త్రంలో యీ వుద్రేకాలకూ కక్షలూ కార్పణ్యాలకూ , తమకు తెలియకనే పరోక్షంగా కారణమైన అప్పటి సీమాంధ్ర కు చెందిన ముఖ్యమంత్రుల నిస్వార్ధమైన ఆలోచనలు… యీ రోజున వికటిస్తూ మహోద్రేకాలకు, చీలికల దిశకూ కారణమౌతున్నాయి.
వారు నిస్వార్ధంగా, పాలనా సౌలభ్యం కొరకు, అన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలనూ హైద్రాబాద్ లోనే కేంద్రీకరించారు. ఇందువల్ల యితర ప్రాంతాలకు జరిగిన అన్యాయం యింతా అంతా కాదు.
అందు చేత వివిధ ప్రాంతాల ఆర్ధిక సామాజిక అసమానతల మూల కారణాలను యిప్పటికైనా వివిధ ప్రాంత రాజకీయ పార్టీల అధినాయకులు, విగ్నతతో గమనించి,అన్ని ప్రాంతాలకూ న్యాయమైన రీతిలో …..ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నయీ సమయంలో, సమన్వ్యంతోనూ సమ్యమనంతోనూ, సమయస్పూర్తితోనూ, వ్యవహరించ వలసిన అవసరం ఎంతైనావున్నది.
హైద్రాబాద్ నగరం చుట్టుప్రక్కల వున్న అయిదు జిల్లాల లో స్థాపించబడిన కేంద్ర ప్రభుత్వపారిశ్రామిక సంస్థలు,హైద్రాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ,మెహబూబ్ నగర్ , అయిదు జిల్లాలలో విస్తరించి వున్నాయి.ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో ఎప్పటినుండొ వున్న బొగ్గు గనులు,అనేక వేలమందికి వుపాధి కల్పిస్తున్నాయి. అవి కూడా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థలే. భారత దేశంలోనే అత్యధిక వుపాధికి అవకాశాలున్న ఏకైక ప్రాంతం. ఆంధ్ర ప్రదేశ్ లోని హైద్రాబాద్ తో కలిసి వున్న తెలంగాణా ప్రాంతం.
1)
బి.హెహ్.ఇ.ఎల్,2) బిడిఎల్,
3)
బి.ఇ.ఎల్
4)
అయ్.డి.పి.ఎల్,
5)
హెచ్. ఎం.టి.,
6)
హెచ్. ఎ.ఎల్,
7)
హెచ్.సి.ఎల్,
8)
ఇ.సి.అయ్.యెల్,
9)
ఎన్.ఎఫ్.సి
10)
ఎన్.ఎమ్.డి.సి
11)
డి.ఆర్.డి ఎల్
12)
డి.ఎల్.ఆర్.ఎల్
13)
ఎమ్.ఆర్.ఎల్
14)
అర్.అర్.ల్యాబ్స్
15)
ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్
16)
సెక్రెటేరియట్
17)
పోలీస్ అకాడెమీ,హెడ్ క్వార్టర్లు,
18)
అసెంబ్లీ,
19)
హైకోర్టులు
20)
టంకశాలలు,
21)
సివిలింజినీరింగ్ హెడ్ క్వార్టర్లు
22)
విద్యుత్ కేంద్ర కార్యాలయాలు
23)
ఆర్ టి సి కేమ్ద్ర కార్యాలయాలూ
24)
రైల్వే కేంద్ర కార్యాలయాలు.
25)
మిలటరీ కార్యాలయాలు
26 )
సెంట్రల్ యూనివర్సిటీ
27)
అయ్ అయ్ టి
30)
ఇంకా యెన్నెన్నో,వాటికి తోడు యాన్సిలరీ ఇండస్ట్రీస్. లక్షలాది వుద్యోగాలిచ్చే భవిష్య పారిశ్రామికాభివ్రుద్ధి ప్రణాలికలు.
31)
ఇవే కాక, సినిమా పరిశ్రమ, తరలి రావడానికి శతాబ్దాలు పట్టినా ,కొన్ని వేలమంది స్థానికులకు భుక్తినిస్తున్న సినీపరిశ్రమ గురించి ఎంతచెప్పినా తక్కువే.అవే కాక యింకా యెన్నెన్నో పరిశ్రమలు ప్రైవేటు భాగస్వామ్యంలో,సీమాంధ్ర ప్రాంతీయుల ఆధ్వర్యంలో అక్కడి స్థానికులకున్నూవుపాధి కల్పిస్తున్నవి..
యీ ప్రాంతంలో వున్నట్లు, పైన పేర్కొన్నసంస్తలు, కార్యాలయాలూ, సీమాంధ్రలోనూ ..ప్రతి జిల్లాకో కేంద్ర ప్రభుత్వ భారీ పరిశ్రమను స్థాపించి పారిశ్రామిక అభివ్రుద్ధి పెంపొందించి, సకల సౌకర్యాలతో మరో రెండు రాజధాని నగరాలు సమకూర్చిన తరువాత, జలవనరులు, సక్రమంగాపంచిన తరువాత మాత్రమే, మునుముందు మరో విభజన జరుగే అవసరం లేకుండా రాష్ట్రాన్నిమూడు భాగాలుగా విభజించడం యేనాటికైనాఅవసరం. అప్పటి వరకూ రాష్ట్రం అవిభాజ్యంగా వుండటం చాల అవసరం.
హైద్రాబాద్ మాది అని సీమాంధ్ర ప్రజలుభావించడంలో వున్న న్యాయాన్ని,అందుకై తెలంగాణీయుల అబ్యంతరానికి వున్న న్యాయమైన కోణాన్నీ, విపులమైన చర్చలద్వారా ,అంగీకారయోగ్యమైన రీతిలోపరిష్కారం రావాలేకాని, వినాశకర రీతిన సాగే వుద్యమాల ద్వారా సాధ్యం కాదని , విధ్యార్ధులూ,అన్ని రాజకీయ పార్టీలూ,వివిధ ప్రాంతాల ప్రజలూ,విగ్నులూ,మేధావులూ,న్యాయ వాదులూ.వుపాధ్యాయులూ,శాస్త్రగ్నులూ గుర్తించాలి.
పైన పేర్కొన్న కేంద్ర ప్రభుత్వ పరిశ్రమలూ, కార్యాలయాలూ, మిగతా ప్రాంత జిల్లాలలో ఎర్పరచి వున్నట్లయితే, తెలంగాణ సెపరేట్ చేసి హైద్రాబాద్ తో సహా మాకే యివ్వాలి అని తెలంగాణవాదులూ
, సమైక్యాంధ్ర అని మిగతా వారూ, యింత భయంకరమైన రీతిలో వుద్యమాలు చేయవలసిన అవసరం వుండేది కాదు.
హైద్రాబాదు లేకుండాసీమాంధ్రను వూహించడం ,కష్టమే .కనుకనే,
ముఖ్యంగా యిక్కడ స్థాపించబడిన కేంద్ర ప్రభుత్వ సంస్థలూ,కార్యాలయాలు.లేని రాష్ట్రం, సీమాంధ్ర వారు కోరుకోవడంలేదు.అందుకే వారి సమైఖ్యాంద్ర ప్రదేశ్ slogan.
రజాకారుల దౌష్ట్యాలతో మానసికంగా క్రుంగివున్న అప్పటి తెలంగాణీయులకు, అందరూ తమను మోసం చేస్తున్న భావనతోనే ఆలోచిస్తూ, తదుపరి తరాలకూ అదే నూరిపోస్తూ ,తమను తాము మభ్యపెట్టుకుంటూ, వుమ్మడి రాష్ట్రంలో తమకు జరిగిన మేళ్ళు మరచి పోతూ, ఆ కష్ట దశలో ఆంధ్రులు అందించిన సాంత్వన,సహకారం ,ధైర్యం ప్రోత్సాహం ,మరచి పోతే ఎవరుమాత్రమ్ యేమి చేయగలరు. అప్పులపాలైన కుటుంబాలు, దొరల సహకారం లేక, వంద రూపాయల విలువచేసే భూమిని ,వడ్డీ వ్యాపారులు యాభై రూపాయలకు స్వంతం చేసుకుంటుంటే రెండువందలరూపాయలు యకరాకు యిచ్చి కొనుక్కున్న ఆంధ్రులు, తమను దోపిడీ చేసి,ద్రోహం చేశారని ప్రస్తుత తెలంగాణా తరాలు భావిస్తున్నాయంటే, దానికి కారణం వారికి అన్నీ అసత్యాలే చెబుతూ,వాస్తవాలు ఎవ్వరూ తెలియజెప్పక పోవడమే.
తదుపరి తరాల మస్థిష్కాలలో,వాస్తవాలు కాక అబద్ధాలు మాత్రమే నూరి పోస్తూ, రెచ్చగొట్టటం, చరిత్రపై మందమైన పొగ కప్పు వేయడమే, దాన్ని రాజకీయులు తమ స్వప్రయోజనాలకు వుపయోగించుకోవడం, ఘోర తప్పిదమే అవుతుంది. లబ్ది పొందినవాటిని కప్పి పెట్టి ,పదేపదే నష్టపోయామని చెప్పుకుంటూ పోతే నవ తరాల యువకులు నమ్మక యేం చేస్తారు?మనసుల్లో కార్పణ్యాలు పెంచుకోక యేం చేస్తారు? యిప్పుడైనా యువకులు విగ్నతతో గతంలోని వాస్తవాలను అవగాహనతో అర్ధం చేసుకొని వ్యవహించ వలసిన సమయమిది.
యువతను పెడత్రోవ పట్టిస్తున్న రాజకీయులు వారి తాత్కాలిక ప్రయోజనాలు పొందవచ్చేమో కాని,భావి యువతకు మాత్రం తరగని నష్టాన్ని కలిగిస్తున్నారన్న మాట మాత్రం వాస్తవం.
విశాలాంధ్రగా కలిసిన తరువాత, తెలంగాణలోనూ ,సీమాంధ్రలోనూ, అనేక విడతలు విడదీత వుద్యమాలు వచ్చినా ,యే కొద్ది వైషమ్యాలో తప్పితే,యాభై అయిదు సంవత్సరాలు ,అన్యోన్యంగా, కలివిడిగా వున్న తెలుగు వాళ్ళమనసుల్లో స్వార్ధపరులు, నిరుద్యోగ రాజకీయులు,విషబీజాలు నాటితే,ఆకస్మికంగా విడి పడాలనే అభిప్రాయాలు కలిగడంలో యేమాత్రం ఆశ్చర్యం పోవాల్సిన అవసరం లేదు.
హైద్రాబాద్ చుట్టూరా కేంద్రీకరింపబడి,అయిదు జిల్లాల్లో విస్తరించి వున్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు. రాష్త్ర ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల తో సీమాంధ్రుల కుటుంబ జీవనపురోగతి ముడివడి వుండటంతోనూ,హైద్రాబాద్ ,తమ స్వంతమంటూ తెలంగాణా వారు వాదించటంవల్లనూ,అభద్రతా భావనలు…..నిరుద్యోగ రాజకీయుల ప్రేరేపణలూ,ప్రేలాపనలూ,తత్కారణంగా యింతటి దారుణ భయానక ఆందోళనలు.
అనేక రంగాల్లో దినదిన ప్రవర్ధమానమౌతున్న రాజధాని నగరాన్ని తమది కాదనుకోవాలనుకోవాలంటే మహానగరంలో స్థిరపడిన సీమాంతర వాసులకేకాక సీమాంధ్రలో గ్రామ గ్రామాన వున్న వారి కుటుంబసభ్యులకూ సాధ్యం కాని విషయం..అంతగా యీ మహా నగరంతో వారి మానసిక ఆత్మీయ అనుబంధం ముడివడి వున్న విషయం .యీ ప్రక్రియలోవారి మనోభావాలూ ఎంతగా దెబ్బతింటాయో విగ్నతతో అర్ధం చేసుకొవలసిన అవసరం , కలిసి వుంటే కలిగిన సుఖాలూ లాభాలూ అవగాహన చేసుకోకుండా ,యీ రోజు వుభయ ప్రాంతాల వాళ్ళూ పరస్పరం లాభం పొందిన తరుణంలో,ఒక ప్రాంతీయులు యీ రోజు విడివడదామనుకోవడం, కేంద్ర ప్రభుత్వ సంస్థలూ, కార్యాలయాలూ అనే వుపాధి కారక మరో కోణాన్ని మరవడమే.