బ్లాగ్లోకానికి దూరంగా కొద్ది రోజులు

రచన : నూతక్కి

తేది :29 -11-2009

జీవితాన డొంకల

దారులలో కంకర రోడ్ల పైన

ఎన్నెన్నో మలుపుల

తో కుదుపుల తో

ఎడ్లబండిలో పయనిస్తూ

ఒక్క సారిగా నున్నని

తారు రోడ్డెక్కి సాగించిన

పయనంలో కలిగిన

ఆనందంలా…..

బ్లాగ్ప్రపంచాన

నాకు కలిగిన ఆహ్లాదం

అనిర్వచనీయం

పదినెలల నా యానం లో ,

ఎడ్లకూ,బండి యిరుసులకూ

నా మెదడుకూ విశ్రాంతి కొఱకు

అంతర్జాల మంటూ ఎరుగని

ఓ కుగ్రామాన

కొద్ది రోజులు వుంటూ ….

మీరందరికీ అందుబాటులో లేకున్నా

మీముందుంటాగా అతి త్వర

లో ఇంతదనుక నను ఆదరించిన

అందరికీ తెలుగు బ్లాగ్లోకంలో

పేరు పేరునా అందుకోండి

నా కృతఙ్ఞతలు …

మీ అందరి వాడు …నూతక్కి

ప్రకటనలు