బ్యాక్ సీట్ పైలటింగ్.
రచన :నూతక్కి
Dt:17-12-2009
బొమ్మముఖ్యమంత్రి, బొమ్మప్రధానమంత్రులను పెట్టి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటూ….పర్యవసానం రాష్ట్రమంత అగ్ని గుండం..
ఎప్పటికెయ్యది ప్రస్తుత మప్పటికా మాటలాడి…….అన్నట్లు వాళ్ళిమ్మని చెప్పారు కాబట్టి, యిచ్చేస్తున్నామని చెప్పాం ,వాళ్ళిప్పుడు మోసం చేశారు,మాట తప్పారు.ఇది న్యాయమా?
యివ్వకపోతే అతడు చస్తాడేమోనని భయపడి యిచ్చాం.మాట తప్పారు.
మరిప్పుడు అక్కడా చచ్చేట్లున్నారు.అక్కడ చస్తున్నప్పుడు వాళ్ళ కోరిక ప్రకారం వాళ్ళకీ మాటిస్తే అక్కడి అగ్ని జ్వాలలు తగ్గుతాయికదా,
అలా సోనియమ్మమాట తప్పే మనిషికాదు.ఆమె యిచ్చిన వాగ్దానం తీర్చింది
యిదీ కాంగ్రేసు అధినాయకులు కేంద్రంలో ఎవరికి వారు చెప్పే మాటలు.
యిందులో నాకర్ధం కాని దల్లా యిందులో సోనియా పాత్ర యేంటి? సొనియా దెశాన్ని పాలిస్తోందా, యీ దేశంలో పార్టీల అద్యక్షులకున్న అధికారాలు, ఎన్నుకో బడ్డ ప్రభుత్వాలకు వుండవా? యితర పార్టీలు కూడా అధికారంలో వున్న పార్టీల అద్యక్షులకే తమ తమ పార్టీల డిమాండులు ఏకరువుబేడితే సరిపోతుందా?
ముఖ్య మంత్రీ, ప్రధాన మంత్రీ బొమ్మలేనా?
ప్రధాన మంత్రి , అతనేమి చేస్తాడబ్బా?భారత దేశపు రాజకీయాలలో అతని ప్రాముఖ్యత అస్సలేమీ వుండదా? అతని మంత్రివర్గం కూడా వుండాలికదా? అధికారం పొందిన పార్టీ అధ్యక్షులకు రాష్ట్రాలను చీల్చగలిగే అధికారాలుంటాయని కొత్తగా వింటున్నా.రాజ్యాంగం మార్చారా యీమధ్య? వీళిమ్మన్నారని, వాళ్ళేడ్చారని, ఇంకెవడొ చస్తాడని ,అంతేగాని,మనం ప్రజాస్వామ్య డేశంలో ప్రజలకు ప్రతినిధులం. అతి సున్నిత విషయం లో ప్రజల అభిప్రాయం ప్రజాస్వామ్య యుతంగా తీసుకుందామని కాని,పార్లమెంటులో పెట్టి వారి అభిప్రాయం ప్రకారం యివ్వాలో వద్దో తేల్చుకొని ఆ ప్రకారం ప్రక్రియ ప్రారంభింద్దాం అని కానీ, కనీస యింగితమింతైనా లేకుండా,పర్యవసానాలను ,ఇతరప్రాంత ప్రజల ఆత్మాభిమానాలను, ఆత్మ గౌరవాలను త్రుణ ప్రాయంగా భావించి, కేంద్రానికి ఎన్నికైన రాష్ట్ర ప్రతినిధుల్నిగానీ, ఆకేంద్ర ప్రభుత్వంలో వున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులను కానీ సంప్రదించకుండానే, పరిస్తితి తమచేతులు దాటిపోతాయేమోనని, రాష్ట్రం పంచితే మనకేం లాభం? లేకుంటే మనకేమి నష్టం లాటి విషయాలు సడెన్ గా గుర్తొచ్చి
తూకమేసిచూసుకొని,
యితర పర్యవసానాలూ లెక్కేసుకొని ,మహా అయితే ఆంధ్రలో నాలుగైదు రోజులు గొడవలు చేసి సర్దుకుంటారు.లేకుంటె ఒ పదిమంది చస్తారు. అంతేగా… మనకు పోయిందేముంది . అని అంచనాలేసి,చుట్టూ వున్నభజనగాళ్ళతో అర్ధరాత్రికి రాత్రి తెలంగాణ డిక్లేర్ చేయించిన నిక్రుష్ట రాజకీయం సోనియాది.యిరు ప్రాంతాలలో పలువురి ప్రాణాలు పోవడానికి కారకురాలు సోనియా.( వెనుక ఎవరి ప్రోద్బలమైనా వుండి వుండొచ్చు కాక.) అంత ప్రేమే తెలంగాణ పై వుంటే ఎప్పటినుంచో అడుగుతుంటే ఎందుకివ్వలేదు?ప్రజాస్వామ్య పధ్ధతులెన్నో వుండగా అసంబద్ధ విధానాలెందుకు?దేశానికే అధినాయకురాలైట్లు వ్యవహరించి ,యిప్పుడు తన మాట వెనక్కు తీసుకొంటే పరువు పోతుందన్నట్లు,ప్రజల ప్రాణాలతోనూ, భావి యువకుల జీవితాలతోనూ ఆడుకోవడమెందుకు?రాష్ట్రాన్నియిరు ప్రాంతాలలోనూ, అగ్నిగుండం చేయడం యెందుకు?విచక్షణ కోల్పోయివ్యవహారం చేస్తే,విగ్నత లోపిస్తే,పర్యవసానం ఎలా వుంటుందో, ఆంధ్ర, రాయల సీమల్లో, రగులుతున్న అగ్నిగుండం, లేకుంటే, తెలంగాణా లో జరుగబోయే వినాశనం,…యిదంతా సోనియా వల్ల జరిగిన బ్యాక్ సీట్ పైలటింగ్ విపరిణామం.దేశ ప్రజలకు భవితకు జరిగిన విఘాతం.
డిసెంబర్ 17, 2009 at 8:36 సా.
బాగా రాశారండి.
సొంతంగా నిర్ణయం తీసుకునే నేతలు ఏనాడో పోయారు .
అన్నిటికి అదిస్టానమే సమాదానం చెప్పాలి .
ఇంక ప్రజా ప్రతినిదులెందుకు..?
అసెంబ్లీ ,పార్లమెంట్ లు గొడవలకు ,వాక్ అవుట్ లకు ,వాయిదాలకే పరిమితం .
ప్రధాని గారు విదేశి పర్యటన ,
ముఖ్యమంత్రి వర్యులు హస్తినాపురానికి పర్యటన .
వారసత్వ రాజకీయాలు పెరిగిపోయి నియంతృత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయ్ అండి .
డిసెంబర్ 17, 2009 at 11:40 సా.
Dear Santosh….నా బ్లాగ్వీక్షణకు థాంక్సండీ,ఒక్క రాజకీయ వేత్త కూడా యీ తంతును ప్రశ్నించటం లేదెందుకనో, దేశం ఎటు పోతుందో? ….Nutakki
డిసెంబర్ 19, 2009 at 10:47 ఉద.
నిజమేనండి. నిన్నమొన్నటిదాకా ఈ విషయలేమీ తనకు పట్టనట్లే వ్యవహరించారు ప్రధానమంత్రి.
శతకోటి పౌరులలో యావత్ జాతిని ప్రభావితం చేయగల నేత లేకపోవడం మన దురదృష్టం.
రాష్ట్రంలో కూడా అందరికీ సర్దిచెప్పే నాయకుడు ఎవరూ లేరు.
డిసెంబర్ 19, 2009 at 2:59 సా.
డియర్,అప్పారావు గారూ,నా బ్లాగును వీక్షిస్తూనే వున్నందుకు ధాంక్యూ వెరీ మచ్.యధా రాజా తథా ప్రజ అన్నట్లుంది ప్రస్తుత స్థితి.నియంతల నియంత్రణ లోనే భారతీయులం నియంత్రించ బడతామని ప్రపంచానికి సంకేతాలిస్తున్నామా,అన్న భయం కలుగుతోంది. ప్రస్తుత స్థితి గతులుచూసి. అభినందనలతో….ఆప్తుడు….నూతక్కి