నా బ్లాగు జన్మదినం..అహ! నేడే

 రచన:నూతక్కిరాఘవేంద్ర రావు.

తేదీ: 24- 12-2009

బ్లాగ్ లోకాన నేనడుగుపెట్టి ….

నేటికి గడచిందొక వత్సరం

 సాహిత్య,సామాజిక,

రాజకీయ ఆర్ధిక,

పర్యాటకాది పలు

 విభాగాల వివిధ

 ప్రక్రియల నే రచియించి

 ప్రచురించిన

 రెండు వందల

ముప్పది పై అయిదు

పోస్టులు ….

మూడు వందల

ఎనభై ఒక్క స్పందనలు…

నాకందిన అభినందనలు.

డెబ్బదియొక్కవేలు పైపడి

వీక్షణలు 

అందున ఎందరో

సహచరులూ సహోదర

 మిత్రులూ బంధు బాంధవులూ

 ఎందరో బ్లాగ్లోకపు  కవి  

పండిత మిత్రుల

ప్రోత్సాహం

నాభుజస్కందాలపై

 పెంచిన భాద్యతల భారం

 యీ ప్రక్రియతో

పరిచయమైన

సహ భవ్యభావ

కవిమిత్రుల

 ప్రతిభల నాస్వాదిస్తూ

అందిస్తున్నా నా

 అభినందనలు.

తెలుగులో నను నే

వ్యక్తపరచు భాగ్యం

కలిగించిన

క్రుషీవలులకు,

 బ్లాగుల నిర్వాహకులకు

 యివే నా జోహారులు.