అసమర్ధ రాజకీయం
(అగ్ని గుండంలో తెలుగులు)
తేదీ:24-12-2009
వెన్నులేని ముఖ్యమంత్రి
యుక్తాయుక్త రాహితిలో
కేంద్ర ప్రభుత
అక్కడ నిన్న మొన్న
యిక్కడ నేడు రేపు
అగ్గి రగిల్చిన అసమర్ధ
రాజకీయ అస్తవ్యస్త వ్యవస్త
అసహాయ అధినేతల
ప్రతిపాదనలు
ఆంధ్రలోనో తెలంగాణలోనో
అనునిత్యం రాజేస్తూ
అగ్నిగుండం
సమత మమతలు
కనలి కుమిలి
అశువులు బాసి
అమాయకులు
అశ్రు నయనాలతో
తల్లడిల్లి సామాన్యులు
ప్రభుత్వ ఆస్తుల
ఆర్టీసే బస్సుల
ఆత్మ ఘోషలు
అక్కడా యిక్కడా
ఆహుతి అవుతూ ….
తమకాళ్ళు తామే
నరుక్కుంటూ
తమ కళ్ళు తామే
పొడుచుకుంటూ
రాజకీయుల
దౌష్ట్య దశానిర్దేశంలో
ఎండమావుల వెంపర్లాటలో
దేశ భవిత యువత విద్యార్ధులు.
విగ్నతకోల్పోతూ మేధావి
వర్గమా టీచర్లూ,లాయర్లూ
డిసెంబర్ 24, 2009 at 2:56 సా.
తెలంగాణా రాష్ట్ర ఉధృత ఉద్యమ పోరాట స్పూర్తి పాటలు/గీతాలకై,(17)………
ఈ బ్లాగ్స్ చూడండి
వీటిని పాడుకొండి..విస్తృతంగా..ప్రచారం చేయండి..
http://www.raki9-4u.blogspot.com. . జై తెలంగాణ జైజై తెలంగాణ
డిసెంబర్ 24, 2009 at 3:22 సా.
Mr.Raki ,Thanks for visiting my blog….nutakki
డిసెంబర్ 24, 2009 at 3:34 సా.
*
Dear Raki,ధన్యవాదాలు.యీ పండుగల సీజన్ సందర్భంగా మీకూ మీ కుటుంబ సభ్యులందరికీ నా శుభాకాంక్షలు,యివే నా శుభాశీస్సులు. శ్రేయోభిలాషి…నూతక్కి *
డిసెంబర్ 26, 2009 at 6:13 ఉద.
http://dedicatedtocpbrown.wordpress.com/2009/12/25/%E0%B0%97%E0%B1%81%E0%B0%A1%E0%B0%BF-%E0%B0%8E%E0%B0%A8%E0%B0%95%E0%B0%BE-%E0%B0%A8%E0%B0%BE-%E0%B0%B8%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BF-n-d-tiwari-%E0%B0%AE%E0%B1%81%E0%B0%B8%E0%B0%B2%E0%B0%BE%E0%B0%A1/
డిసెంబర్ 25, 2009 at 2:27 సా.
http://dedicatedtocpbrown.wordpress.com
జనవరి 1, 2010 at 5:39 ఉద.
మీరు అక్కడ ఛెప్పిన సమాదానం యెంత హస్యాస్పదంగా వున్నదో.
అసలు మీకున్న విషయపరిఙానం చాల పరిమితం అని ఈ సందర్బంగా రూడీ అయిపొయింది.
(ఆంధ్రము ఇంకా తెలంగాణము లకు అర్థం చెప్పండి చాలు
http://dedicatedtocpbrown.wordpress.com/2009/12/22/ఆంధ్రము-ఇంకా-తెలంగాణము-ల/#comments )
మీ వ్యాఖ్యకు సరయిన సమాదానం కింద ఇవ్వడమైనది.
http://www.tadepally.com/2009/12/blog-post_27.html#comments
మీరిచ్చిన లంకెలోకెళ్ళి చూశాను. ఆ వ్యాఖ్యాతని కించిద్జ్ఞాని అనడం కంటే అజ్ఞాని అనడం సముచితం. అంతేకాక సదరు వ్యక్తికి కులగజ్జి కూడా ఉన్నట్లు కనిపిస్తున్నది. ఎందుకంటే అక్కడ అడిగినదొకటి. అతను చెప్పినదొకటి.
అందఱం మహారాష్ట్ర నుంచి, రాజస్తాన్ నుంచి వచ్చామట. ఎవఱూ కనుగొనని, ఎక్కడా చెప్పబడని అపూర్వ విషయాలు వాక్రుచ్చుతున్నాడు. అందఱం ఉత్తరాది నుంచి వస్తే మఱి ఉత్తరాది భాషలతో సంబంధం లేని ఈ తెలుగుభాష ఎక్కణ్ణుంచి వచ్చింది ? ఈ ఉత్తరాది నుంచి వలసరావడం అనేది కొద్దో గొప్పో బ్రాహ్మణ, క్షత్త్రియ కులాలకేమో గానీ ఇతర కులాలకి వర్తించదు. తతిమ్మావాళ్ళంతా ఇక్కడివాళ్ళే.
తెలంగాణకి అతనిచ్చిన వ్యుత్పత్తి (etymology) శుద్ధతప్పు. తెలంగాణలో మిట్టలే తప్ప మాగాణాలు చాలా తక్కువ. అసలు వ్యుత్పత్తి వేఱే ఉంది.
అచ్చ/ ప్రాచీన తెలుగులో ఆణియము అంటే దేశం. ఆణిముత్యము అంటే దేశవాళీ/ స్థానిక ముత్యం. అలాగే తెలుంగాణియము అంటే తెలుగుదేశం అని అర్థం.
తెలుంగు + ఆణియము = తెలుంగాణియము –> తెలంగాణ్యము
దీన్నే ఉర్దూలో ఆ భాషావ్యాకరణ/ ఉచ్చారణసౌలభ్యం కోసం ముస్లిమ్ పాలకులు తేలికగా ’తేలింగానా’ అని రాసుకున్నారు. పాత ఇంగ్లీషు పుస్తకాల్లో కూడా Telingana అనే వర్ణక్రమం కనిపిస్తున్నది. తేలింగానా అంటే ఆ రోజుల్లో ఈ పది పశ్చిమాంధ్ర జిల్లాలు మాత్రమే కావు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో ఉన్న మొత్తం 23 జిల్లాలూ ఆ రోజుల్లో తేలింగానాయే. ఎందుకంటే ఇవన్నీ ఒకే నవాబు (గోల్కొండ నవాబు) కింద ఉండేవి. ఆ వంశం అంతరించాక నిజాములు పరిపాలించడం మొదలుపెట్టారు. వారు ఒకసారి ఏ యుద్ధం గుఱించో ఇంగ్లీషువారికి ఋణపడి 1759 తరువాత ముందు కోస్తా జిల్లాలనీ, ఆ తరువాత రాయలసీమనీ బ్రిటీషువారికి ఋణం కింద ధారాదత్తం చేశారు. అలా పశ్చిమాంధ్ర జిల్లాలు నిజాముల కింద కిందా, తూర్పు, దక్షణాంధ్ర జిల్లాలు ఇంగ్లీషువారికిందా నలగడం మొదలుపెట్టాయి. నిజాముల రాజ్యంలో తెలుగుజిల్లాలే కాక కన్నడ, మరాఠీజిల్లాలు కూడా ఉండేవి. కనుక తెలుగుజిల్లాల గుఱించి తేలింగానా అని వ్యవహరించడం కొనసాగించారు. అంటే తెలుగువాళ్ళ భూమి అనే అర్థం తప్ప ఇప్పటి పశ్చిమాంధ్రులు భావిస్తున్నట్లు అదేదో మిగతా తెలుగునేల కంటే వేఱైనది అని కాదు.
ఆంధ్ర అనేది తెలుగుభాషకి సంస్కృతనామం. మలయాళానికి కేరళ అన్నట్లు. తెలంగాణవాళ్ళు అనుకుంటున్నట్లు అది ఆ 13 పదమూడు జిల్లాలకే చెందినది కాదు. తెలంగాణ కూడా ఆంధ్రానే. ఆంధ్రా కూడా తెలంగాణానే. ఒకే జాతికి, ఒకే భూమికి ఉన్న రెండు పేర్లు ఇవి.
ఎప్పుడు గ్రహిస్తారో ఈ చారిత్రిక సత్యాన్ని తెలుగుజనం, ముఖ్యంగా తెలంగాణ జనం !!
-తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం
ఇంతటి చక్కని వివరణ ఇచ్చిన శ్రీ తాడేపల్లి గారికి ఈ సందర్బంగా దన్యవాదలు తెలియచేసుకుంటున్నాను.
ఒకటె వ్యాఖ్యా వున్న మీ టపా లక్ష్యం నెరవెరిందా అంటే మీకు సందేహ నివృత్తి అయిందా??? అయివుంటే ఈ విషయాన్ని సాధ్యమయినంత మందికి తెలియజెయటం మీ బాద్యతగా భావించాలని కొఱుతున్నాను.
జనవరి 1, 2010 at 7:35 సా.
@తాడేపల్లి . .
ప్రపంచంలో మనిషిగా పుట్టిన వాడు ఎంత విద్యావంతుడైనా పరిపూర్ణ విగ్నావంతుడు, సకల విద్యా పారంగతుడూ కాలేడు. ఎవరైనా తమకు తాము అలా భావిస్తే అంతకన్న మూర్ఖత్వం మరోటుండదు.
నా విషయ పరిగ్నానాన్ని తూకమేయమని నేనెవ్వరినీ యాచించలేదు. మీరు పండితులే కావచ్చును.కాదనవలసిన అవసరం నాకులేదు..బహు భాషా కోవిదులూ కావచ్చును. నేనెందుకు కాదనాలి..మీరు చెప్పిన విషయాలు మీ సంకుచిత ధ్రుఃక్కోణంలోసమంజస మనిపించ వచ్చు, లేదా వాస్తవమూ కావచ్చు. కాదనను.
దయచేసి వ్యక్తులను కించపరచ వద్దు. నిజంగా నా వుద్దేశ్యాలు తప్పయితే విశదీకరించండి.అంతేకాని,
భ్రాహ్మణ క్షత్రియ కులాలనెందుకు ఆడి పోసుకుంటున్నారు.మిగిలిన కులాలన్నీ లావా పుట్టుకతోనే అక్కడే వుధ్భవించినట్లు, భ్రాహ్మణ క్షత్రియ కులాలు మాత్రమే దేశాలు పట్టుకు తిరిగి నట్లు, ముందు మీ భావనలో వున్న కులగజ్జిని యితరులకు అంటగట్ట కండి.మీదు మిక్కిలి మీనోటనున్న గజ్జిని కొంతైనా తగ్గించుకోవడం మంచిది అంటు వ్యాధిగా మారి బ్లాగ్లోకమంతా పాకక ముందే..
బ్లాగులలో చర్చలు జరిపేటఫ్ఫుడు,వ్యక్తులను కించపరచకుండా విషయంపై మీ పాండిత్యాన్ని విన్యసించండి.నలుగురికి వుపయోగపడుతుంది. .చరిత్ర లోని అర్ధంకాని విషయాలపై చర్చించి అవగాహన చేసు కుంని క్లారిటీ తెద్దామనే రేణుకుమార్ ప్రయాసకు చేతనయినంత,తోడ్పడ గలిగితే తోడ్పడం డి.
@ శ్రీ రేణూ కుమార్, ఏక పద సమస్యలిచ్చిపూరించమన్న మీ విధాన ప్రక్రియ నాకు నచ్చి, ముచ్చట పడి,నాయంతట నేను చర్చ లోపాల్గొన్న మాట వాస్తవం. యిలా సంస్కార రహితంగా వ్యవహరించే వారితో జాగ్రత్త పడండి. నా వాదన నాది.లోపాలు వుండ వచ్చు. చర్చ జరగనివ్వండి. అవగానా రాహితి వుంటే తెలియ చెప్పండి. అంగీకార యోగ్యమైతే ఒప్పుకుందాం. విషయ పరంగా విభేదాలుంటే విశదపరచండి.కాని వివాదాస్పద వాఖ్యలు చేయకండి. .సరైన విషయం వెలికి తెండి. నలుగురికీ పంచండి.అందరం పంచుకుందాం. అందుకు యీ బ్లాగ్ ప్రక్రియ మహత్తర వేదికగా మార్చండి. . Let’s not currupt it. అంతేగాని ఎదుటి. వ్యక్తి సామర్ధ్యాన్ని, వ్యక్తిత్వాన్నికించపరచడం బ్లాగర్లకు గానీ బ్లాగ్ప్రపంచానికి గానీ మంచిది కాదు…….వి.గ్నానులు,మేధావులూ వ్యవహరించ వలసిన తీరిది కాదు. …………నూతక్కి