అయినా వీడ్కోలిస్తూ రెండు వేల తొమ్మిదికి

(స్వాగతిద్దాం రెండు వేల పదిని.)

రచన: నూతక్కి

 తేది:31-12-2009

పయనిస్తూ కాలం స్వయం గమన వేగంలో

సంవత్సరాలనే మైళ్ళ రాళ్ళు దాటుకుంటూ

 తన పయనంలో తాను సుడి గాలిలా సర్వాన్ని

 తనలోకి యిముడ్చుకుంటూ 2009 వ

మైలు రాయినుంచి 2010 వ మైలు రాయి

 మధ్యన పయనించినదాదిగా…. తెలుగులపై

నిరంతర  వుల్కా పాతపు కఠిన శిలా విస్ఫోటనలా

 యిముడ్చుకున్న వాటన్నిటినీ విసరివేస్తూ….

నిర్ధాక్షిణ్యంగా మోర చాచిన కరువు

అధినాయక నిధన కధనం

 జలప్రళయ వికటాట్ట హాసం

 సమైక్య,విభజనాందోళనల

 విక్రుత నాట్య విన్యాసం

 వేలాది కోట్ల సంపదల

విశ్రుంఖల విధ్వంస రచన

అసమర్ధ నాయకత్వ నిర్దేశకతన

 రాష్ట్రం, దేశం,పాలనా వ్యవస్తలు

 యేమని వీడ్కోలివ్వను 2009 కి

 యేలాగున స్వాగతించగలనని

అనుకున్నా తప్పదుకద ఆహ్వానించక

 2010 ని చేసేదేముందని

వీడ్కోలందించక 2009 కి

అందుకనే అందరం వీడ్కోలందిద్దాం

రెండు వేల తొమ్మిదికి.

ఆహ్లాదం ఆశిస్తూ స్వాగతిద్దాం

రెండు వేల పదిని.