జనవరి 2010


అది మీ విచక్షణకే

 రచన:నూతక్కి

విభజనోద్యమాలు చేస్తూ, ఆత్మ గౌరవ నినాదాలు చేస్తున్న, తెలంగాణ యువత గుర్తించవలసిన దేమంటే, ప్రస్తుతం మన రాజకీయ నాయకులు వక్రీకరించి యువత మనసులను తొలిచి నింపుతున్న అబద్ధపు భావనలు… 1)మన ఆత్మ గౌరవానికి కష్టం కలిగిందని, 2)తెలంగాణ ప్రాంతానికి ఆంధ్ర పాలకుల పాలనలోనష్టం జరిగిందనీ….. చెబుతున్నవిషయాలు వక్రీకరించి చెప్పిన అవాస్తవాలు, తెలంగాణాకు , యిక్కడి ప్రజలకు జరిగిన నష్టం, ఆంధ్ర ప్రాంత నేతలవల్లనో,అధినేతలవల్ల నో, పాలకులవల్ల నో, మీదు మిక్కిలి ఆంధ్ర ప్రాంత ప్రజలవల్లనో కోల్పోవడం జరుగ లేదు. వందల యేళ్ళు నైజాము ప్రభుత్వంలో జరిగిన దోపిడీల వల్ల,రజాకార్ల దాక్ష్ణీకాల వల్ల,గడీల్లోని దొరల దురాగతాల వల్ల,వారుమన మనసుల్లో నింపిన బానిసత్వ స్రుంఖలాలవల్ల, ఆర్ధిక,సామాజిక కుల ప్రాతి పదికల వివఖ్షతతో విద్యను సామాన్యునికి అందనీయకుండా చేసిన గ్రామ గ్రామాన వున్న అగ్ర కుల గ్రామ పెద్దల వల్ల, కోల్పోయాంగాని ఆంధ్ర ప్రాంత నేతలవల్ల గానీ,అధినేతలవల్ల గానీ, పాలకులవల్ల గానీ, మీదు మిక్కిలి ఆంధ్ర ప్రాంత ప్రజలవల్లకానీకాదు.అభివ్రుధ్ధిపరంగా రాష్ట్రంలో అనేక ప్రాంతాలకు అన్యాయం జరిగింది .కేవలం తెలంగాణాకే కాదు.వివేకం, సమ్యమనం యీ సమయంలో చాల అవసరం. అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అది మీవిగ్నత.వాస్తవాలను కావాలని విస్మమరిస్తే …..అది మీ విచక్షణకే.

ఏందో సమఝ్కాకుంటున్నది.,
రచన: నూతక్కి, తేది : 28-01-2010
యీ రోజు సిదంబరం “కమిటి” యేస్తనని జెప్పినకాడికెల్లి టివి చానళ్ళల లొల్లెంటె లొల్లి. అందరికి అర్దమయ్యిందేందంటె,తెలెంగాన రావాల్నంటె ,అయిదరబాదు సమస్య,నదీ జెలాల సమస్య,కొత్త రాజధానేడ గట్టాల్నన్నది సమస్సె, యెన్ని రాజదాన్లు కట్టాల్నన్నది సమస్సె.అద్దులేడ బెట్టాల్నన్నది సమస్సె.కొత్త రాష్ట్రాలకు నిధులేడికెల్లి తేవాల్నన్నది సమస్సె.. గట్లని అందరు జెప్పుకుంటున్నరు గాని, అసల్ సమస్సె యేందంటె యీడనే హయిదరాబాదుల జమైన కేంద్ర పరిస్రమల సంగతెవ్వరు పట్టించుకోకుంట పల్లకున్నరేందో.గదే మేజర్ సమస్సయ్యి కూకుంటదో ఏందో సమఝ్కాకుంటున్నది.,

 

ఆదెపత్తెప్పోరుల అయిదో “మా” కారుడు.

రచన: నూతక్కి,

తేదీ : 27-01-2010

అప్పటి దినాల్ల,

ఆ మద్రాసుకెల్లి

యిడివడొచ్చిన

ఆంధ్ర పెజల నెత్తిన

మాకొద్దు మొర్రో అన్న గని

 శాన పెద్ద బారముంచిండు

జెవ్వరు బాబు..

గదే !తెలంగాణ భాద్దెత.,

 మీతోడనే కల్సుంటరు,

 నీకాడ పైసలున్నయ్,

పంటలున్నయ్,

ఆల్ల తాన గనులున్నయ్…

ఒంటిగొదిలేస్తె

ఆగమైతడన్జెప్పి

సమ్ఝాయించి,

బాద్దెత్ల్నిచ్చిండు

బారం తలకెత్తిండు.

రాజదాని గాడ్కెల్లి

గీడకు మార్పిచ్చిండు

అదేమంటె

 మీదొకే బాసగదంటడు.

అప్పటి కాడ్కెల్లి,

అంతదన్క నిజాము కాడ

వూర్లల్ల పెత్తనం

చలాయించిన్రు జూడు

 గాదొరలు,

రజాకార్లకు అత్తాసు

 పలికిన దొరలు,

 ఆంధ్రోళ్ళొస్తెగిన,

వూర్లల్ల

అమాయక

 తెలంగాన పెజలు

 (ఆల్లకి సదువెందుకని నొక్కి పెట్టిన్రు గడీ దొరలు.)

తమ సెప్పు సేతల్దాటి,

మాటినకుంటరనీ,

ఆల్లను సెప్పులకిందేసి

 నలిపెడి

 అదికారం,

 ఆదిపత్తెం

ఏడ పోతదోనని,

గప్పటి కాడికెల్లి

 తెలంగాన ను

 అడ్డు పెట్టుకొంట

 ఆధిపత్తేనికై పోరు

 జేస్తనే వున్నరు.

 మద్దెగాల కొద్దికాలం

ఆగినట్టన్పించినా

 మల్ల 1969/1970 ల లో

 గీడనే జమాయించిన

పక్క రాష్ట్రపోళ్ళ

మద్దద్దీస్కుంట

మల్ల ఆధిపత్తెప్పోరు

 షురూజేసిన్రు.

 అధికారం చేత్లకొచ్చినంక

 గా వూసె మరిసింన్రు.

గడీల్నేలిన పెబువుల్గూడ

తెలంగాన స్లోగన్లిచ్చి

పీటమెక్కిన్రు గాని

తర్వాత గాయిసయం

 మరిసిన్రు.

 మరాఠీలూ,

మళయాళీలూ,

 మార్వాడీలూ,

మద్రాసీలూ,

 గీ వీళ్ళు

గిప్పటికెళ్ళి కాదు

 నిజామ్ దొర నాటికెల్లి

యే రోటి కాడి

పాటారోటికాడ పాడి

 వాల్ల పబ్బం

 గడుపుకొన్నరు.

 గుజరాతీలు సింధీలు,

 వున్నరు గాని,

 ఎనకాతలకెల్లి ఆటాడిస్తరు.

 పార్సీలున్న గని

 పైసలిచ్చివూకుంటరు.

 ఆల్లెవర్తోటి డేంజర్ లేదు గాని

 నాల్గు మకార్లు !

ఆళ్ళకు తోడు మరో “మా” కారుడు, యీల్లతోటి జర బద్రంగుండాలె. లేకుంటె ఆదిపత్తెప్పోరు అడ్డ దార్ల్తొక్కుతది. జర జాగ్రత్త!

దర్పణం

 రచన :నూతక్కి

 తేది : 25-01-2010

ఈ భూమి పై పుట్టిన ప్రతి మనిషికి ,సభ్య మానవ సమాజంలో నివసిస్తున్న ప్రతి వ్యక్తికి ఆ సమాజపు భాష ,తద్వారా జీవన ప్రక్రియలొ జీర్ణించుకుపోయిన సంప్రదాయాలు,సంస్క్రుతులు,అలవాటులు , ఉద్వేగాలూ,ఉద్రేకాలూ ,కోపాలూ తాపాలూ ,వాటిని వ్యక్తపరిచే రీతులూ ,తద్వారా ఆవిష్కృత నృత్య గానాది కళలూ, జీవన విధి విధానాలూ ఆ జాతి తరతరాల జీవన చరితకు నిలువెత్తు దర్పణాలు.

వివేచన కరువై……

నూతక్కి,

Dt .24-01-2010.

 హింసతో అహాన్ని త్రుప్తిపరుచుకో గలరేమో కాని సత్ఫలితాలు పొందటం అసాధ్యం. తామనుకున్నది తామనుకున్నట్లు తమకు అనుకూలంగా జరిగి తీరాలనుకొనేవారు, సాధన దిశలో కోల్పోవలసింది అధికం అన్న విషయం విగ్నులకు విశదమే. కాని , వివరించే వారు, అర్ధం చేసుకునే వారు కరువయ్యారు.

కాలక్షేపం

 (శవయాత్రలో స్మశానంలో)

 రచన: నూతక్కి, తేదీ : 24-01-2010

ఏంటొ ! ఎవరూ పట్టించుకోరు,ఎంత దారుణంగా వుందీ ! వాళ్ళ స్మశానాలు నిఝంగా వుద్యానవనంలా యెంతబాగుంటాయి? మరి మన స్మశానాలేమో యిట్లా,పాయఖానాల్లా గలీజుగా . నిర్వహణే లేదు.ఇక్కడ మనమేదైనా చేయాలి. అందరం పూనుకోవాలి. అదేంటీ? అక్కడ స్మశానంలో యిళ్ళొచ్చాయీ ! స్మశానాల్లో కబ్జాలా? వెంటనే ప్రభుత్వం ద్రుష్టికి తీసుకు వెళ్ళి వాటిని తీయెంచెయ్యాలి. యిట్లా మాట్లాడుకొంటూ వున్నారు శవం వెంట వచ్చిన వారు….అందులో మునిసిపాలిటీ అధికారులూ, పాలకవర్గ సభ్యులూ వున్నారు.

అక్కడే వుండి ఆసక్తిగా విన్న ఓ కుక్క ప్రక్క కుక్కతో అంటోంది…వీళ్ళెప్పుడొచ్చినా పిచ్చి కుక్కల్లా యివే డైలాగులు మొరుగుతారేందీ ? వినీ వినీ బోరు కొడుతున్నాయి. ఆడేగా ఆ యిళ్ళు కట్టిచ్చిఅమ్మింది?ఆళ్ళందరి చెవుల్లో పూలు పెడతన్నాడుగా,వచ్చినోడు ప్రతోడూ యిదే డైలాగులు చెప్పి పోతాడు.వాళ్ళ వాళ్ళు చస్తే తప్ప మళ్ళీ యిటు రాడు. దీన్నే స్మశాన కాలఖ్షేపమంటారు తెలుసా.

స్మశానస్థలి !

రచన :నూతక్కి,

 తేదీ : 24-01-2009

ధరాతలం

 జలాశయం

మానవ,జంతు,

 పక్షి,వ్రుక్ష

 జలచరాది

విగత జీవ

కళేబరాలు !

నిక్షిప్తమై

అంగుళ

మంగుళమందున

 ప్రతి అణువూ

మరుభూమియె ! ! !

యీ ధరిత్రి యంతా

ఓ స్మశానస్థలి ! ! !

మకర సంక్రమణ కాంతీ !

రచన : నూతక్కి,

తేదీ : 14-01-2009

విరోదినామ సంవత్సరాన

 తెలుగిండ్ల ముంగిళ్ళ

నడయాడ వచ్చిన

మకర సంక్రమణ

కాంతీ ! సంక్రాంతి !

 తెలుగుల మనస్సులు

 మసి బారి పోయి

 వున్నాయమ్మా!

తెలుగుల మనోరధ

చక్రాలు

విభాజనాభావ

 సమ్మెటల విస్త్రుత

దారుణ ప్రహారాల ధాటికి

 విరిగిపోయి ఉన్నాయమ్మా

 నిను స్వాగతించి

 మా ముంగిళ్ళ కు

తోడ్కొని తెచ్చేందుకూ,

వీధి వీధీ త్రిప్పి

తిరిగి నిను సాగనంప

 రాలే మమ్మా !

వీధులన్నిట విద్వేషమనే

 కంటకాలూ క్రోధావేశ భరిత

కందకాలు తప్ప ,

ఎప్పటిలా

పూలు పరిచిన

 రంగవల్లులు లేవు

 నీ పాదాలకు

గాయాలవుతాయి!

నడయాడాలని చూడకు తల్లీ !

మాకోసం ఎలా వచ్చావో !

పాపం ! మరి ఎలా తిరిగి పోతావో ?

 జాగ్రత్త తల్లీ, ఎక్కడ చూసినా

రాస్తారోకోలూ రెయిళ్ళ రోకోలు.

 కారులు ఎలానూ తిరగవు

 బస్సెక్కీ,రైలెక్కీ

 నీగమ్యానికి చేరలేవు

కాల్పులు,లాఠీ చార్జీలు

 బందుల్లో చిక్కుకోకు

బందిఖానాలో

 బందీవైపోతావు.

గురుతర సామాజిక భాధ్యత

(వివిధ మీడియాలు గుర్తెరగాలి)

రచన: నూతక్కి,,తేదీ: 18-01-2010

మీడియా యేదైనా,

ద్రుశ్య, శ్రవణ,

వీక్షణ, లేవైనా

తమకు కావాలనుకున్న

ది వెలికితీయ సమర్ధులు

జరిగేదీ,జరుగుతున్నదీ,

జరగబోయేదీ

ఎంతటి కఠిన వాస్తవాలు

యేవైనా? తొట్ట తొలుత,

ప్రజలముందు వార్త

ల సేకరణతో తామే

ముందుండాలని

దేశంలొ ప్రతికొనలో

చదరపు మైలుకో

ప్రతినిధితో,

ఏదో పేపరుకో, టివి కో,

కెమేరాతో మైకుతో..

కానీ ఘటనలు జరిగేటప్పుడు

, ఆ తదుపరి అదేదైనా గాని

పోస్ట్మార్టం తామేనిర్వర్తించే

తీరు మార్చుకొని

సమ్నమయంతో

భాధ్యతతోవర్తించే

సామాజిక భాధ్యత

తమదేయని భావన

మదిలో లేశమైన లేకుంటే…..?

ప్రజలనుంచి రాదా చీత్కారం ?

ఆ స్థితిరాకుండా జాగ్రత పడి .

జన మానసాల జాగ్రుతికై

దేశవ్యాప్త వుద్యమ

దీక్షా కంకణ ధారివై

కదలాలని మీడియాని

వేడుతూ

అనాఛ్ఛాదిత గొట్టపు బావులు

ఆఛ్ఛాదితాలుగా మార్చు.

అక్రందిస్తూ అలమటిస్తూ

మానవ మహారణ్యంలో

సాయానికి అర్ధించే..

ఆర్తులకు ఆలంబనకై

వ్యయ ప్రయాసలలో

పదో వంతు వెచ్చిస్తే ఎంతబాగు?

కానీ,కానీ అలా కాదెందుకనో !

రోడ్డు ప్రమాదాన బాధిత పీడితులు

చచ్చేదాకా ప్రాణం పోయే తీరులు,

ప్రతీ క్షణం కణం కణం ద్రుశ్యీకరిస్తూ

తమ వీక్షకులకో,ప్రేక్షకులకో,

శ్రోతలకో,పాఠకలోకానికో

తామే ప్రప్రధమంగా

సమాచారమందించే తపనలో!

చంకలు గుద్దుకుంటూ పాపం!

ఆయా మీడియా ప్రతినిధులు ?

తమ ప్రయాసలో

పదో వంతైనా తోటి ప్రాణి

రోడ్డుపైన మనిషైనా,

అడవిలోని మ్రానై

నా రక్షణకై ద్రుష్టిపెడితే….

కాదా సమాజనికదో

సౌభాగ్యం?

ప్రజల కష్టాలను

,నష్టాలను, సుఖదుఃఖ్ఖాలను

ప్రజలకే అమ్మి సొమ్ము చేసుకొనే

మీడియా యేదైనా

కొంతైనా తమ

లాభాలను

ప్రజాసంక్షేమానికి వెచ్చిస్తే

ఆర్తుల ఆర్తనాదాలను ఆలకిస్తే,

పోయేదేముందని?

ప్రజల గుండెల్లో పదికాలాలు

నిలచి పోవడం తప్ప….

అధికారులు రక్షకభటులు

ప్రజాప్రతినిధులు, మేథావులు

వారిని మించిన గురుతర భాధ్యత

తమదేయని మీడియా

యాజమానులు గుర్తించి వ్యవహరిస్తే ……..

అదికాదా దేశానికి

అభ్యుదయం.

జనజీవన సౌలభ్యం.

ఎరా ఎర్రనీ సూర్యుడు జ్యోతిబసుకు లాల్ సలాం.

 రచన: నూతక్కి,

తేదీ:17-01-2010

అరుణ వర్ణపు మహా వటవ్రుక్షం కూలింది, సూర్యుడే కాని, చల్లని సుస్థిరమైన ,ఆశ్రయాన్ని ఆధారాన్ని కోట్లాది జీవితాలకు అందించి,దేశానికే ఆదర్శమై, దిశా నిర్దేశం గరపి, ప్రపంచమంతటా క్రుంగి క్రుశిస్తున్నకమ్యూనిజానికి తానే కాండమై,,తానే కొమ్మలై,తానే ఆకులా,పూవులా పండులా,పటిష్టంగా, కూర్చిసర్వం తానెఅయి, ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా, పాలనకు అతనో సిలబస్ ,పార్టీకి అతనో బ్రుహత్తర గ్రంధం.తను నమ్మిన సిద్ధాంతాల ఒరవడిని మునుముందుకు విస్తరిస్తూ,శారీరక ధర్మానికి తలవంచి,కాలగమన వేగంలో కనుమరుగయ్యే ప్రక్రియలో యీనాటికి విగతజీవుడై,భౌతికంగా మననుంచి నిష్కరమించినా భవిష్యత్ అంతా తానైన….మహనీయుడు శ్రీ జ్యోతిబసుకు యిదే నా లాల్ సలాం.

తర్వాత పేజీ »