వేర్లలో చీడ ! చివళ్ళకు మందు?

(హైద్రాబాద్ బూక్ ఫేర్ గురించి దీప్తిధార బ్లాగులో శ్రి సిబిరావు గారి వ్యాసాల స్ఫూర్తితో)

నూతక్కి: 11-01-2010

దీప్తిధారలో, శ్రీ సి.బి.రావ్ గారు, బ్లాగ్వీక్షకులకు (Hyderabad book fare) పుస్తక ప్రదర్శన గురించి ఫొటొలతోసహా వివరించాలన్న ప్రయత్నాన్ని, తాపత్రయాన్ని,ఇ తెలుగు వారి క్రుషిని, అభినందిస్తూ….

తెలుగు వారిలో తెలుగులో పుస్తక పఠనాసక్తి గురించి ,అభిలాషగురించి,ఆసక్తిని పెంపొందించే మార్గాలగురించి నాయీ చిన్ని మనసులో మొలకెత్తిన బీజాన్ని మీముందుచుతున్నాను.

వాస్తవానికి భావి యువతలో పుస్తక పఠనాభిలాష అభివ్రుద్ధి చెందాలంటే, తెలుగు పుస్తక ప్రచురణకర్తల వుత్సాహం యినుమడించాలంటే, ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలల విద్యార్ధుల చెంతకే అందుబాటు ధరలతో చిరు పుస్తక ప్రదర్శనలు, యేర్పాటు చేయాలి. యీ ప్రయత్నంలో యిప్పటికీ నిరంతర యానంలో విశాలాంధ్ర పబ్లిషర్స్ ను అభినందించకుండా వుందలేము.

తెలుగులలో పూర్తిగా లోపించిన పఠనాసక్తిని అభివ్రుద్ధిలోకి తీసుకు రావాలంటే, ముందు వుపాధ్యాయుల్లో ఆ వుత్సాహం వుద్దీపింప చేయాలి.ఇనుమడింపచేయాలి. అప్పుడే వారు విధ్యార్ధుల్లో పుస్తక పఠనాసక్తికి బీజాలు వేస్తారు. గతంలో, పిల్లలు తెలుగు మీడియాలో చదివే వారు. యింట్లో ఆడవారూ యింట్లో ఖాళీ సమయాల్లో తెలుగు వార, మాస పత్రికలు చదివేవారు. తోటి స్త్రీలతో, వాటిల్లోని కథల గురించీ నవలల గురించీ,కధానాయకుడి గురించీ,రచయితలగురుంచీ చర్చించుకొనే వారు.

ఆ సంభాషణలు విన్న పిల్లలకు ఆ పత్రికలు చదవాలన్న ఆసక్తి పెరిగి పెరిగి ,మాంచి పుస్తక ప్రియులుగా మారే వారు. ఈనాటికి ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగు భాషా కోవిదులనేకులకు , వారి కి తెలుగు పత్రికా పఠనాసక్తి వున్న, వారి అమ్మలో అక్కలో,స్పూర్తిదాతలంటే,ఆశ్చర్యంగా వుందవచ్చు.

ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక,ఆంధ్రజ్యోతి,స్వాతి,చందమామ, బాలమిత్ర,జ్యోతి,భారతి, ఇత్యాది వార మాస పత్రికలు,పిల్లలనుంచి పెద్దలవరకు పఠనాసక్తిని పెంపొందించి,తెలుగు భాషాభివ్రుద్ధికి అమోఘ సేవ చేశాయి. ఇప్పుడో……అమ్మకూ తెలుగు రాదు,అక్కచెళ్ళెల్లకూ అన్నదమ్ములకూ ఆఖరికి నాన్నకు కూడా తెలుగు రాదు. అందరూ తెలుగు వాళ్ళే.పిల్లలు యింగ్లీష్ పుస్తకాలు తప్ప చదవరు.అట్లాగని పిల్లల్లో పఠనాసక్తి చచ్చి పోలేదు.పెరుగుతూనే వుంది. కాకుంటే,తెలుగులో కాదు. యింగ్లీషులో. .

ఒక్క ప్రభుత్వ పాఠశాలలలో చదువుకొనే విద్యార్ధులకు తప్ప.,ప్రైవేటు పాఠశాలల విద్యార్ధులకు తెలుగు పై ఆసక్తి పెంపొందించలేక పోతున్నాము. ఎందుకంటే ప్రభుత్వానికి తెలుగు అభివ్రుద్ధిపై, ఆసక్తి లేకపోవడమే.ప్రభుత్వ నియంత్రణ లోపించడం.రాష్ట్రంలో వున్న ప్రతి పాఠశాలలోనూ తెలుగు సబ్జెక్ట్ మొదటి క్లాస్ నుంచి పదో తరగతి వరకూ నిర్బంధంగా బోధించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో విధ్యార్ధుల దౌర్భాగ్యం యేమంటే, అక్కడి విద్యార్ధుల్లోఎంత పఠనాసక్తి వున్నా, వుపాధ్యాయుల్లో నిండుకున్న,ఆసక్తి. ఎందుకంటే అక్కడ చదివేది ఆర్ధికంగా వెనుకబడిన మధ్య తరగతి వారు,ఆర్ధికంగా పూర్తిగా వెనుకబడినవారు,గుడెసె వాసులున్నూ. పుస్తక పఠనాసక్తి పెరగాలంటే,మూలంలో లోపమెక్కడుందో ,తెలుసుకొని వేరుల్లో చీడ తొలగించకుండా చివళ్ళకు మందు చల్లి ప్రయోజనం వుండదు.

ప్రకటనలు