గురుతర సామాజిక భాధ్యత

(వివిధ మీడియాలు గుర్తెరగాలి)

రచన: నూతక్కి,,తేదీ: 18-01-2010

మీడియా యేదైనా,

ద్రుశ్య, శ్రవణ,

వీక్షణ, లేవైనా

తమకు కావాలనుకున్న

ది వెలికితీయ సమర్ధులు

జరిగేదీ,జరుగుతున్నదీ,

జరగబోయేదీ

ఎంతటి కఠిన వాస్తవాలు

యేవైనా? తొట్ట తొలుత,

ప్రజలముందు వార్త

ల సేకరణతో తామే

ముందుండాలని

దేశంలొ ప్రతికొనలో

చదరపు మైలుకో

ప్రతినిధితో,

ఏదో పేపరుకో, టివి కో,

కెమేరాతో మైకుతో..

కానీ ఘటనలు జరిగేటప్పుడు

, ఆ తదుపరి అదేదైనా గాని

పోస్ట్మార్టం తామేనిర్వర్తించే

తీరు మార్చుకొని

సమ్నమయంతో

భాధ్యతతోవర్తించే

సామాజిక భాధ్యత

తమదేయని భావన

మదిలో లేశమైన లేకుంటే…..?

ప్రజలనుంచి రాదా చీత్కారం ?

ఆ స్థితిరాకుండా జాగ్రత పడి .

జన మానసాల జాగ్రుతికై

దేశవ్యాప్త వుద్యమ

దీక్షా కంకణ ధారివై

కదలాలని మీడియాని

వేడుతూ

అనాఛ్ఛాదిత గొట్టపు బావులు

ఆఛ్ఛాదితాలుగా మార్చు.

అక్రందిస్తూ అలమటిస్తూ

మానవ మహారణ్యంలో

సాయానికి అర్ధించే..

ఆర్తులకు ఆలంబనకై

వ్యయ ప్రయాసలలో

పదో వంతు వెచ్చిస్తే ఎంతబాగు?

కానీ,కానీ అలా కాదెందుకనో !

రోడ్డు ప్రమాదాన బాధిత పీడితులు

చచ్చేదాకా ప్రాణం పోయే తీరులు,

ప్రతీ క్షణం కణం కణం ద్రుశ్యీకరిస్తూ

తమ వీక్షకులకో,ప్రేక్షకులకో,

శ్రోతలకో,పాఠకలోకానికో

తామే ప్రప్రధమంగా

సమాచారమందించే తపనలో!

చంకలు గుద్దుకుంటూ పాపం!

ఆయా మీడియా ప్రతినిధులు ?

తమ ప్రయాసలో

పదో వంతైనా తోటి ప్రాణి

రోడ్డుపైన మనిషైనా,

అడవిలోని మ్రానై

నా రక్షణకై ద్రుష్టిపెడితే….

కాదా సమాజనికదో

సౌభాగ్యం?

ప్రజల కష్టాలను

,నష్టాలను, సుఖదుఃఖ్ఖాలను

ప్రజలకే అమ్మి సొమ్ము చేసుకొనే

మీడియా యేదైనా

కొంతైనా తమ

లాభాలను

ప్రజాసంక్షేమానికి వెచ్చిస్తే

ఆర్తుల ఆర్తనాదాలను ఆలకిస్తే,

పోయేదేముందని?

ప్రజల గుండెల్లో పదికాలాలు

నిలచి పోవడం తప్ప….

అధికారులు రక్షకభటులు

ప్రజాప్రతినిధులు, మేథావులు

వారిని మించిన గురుతర భాధ్యత

తమదేయని మీడియా

యాజమానులు గుర్తించి వ్యవహరిస్తే ……..

అదికాదా దేశానికి

అభ్యుదయం.

జనజీవన సౌలభ్యం.