జనవరి 2010


స్వామి వివేకానంద సూక్తులు

 విషయ సేకరణ:నూతక్కి.

 (శ్రీ స్వామి వివేకానంద విరచిత గ్రంధం “భారతజాతికి నా హితవు” అన్న రామక్రిష్ణ మఠం వారు ప్రచురించిన చిరు గ్రంధం ఆధారంగా).

 ప్రతి వ్యక్తిని,ప్రతి జాతిని,

ఘనతరం చేయడానికి

మూడు విషయాలు ముఖ్యంగా

 అవసరం అంటారు,

స్వామి వివేకానంద. అవేవంటే…….

1) నీకు చేతనైనంత వరకు, సామాన్య జనుల బంధాలను చేదించు.

 2) సమాజ శ్రేయస్సు కొరకు స్వార్ధాన్ని త్యజించు.

3) సౌజన్యానికి వున్న శక్తులపట్ల ధ్రుఢవిశ్వాసం కలిగి వుండు.

4) అసూయ,అనుమానాలకు నీ మదిలో తావివ్వకు.

5) తాము మంచిగా వుంటూ యితరులకింత వుపకారం చేయాలనుకొనే వారికి నీ వంతు సహకారం అందించు.

బందులు

 రచన: నూతక్కి

 తేదీ : 16-01-2010

 సామాజిక ఆర్ధిక

రాజకీయ

సమరాంగణ

చట్రంలో యిమడలేక

సామాన్యుడు

 క్రుంగి పోతూ

కుమిలి పోతు…..

సమ్మెట పోటుల్లా

సమ్మెలు

 అభివృద్ధి నిరోధకాలు

 ధారా తలం నుండి

వినువీదికి ఎగసిన

 ధరలు

అరాచకతన

విరాజిల్లు

నిరాటంక

 ఆటంకాలు బందులు ….

వైవిధ్యాలూ-నిరంతర అంతరాలు.

విశ్లేషణ :నూతక్కి,

తేదీ: 15-01-2009

 ప్రక్రుతి మానవునికి అందించిన వరం, కాలానుగుణ్యంగా అందే వివిధ ఫల వ్రుక్ష సంపద, ఆయా కాలాలను బట్టి పండే వ్యవసాయ వుత్పత్తులున్నూ.ఆయా కాలాల్లో పండే పళ్ళు,పదార్ధాలు వినియోగించటం వల్ల ఆయా సమయాల్లో విస్తరించే ప్రాక్రుతిక వైపరీత్యాలనుండి, శరీరం కాపాడ బడుతుంది. ఈనాడు ఆంధ్ర ప్రదేశ్ లో వివిధ ప్రాంతాలలో ఒకే పండుగకు తయారు చేసే వంటకాలు వైవిధ్యం గా వుంటాయి. అందుకు కారణం,ఆయా ప్రాంతాలలో , ఆయా రుతువుల్లో రైతులు పండించే ధాన్యాలు, కూరగాయలు, పదార్ధాల లభ్యత, వైవిధ్యంగా వుంటాయి.వాటిని బట్టే ఒక్కో పండగకు ఒక్కో ప్రాంతంలో పిండి వంటలు ఒక్కో తీరులో ప్రత్యేకతలు సంతరించుకుంటాయి. వుదాహరణకు,ఒక ప్రాంతంలో సంక్రాంతికి ,పాలు, బెల్లం, వరి,మినుములు,పెసలు,శనగలు,వుత్పత్తి, లభ్యత చాల యెక్కువ, అందుకే వాటితో చేసే పరమాన్నం, గారెలు,బూరెలూ,అరిసెలు,పూర్ణాలు, సంక్రాంతికి ప్రత్యేకం.. మరో ప్రాంతంలో ఆ సమయానికి లభించే పంటల లభ్యత వేరు. అక్కడి పిండి వంటల ప్రత్యేకతలు వేరు. కూడా వేరు. గతంలో యిప్పడు లభిస్తున్నట్లు, అన్ని పదార్ధాలూ అన్ని ప్రాంతాలలోనూ, అన్ని కాలాలలోనూ లభించేవి కావు.యీ రోజున యే సమయంలోనైనా ఏ యిష్టమైన వంటలైనా, తయారు చేసుకునేందుకు,అనుకూలంగా అన్ని వ్యవసాయోత్పత్తులూ మార్కెట్లో లభిస్తున్నాయి. శాస్త్రగ్నుల క్రుషి ఫలితంగా యీ రోజు వ్యవసాయోత్పత్తులు పెరిగాయి, ఆహార పదార్ధాలు చెడిపోకుండా నిలువ వుంచే సామర్ధ్యాలూ పెరిగాయి.థాంక్స్ టు అగ్రికల్చరిస్ట్స్ అండ్ ప్రిజర్వేషన్ టెక్నాలజిస్ట్స్.. కాకుంటె పదార్ధ వినియోగానికీ, లభ్యతకూ, కొనుగోలు సామర్ధ్యానికీ వున్న అంతరం మాత్రం నిరంతరం.

ప్రపంచ వ్యాప్త తెలుగులకు సంక్రాంతి శుభాకాంక్షలు. 

(నిరంతరం వెలుగొందాలనీ, వెలుగుల విరజిమ్మాలనీ)

రచన : నూతక్కి

తేదీ:13-01-2009

అప్పటి కాలపు

 గ్నాపకాల ఝరిలో

 కొట్టుకు పోతూ …

మిమ్మల్నీనాతో రమ్మని

ఆహ్వానిస్తూ ..

మీకందరికీ యివే

 నా సంక్రాంతి శుభాకాంక్షలు….

కనులు మూసి

వూహాలోకాల్లో

తేలిపోతూ  రండి……..

అలా అలా

ఆ అరుణారుణ 

వుషోదయాన

శీతల పవనాల లో

ప్రవహిస్తూ……

మనసులనావహిస్తూ….

హరిదాసుల

గాన విన్యాస లహరుల నేపధ్యం,

డూడూబసవన్నల

సాష్టాంగ నమస్కారాలు,

వూరు వూరంతా రోడ్లపై,

 పెరళ్ళలోనూ 

పరుచుకొంటున్న

రంగు రంగుల రంగవల్లులు

గొబ్బెమ్మల అలంకరణలు,

యింటింటా ప్రతి ముంగిట

మామిడాకుల,ముద్ద బంతుల

యింతులు కట్టే తోరణాలు.

వణికించే చలిలో,

భోగి మంటల వెచ్చదనాలు,

పురులలో ధాన్యాలు,

జల్లలనిండా,కూరగాయలు……

గుండెలనిండా గంపెడాశలతో,

పట్టుపరికీణీల రెపరెపలతో ,

నగల అలంకరణలలో 

కన్నె పడుచుల ఆర్భాటాలు,

కొత్త అల్లుళ్ళ డాంబికాలు

.బావ మరుదుల,

మరదళ్ళ ఎకసక్కేలు.

రేపటి పోటికి

బలిష్టంగా పెంచబడి

పందెంలో తానేమౌతానో

 తెలియక

లోకాన్ని తానే

మేల్కొల్పుతున్నానన్న

అతిశయంతో ,

గొంతెత్తి,కొక్కొరోమనే

కోడి పుంజుల 

అమాయకత్వం

ఆవు దూడల

అంబారవాలు.

ధాత్రిపై జీరాడుతూ

చీపుళ్ళ 

సరాగాల రాగాలు

కళ్ళాపిజల్లుల 

సరసరలు

డూడూబసవన్నల సాష్టాంగ నమస్కారాలు,వూరు వూరంతా రోడ్లపై, పెరళ్ళలో పరుచుకొనే రంగు రంగుల రంగవల్లులపై,గొబ్బెమ్మల అలంకరణలు,యింటింటా ప్రతి ద్వారాన మామిడి యాకుల తోరణాలు. వణికించే చలిలో,భోగి మంటల వెచ్చదనాలు,పురులలో ధాన్యాలు,జల్లలనిండా,కూరగాయలు, గుండెలనిండా గంపెడాశలతో,పట్టుపరికీణీల రెపరెపలతో , నగల అలంకరణలలోకన్నె పడుచుల ఆర్భాటాలు,కొత్త అల్లుళ్ళ డాంబికాలు.బావ మరుదుల, మరదళ్ళ ఎకసక్కేలు. పచ్చని పుడమి తల్లికి ఎర్రని రంగులద్దుతున్నట్లు, మిరప తోటలు. రామములగ,వంగ బెండ తోటలు,చిక్కుడు పందిళ్ళు,పాముల్లా వ్రేలాడుతూ పొట్ల,పూరిపాకలపై పర్చుకున్నసొర తీగకు,,గుమ్మడి తీగకూ,ఆరోగ్యంగాపెరిగి భారంగా జారి పడతాయా అన్నట్లు,సొరకాయలూ, గుమ్మడి కాయలు,చెరకు తోటల్లో బెల్లపు వంటల తీపి వాసనలు,పూతకు సిద్ధమౌతూ,మామిడి చెట్లు,రంగు రంగుల ముద్ద బంతులు. దూరంగా తాటి తోపుల్లో కోడిపందేలు. పోరాటానికి సిద్ధమౌతూ,పోట్టేళ్ళు.ఎడ్ల పందేలకు సిద్ధమౌతూ కోడెలు.

తమ జన్మకు కారకులా మానవవుల కు ఆహారంగా మారి ఆహ్లాదాన్నందించే తీరుగా మారేందుకు,జానపద రీతిలో, రోటిలో రోకళ్ళు చేసే శ్రుంగార నాట్య తాడనాపీడనలో ఆ మధురిమలో తన్మయత్వంలోపిండిగా మారి,పిండివంటలుగా రూపాంతరం చెందేందుకు సలసల కాగే నూనెలో తమ జీవితాన్ని ఆనందంగా త్యాగం చేస్తూ ధాన్యపు గింజలు.

అక్కడ వంట వసారాలో వండి వారుస్తున్న గారెలు, బూరెలు, అరిసెలు,పూర్ణాలు,చక్కెర పొంగళ్ళు,పాలతాలికలు, దద్ధోజనాలు,చక్కిడాలు,పులిహోరలు,కారప్పూసలు,పాయసాలు,పరమాణ్ణాలు, వేపుళ్ళూ,పులుసులు, దప్పళాలు,యింకా యెన్నెన్నో వంటకాలు.,

గారెలు, పూర్ణాలు,బూరెలు, అరిసెలు, జల్ల గంపలో తెచ్చి ,రోడ్డు మీది అరుగుపై పెడితే, ,ఆడక్కుండానే ఆహ్వానించి వీధి అరుగులపై ఆశ్రితులకు ….పిల్లలు, పంచే ,పిండి వంటల పంపకాలు.(,తనకున్నది, తాను తినేది, అనందంగా,నలుగురితో పంచుకొనే గుణం అలవడేందుకు యిదో మహత్తర ప్రక్రియ.)

 విను వీధిన నర్తించే గాలిపటాల వయ్యారపు విహారాలు నియంత్రిస్తూ మైదానాల్లో పరుగులు పెడుతూ యువత.

 కమ్మరి, కుమ్మరి,చాకలి, మంగలి,వడ్రంగి,ఎరుకల యానాదాది వివిధ వర్గ శ్రామికులు సంవత్సర పర్యంతం,తమకు అందించిన సహకారం,అందుకు క్రుతగ్నతగా, తమకందిన ఫలసాయాన్ని వారితో పంచుకొంటూ రైతులు తాము పండించిన పంట నుండి ధాన్యాదుల పంపకాలు.

యివన్నీ ఆకాలపు వాస్తవాలు.

“క్రిష్ణార్పణం” అంటూ,వినమ్రంగా ఒక మోకాలిపై ముందుకు వంగి కూర్చొని బిక్ష వేయించుకొనే హరిదాసులు, వారికి బిక్ష వేయడానికి నేనంటే నేనని పిల్లలలో పోటీలు,గాలిపటాల వయ్యారపు విహారాలు,తేగల తంపట్లు, చలి మంటల హోరులు, ,ముగ్గులపై, గొబ్బెమ్మలు,వాటి పై పూలు, రేగుపళ్ళు అలంకరిస్తూ పట్టు పావడాలలో కన్నె పిల్లల కేరింతలు ,పండగకు వచ్చిన బావల ను ఆట పట్టిస్తూ బావ మరుదులూ, మరదళ్ళు, అహో ఆ గ్నాపకాల సుడులు, జీవితానికి సరిపడా …నిజంగా తీపి గురుతులు….అభినందనలతో… శుభాకాంక్షలతో…మీ శ్రేయోభిలాషి…. …………..నూతక్కి రాఘవేంద్ర రావు.

వేర్లలో చీడ ! చివళ్ళకు మందు?

(హైద్రాబాద్ బూక్ ఫేర్ గురించి దీప్తిధార బ్లాగులో శ్రి సిబిరావు గారి వ్యాసాల స్ఫూర్తితో)

నూతక్కి: 11-01-2010

దీప్తిధారలో, శ్రీ సి.బి.రావ్ గారు, బ్లాగ్వీక్షకులకు (Hyderabad book fare) పుస్తక ప్రదర్శన గురించి ఫొటొలతోసహా వివరించాలన్న ప్రయత్నాన్ని, తాపత్రయాన్ని,ఇ తెలుగు వారి క్రుషిని, అభినందిస్తూ….

తెలుగు వారిలో తెలుగులో పుస్తక పఠనాసక్తి గురించి ,అభిలాషగురించి,ఆసక్తిని పెంపొందించే మార్గాలగురించి నాయీ చిన్ని మనసులో మొలకెత్తిన బీజాన్ని మీముందుచుతున్నాను.

వాస్తవానికి భావి యువతలో పుస్తక పఠనాభిలాష అభివ్రుద్ధి చెందాలంటే, తెలుగు పుస్తక ప్రచురణకర్తల వుత్సాహం యినుమడించాలంటే, ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలల విద్యార్ధుల చెంతకే అందుబాటు ధరలతో చిరు పుస్తక ప్రదర్శనలు, యేర్పాటు చేయాలి. యీ ప్రయత్నంలో యిప్పటికీ నిరంతర యానంలో విశాలాంధ్ర పబ్లిషర్స్ ను అభినందించకుండా వుందలేము.

తెలుగులలో పూర్తిగా లోపించిన పఠనాసక్తిని అభివ్రుద్ధిలోకి తీసుకు రావాలంటే, ముందు వుపాధ్యాయుల్లో ఆ వుత్సాహం వుద్దీపింప చేయాలి.ఇనుమడింపచేయాలి. అప్పుడే వారు విధ్యార్ధుల్లో పుస్తక పఠనాసక్తికి బీజాలు వేస్తారు. గతంలో, పిల్లలు తెలుగు మీడియాలో చదివే వారు. యింట్లో ఆడవారూ యింట్లో ఖాళీ సమయాల్లో తెలుగు వార, మాస పత్రికలు చదివేవారు. తోటి స్త్రీలతో, వాటిల్లోని కథల గురించీ నవలల గురించీ,కధానాయకుడి గురించీ,రచయితలగురుంచీ చర్చించుకొనే వారు.

ఆ సంభాషణలు విన్న పిల్లలకు ఆ పత్రికలు చదవాలన్న ఆసక్తి పెరిగి పెరిగి ,మాంచి పుస్తక ప్రియులుగా మారే వారు. ఈనాటికి ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగు భాషా కోవిదులనేకులకు , వారి కి తెలుగు పత్రికా పఠనాసక్తి వున్న, వారి అమ్మలో అక్కలో,స్పూర్తిదాతలంటే,ఆశ్చర్యంగా వుందవచ్చు.

ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక,ఆంధ్రజ్యోతి,స్వాతి,చందమామ, బాలమిత్ర,జ్యోతి,భారతి, ఇత్యాది వార మాస పత్రికలు,పిల్లలనుంచి పెద్దలవరకు పఠనాసక్తిని పెంపొందించి,తెలుగు భాషాభివ్రుద్ధికి అమోఘ సేవ చేశాయి. ఇప్పుడో……అమ్మకూ తెలుగు రాదు,అక్కచెళ్ళెల్లకూ అన్నదమ్ములకూ ఆఖరికి నాన్నకు కూడా తెలుగు రాదు. అందరూ తెలుగు వాళ్ళే.పిల్లలు యింగ్లీష్ పుస్తకాలు తప్ప చదవరు.అట్లాగని పిల్లల్లో పఠనాసక్తి చచ్చి పోలేదు.పెరుగుతూనే వుంది. కాకుంటే,తెలుగులో కాదు. యింగ్లీషులో. .

ఒక్క ప్రభుత్వ పాఠశాలలలో చదువుకొనే విద్యార్ధులకు తప్ప.,ప్రైవేటు పాఠశాలల విద్యార్ధులకు తెలుగు పై ఆసక్తి పెంపొందించలేక పోతున్నాము. ఎందుకంటే ప్రభుత్వానికి తెలుగు అభివ్రుద్ధిపై, ఆసక్తి లేకపోవడమే.ప్రభుత్వ నియంత్రణ లోపించడం.రాష్ట్రంలో వున్న ప్రతి పాఠశాలలోనూ తెలుగు సబ్జెక్ట్ మొదటి క్లాస్ నుంచి పదో తరగతి వరకూ నిర్బంధంగా బోధించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో విధ్యార్ధుల దౌర్భాగ్యం యేమంటే, అక్కడి విద్యార్ధుల్లోఎంత పఠనాసక్తి వున్నా, వుపాధ్యాయుల్లో నిండుకున్న,ఆసక్తి. ఎందుకంటే అక్కడ చదివేది ఆర్ధికంగా వెనుకబడిన మధ్య తరగతి వారు,ఆర్ధికంగా పూర్తిగా వెనుకబడినవారు,గుడెసె వాసులున్నూ. పుస్తక పఠనాసక్తి పెరగాలంటే,మూలంలో లోపమెక్కడుందో ,తెలుసుకొని వేరుల్లో చీడ తొలగించకుండా చివళ్ళకు మందు చల్లి ప్రయోజనం వుండదు.

విందు
…..నూతక్కి
తేదీ: 10-01-2010
విందులో మందారగించి
మత్తుగా గుర్రెడుతున్న
మనిషి రక్తం తాగి
గోడమీద వాలింది
మైకంలో దోమ !
వ్యాహాళికి అటుగా వచ్చి
వాటంగా విందు చేసుకుని
తడబాటులో పరిగిడుతూ
కుడితిలో పడిందా బల్లి

అతి సర్వత్ర వర్జయేత్ !

 రచన : నూతక్కి

 తేదీ : 10-01-2010

అతి సర్వత్ర వర్జయేత్

 ఎందుకన్నారో గాని

 పెద్దలు

అనునిత్యం

 జీవిత సత్యం.

ఉత్సాహం పరిమితి దాటి

 విపరీతమై నిక్రుష్టమై

 విజ్ఞులు కదా యని

 విశృంఖల స్వేశ్చ్చ !

 విక్రుతమై

 పర్యవసానం

 ఫలితం

కష్టాలూ నష్టాలూ

 సామాజిక విస్ఫోటాలూ

 భాద్యతాలేమిలో

 విచక్షణారాహితిలో

విజ్ఞత కోల్పోయి

విదేశీ దృశ్య మాధ్యమ

 ప్రభావం నుండి

వెలికి రాలేక

మన బుల్లి తెర

 మాధ్యమం .

భూతకాలం

రచన: నూతక్కి

తేదీ:09-01-2010

మానవ జీవన

సంవిధాన సమరంలో

గతంలో జరింగిందేదైనా

 చేసింది తప్పైనా ఒప్పైనా

పోస్ట్ మార్టం చేసి ప్రయోజనం

లేదనుకోకు బ్రదర్ !

విశ్లేషించి కాలనాళికలో

 భద్రపరచి చూడు…..

వర్తమానం

 గతకాలపు భవితవ్యం

 వర్తమానమే

భవిష్యత్తుకు భూతం

సోదాహరణంగా…చెప్పాలంటే

 వర్తమానానికి , భూతకాలం

ఓ విస్త్రుత ధ్రుఃక్కోణపు విశ్లేషణ

 ఓ రామాయణం

 ఓ మహా భారతం

 మరీ మరీ విపులంగా ,

గీత,ఖురాను, బైబులు,

 గురుగంధాసాహెబు

 లా

మంచిలో చెడులో…..

 విగ్నతతోవినియోగించు

 భూతకాలపు

 ఆ

అనుభవాల దొంతరలు

 వర్తమాన నియంత్రణా

 ఘంటికలు

 భవితకు

జీవన మార్గదర్శికలు

అనుభవం

రచన:

నూతక్కి

తేదీ: 07-01-2010

 వ్యవహారం, వుద్యోగం ,వ్యాపారం,పరిశ్రమలు,సాంకేతికం,రాజకీయం,కక్షలూ,కార్పణ్యాలూ, యే రంగంలోనైనా, వుత్పన్నమయ్యే సమస్యల పరిష్కారంలో అనుభవగ్నుల ప్రమేయాన్ని వినియోగించుకోవడం వల్ల, అనవసరంగా కోల్పోయే అత్యంత విలువైన, సమయాన్ని,ధనాన్ని, మానవవనరుల వినియోగాన్నీ, నివారింప వచ్చు

అలవాటులో పొరబాటు.

 నూతక్కి.

 Dt.06-01-2010.

చేతి నుంచి వస్తువు జారితే, తీసుకో వచ్చు, కాని నోరు జారితేనో …అలాటిదే ……బ్లాగులో రాతలు కూడా. కొన్ని సార్లు మనం యాంత్రికంగా చేసె పనులు ,మనకే నవ్వు తెప్పిస్తుంటాయి మరికొన్ని సార్లూ మనలను నగుబాటు పాలు చేస్తుంటాయి. ఆలాటిదే యీ వుదంతం. డిసెంబర్ 2009 రాత్రి పన్నెండు గం.లు దాటక ముందే,అడ్రెస్స్ బుక్ లో వున్న వారందరికీ, గ్రీటింగ్స్ పంపాలనే ఆత్రంలో 2010 కి బదులు 2009 అని అలవాటు గా వ్రాసేయడం జరిగింది. ఆ పొరబాటు తోనే అదే విధంగా ప్రపంచంలో వివిధ ప్రాంతాలలో వున్న నా మిత్రులకూ,బ్లాగ్మిత్రులకూ, బంధువులకూ, (ఆఖరుకు,నా బ్లాగులో ప్రచురించిన న్యూ ఇయర్ గ్రీటింగ్స్ లో కూడా) ఒక్క క్లిక్ తో చేరిపోయింది.. . వారంతా నాకూ క్రొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఎంతో వుదారతతో, నా పై అభిమానంతో నా పొరబాటును ఎత్తి చూపలేదు. యీ వేళ నాకు వచ్చిన ఓ బ్లాగ్మిత్రుని గ్రీటింగ్ చూస్తూ నేను పంపిన దాన్ని పరికించినప్పుడు దొరిలిన పొరబాటును గ్రహించి,నాలిక్కరుచుకొన్నా. అంతమాత్రాన జరిగిన పొరబాటు సరవదుకదా. మీరంతా సరిచేసి చదువుకొమ్మని చెప్పడం తప్ప.

« గత పేజీతర్వాత పేజీ »