ఫిబ్రవరి 2010


భారత ప్రభుత్వం ద్రుష్టి సారించిన సోలార్ ఎనెర్జీ

రచన: నూతక్కి రాఘవేంద్ర రావు.

Dt: 27-02-2010

2010/11 వ సం/ బడ్జెట్లో భారత ప్రభుత్వం సాంప్రదాయేతర ప్రక్రియలైన సౌర మరియు పవన విద్యుత్తు వ్యవస్తల వైపు పెద్ద ఎత్తున ద్రుష్టి సారించినట్లు కనబడుతోంది .ఇది అందరం అహ్వానించ దగ్గ పరిణామం.ముదావహం.లోగడ యెన్నో పర్యాయాలు నా బ్లాగుల్లో యీ విషయం పై నా గోడు వెల్లడించిన సందర్భాలున్నాయి.యీ ప్రక్రియలపై చిత్త శుద్ధితోప్రభుత్వాలు నిబద్ధతతో వుంటే సామ్ప్రదాయ, అణు ఇంధన వనరులకొరకు విదేశాలపై ఆధార పడవలసిన అవసరం వుండదు.మన యింధన వనరులను ఎగుమతి చేసి ఆర్ధిక స్వావలంబన పొందవచ్చు. అణు ఇంధనం, ఆయిలు ఇంధనం కొరకు దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్ట వలసిన అవసరం వుండదు.

వికేంద్రీక్రుత రీతిలో యీ ప్రక్రియ కొనసాగాలి. భారీ విద్యుత్ ప్రోజెక్టుల నిర్మాణం వైపు కాకుండా అందుకై వెచ్చించే ధనాన్ని సోలారుకిట్లపై, వెచ్చించి ప్రతి యింటా ప్రభుత్వ ఖర్చు పై వాటిని స్థాపించాలి . తొలుత కిట్లు దిగుమతి చేసుకున్నా తదుపరి ఆయా వుత్పత్తిదారులను భారత్ కు ఆహ్వానించి, భారత్ లోనే వుత్పత్తిని ప్రోత్సహించాలి.

ప్రతి యింటి అవసరానికి మించి వుత్పత్తిఅయ్యే విద్యుత్తును ప్రభుత్వం తానే తీసుకొని తన భారీ అవసరాలకు వినియోగించవచ్చు. సోలార్, మరియూ పవన విద్యుదుత్పత్తికై ప్రతి పరిశ్రమలోనూ నిర్బంధ విధానాన్ని ప్రవేస పెట్టాలి.

గాలీ ,సూర్య రశ్మీ విరివిగా లభించే భారత దేశం వంటి దేశాలలో యీ ప్రక్రియలు దిగ్విజయమౌతాయి.

శాస్త్ర సాంకేతికపరిగ్నాన లభ్యత, యంత్ర పరికరాల లభ్యత, అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు వెంటనే ప్రారంభిస్తూ ,సాంకేతిక ప్రతిభ గల మానవవనరులను అభివ్రుద్ధి పరచ వలసిన కార్యక్రమం వెనువెంటనే చేపట్టవలసిన భాద్యత ప్రభుత్వాలపై వుంది. కెనడాలోలా,జెర్మనీలోలా ,ప్రతి యిల్లూ ఓ విద్యుదుత్పత్తి కేంద్రం గా ప్రభుత్వాలు మార్చగలిగితే

నిరంతర విద్యుత్ అంతరాలనుండి విప్లవాత్మక విశ్రాంతి లభించి విద్యుత్ పరికరాల వినియోగం ప్రతి యింటా పెరుగుతుంది. ఆయా గ్రుహవినియోగ విద్యుత్ పరికరాల వుత్పత్తుల తయారీ పరిశ్రమలూ పెరుగుతాయి..సోలార్,పవన విద్యుత్ వుత్పాదక పరికరాల కై పరిశోధనాలయాలూ తద్వారా పరిశ్రమలూ, సాంకేతిక పరిగ్నానం రుగుతుంది.వుపాధి అవకాశాలూ పెరుగుతాయి.నిరుద్యోగ సమస్య తగ్గి దేశ ఆర్ధిక పరిస్థితి పురోగమనంలో సాగుతుంది.

పురుషాధిపత్యం

(యింకానూ యికపైనా సాగును)

రచన : నూతక్కి

తేదీ:24-02-2010

పురుషాధిపత్య

అహంకార ధోరణుల

పీడనలో……

అధునికులమనుకున్నా

యీనాటికీ

పడతో,వనితో,

యింతో, నారో..స్త్రీ యో ….

యీడే జన్మించిన యామె

 జన్మస్థలికే జన్మతహా

ఆ…డది

ఆత్మీయులకు,

ఆత్మీయతకు

అందనంత దూరం …

పెళ్ళనే పేరుతో

పెడగా పంపబడుతు

అనుబంధం అత్మీయత

అణుమాత్రం తరగనిఆమె….

పెడధోరణి మానని

సమాజపు తీరులు….

జననంలోవాడైతే

జన్మస్తలిపై జన్మతహా హక్కు

కూడైనా పెట్టని

వాడితో కునారిల్లుతూ…వీడు.

పున్నామ నరకమనే

 నమ్మకాల సుడిలో…..

 అమ్మో, అక్కో,

భార్యో,చెల్లో,బిడ్డో

,మనుమరాలొ అత్తో,

అమ్మమ్మో, నాన్నమ్మో,

వదినో, మరదలో

 వరసలు యేమైతేనేం

ఆడది ఆ…..డ దంటు

ఆస్తులు అందని

దూరాలకు తరిమేస్తూ

 అడ కు ఆడే

శత్రువఔతు

బండ్లగూడాలు

 (భాగ్యనగరి చుట్టూరా)

 రచన:నూతక్కి

 తేది :18 – 02 -2010

ఒకప్పటి చెక్ పోస్టులు

 భాగ్య నగరికి

బండ్లగుడాలు

 భా గ్య నగరికి

వచ్చే రహదారులకన్నిటా

 షుమారుగా నగరానికి

పదికోసుల దూరంలో

 భద్రతకు భద్రత గా

ఆదాయానికి వనరుగా

 ఎగుమతులపైన

దిగుమతులకైన

నిఘా వ్యవస్తకై

నగర ప్రజా జీవికకై

బండ్లపైన రవాణా

 బండి నడిపిన బళ్ళు

 లాగిన జీవుల

 విరామస్తలి

 బండ్లగుడా

రహదారులన్నిటిపైనా

ఆమ్యామ్యాలలో హస్తలాఘవం

 రచన :నూతక్కి

తేదీ: 25-02-2010

 అధికారులు

హస్తాక్షరం చేసిన

 హస్తానికి

తెలియదు పాపం

 ఆఖరుకు

 అడిగినంతా

దండుకొని

బహిరంగంగా

 రెండో చేయి

 దాచిన

ముడుపులసంగతి.

కర్మాగారం

 రచన: నూతక్కి

 తేది: 19-02-2010

 ప్రణాళికలు

 ద్రవ్య లభ్యతలు

 స్థలసౌలభ్యం

మౌలిక వనరులు

 ముడి పదార్ధములు

 నిపుణుల లభ్యత

 శక్తిని క్రొవ్వొత్తిలా

 కరిగించే నేర్పరులా

కార్మిక శక్తుల

అనుబంధంలో

వినూత్న తీరులు

 భవనం

యంత్రం

 ఇంధనం

ముడిసరుకు

 జలవిద్యుద్వనరులు

 వుత్పాదనా

 విధానములు

 యాజమాన్య

 విధి విధాన

సంవిధాన

నవీన రీతుల

అవగాహనలు

ప్రమాణముల

 నిశిత పరీక్షణలు

 పరిశోధనలు

 సంశోధనలు

వుత్పత్తుల

అమ్మకాలలో

నవ్యపోకడలు

కావాలోయ్

నవకర్మాగారం

నడపాలంటే

నడవాలంటే

అడకత్తెరలో పోకచెక్కలు

రచన :నూతక్కి

 తేది: 25-02-2010

నిగూఢంగా

 పైసలు

చేతిలోపడకుంటే

యింటి ప్లానుపై

అధికారిక ముద్ర పడదు

 నిర్మాణపు

పునాదులప్పుడు

కానరావు.

నిర్మాణ పర్యవేక్షణలు

 దబ్బు దండుకోడానికి

మాత్రం నిరంతర

పర్యవేక్షకులు

 విధినిర్వహణా

వైఫల్యంలో

తప్పులెన్నయినా

 చేసుకో మేమున్నామని

 ప్రోత్సాహాన్నందిస్తూ

 జేబులు నింపుకొనే

 పనిలో తప్పులు చేస్తూ

తప్పులు చేయిస్తూ ….

ఆయా అధికారులు

 క్రమబద్ధీకరణ నెపంతో

 తప్పులన్నీ ఒప్పులుగా

మార్చేస్తామని

 లంచాలు మేసినోళ్ళ

 నేమీ చేయలేక

ప్రజలనేబ్లాక్ మైల్ చేసి

 డబ్బు దోచుకొంటూ

 ప్రజా ప్రభుత్వాలు

 అనుక్షణం

 అనిశ్చితిలో

 కాసు కాసు కూడ గట్టి

ఎకడెక్కడొ రుణాల్దెచ్చి

 గూడు కట్టినట్టి ప్రజలు…..

అడకత్తెరలో పోకచెక్కలు

కబుర్లలోపడి…ఓరోజు

(పిచ్చాపాటి కబుర్లు ….1)

 రచన: నూతక్కి

 తేది:25-02-2010

 ఈ మధ్య నా కంప్యూటర్ కు చాల సుస్తీ చేసింది. హాస్పిటల్ లో అడ్మిట్ చేయక తప్పలా. సడెన్ గ ఒక రాత్రి కంప్యూటర్ మీద తెలుగు కంపైలర్ చలవతో చల్లగా ఓ తెలుగు కవిత రాసుకొంటుంటె, దొంతర్లు దొంతరులుగా ఒక దాని మీద ఒకటి పేజీలు.గుంయ్ గుంయ్ మంటా ఒకటే అరుపులూ … యేమి చెయ్యాలో నాకు పాలు పోలా. వెంటనే ఆడియో ఆపు చేసా.అప్పటికే మా ఆవిడ లేచొచ్చి,యేంటండి రెండయినా యింకా పడుకోకుండా అని చిరాకు చూపేసి వెళ్ళిపోయింది. యింతలోనే, పక్క పోర్షన్లో అద్దెకుండెవాళ్ళు …వాళ్ళు లేచి యేమయ్యిందంకుల్ ? ఎంక్వైరీ….. ఏమీ లేదు మీరు పడుకోండని…అసలే యేం చేయాలో నాకేమీ పాలుపోక నేనేడుస్తోంటే వీళ్ళొకళ్ళూ, టకటక మీటలన్ని నొక్కేసి కరెంటు,ఇంటర్నెట్టూ కూడ పీకేసి గమ్మున కాసేపు కూర్చొని,చేసేదెమీలేక పోయిపండుకొన్నా.నిద్రపట్టదాయె. కష్టపడి టైప్ చేసిందంతా పోయిందని బెంగ.అదీ తెలుగులోనాయె. ఒక సారొచ్చిన అయిడియామళ్ళ మళ్ళ రమ్మంటె రాదుకదండి.అందుకే బెంగ. మళ్ళా లేచొచ్చి అన్నీ కనెక్ట్ చేసి చూస్తే అసలు లోనికే పోనీయలా.ఏదో అయ్యింది దానికి. .ఎదేదో సంకేతాలు.తెలుగే సరిగ రాయలేనోడికి ఇంగ్లీసేడొస్తది చెప్పండి.ఆ రాత్రంత దిగులుగానె పండుకొన్న. నిదర పడితేనా? తెగ కష్టపడి రాసిందంత పోయిందికదా. ఈమధ్య నా బోటోళ్ళు తెలిసీ తెలియకుండ కంప్యూటర్ లు వాడుతున్న వాళ్ళుచాల పెరిగిపోయారుకద, అదేలెండి అమెరికాలొ పిల్లలున్నాళ్ళు ఎక్కువయ్యారు కద. ఈమెయిల్ చేసుకోవడం,చదవడమ్ వరకు వాళ్ళకు బాగానే వస్తం ది గాని, యింకేదొ చెయ్యాలన్నప్పుదే అసలు సమస్యంతా.( అట్లాంటిదే నేనూ యేదో చేసుంటాలెండి. ) వాళ్ళకి అన్నీ అనుమానాలే ప్రతీ దానికీ డాక్టర్ దగ్గరికి పోక తప్పదు.(అదేలెండి కంప్యూటర్ క్లినిక్ కు).పిల్లలికి ఫోన్ చేసి అడిగితే త్యుటోరియల్ తీసుకోమంటారు. యీ వయసుకి యింక ఆసోకు కూడా. కొత్తగా పిల్లని కన్న అమ్మకి పెంచేతప్పుడు ప్రతిరోజూ ఒచ్చినన్ని అనుమానాలొస్తయ్ వాళ్ళకి . యేది నొక్కితే యేమౌతుందో నని భయం. అట్లని నొక్కకుండా వుండలేరు. వాళ్ళకోసం కంప్యూటర్ చికిత్సాలయాలు కూడ మెండుగ వెలిసినయ్. సమస్యతో వచ్చిన వాడికి యేమి తెలియదని వాడికి తెలుసు.సమస్య యేమీ లేకున్నా బాగానే గుంజడం నేర్చుకున్నారు.యేదైతే అది అయ్యిందని మా దగ్గర్లోనె మావాడి క్లినిక్ వుంది. అక్కడికి పొద్దున్నే పోతినిగద,నా ఆత్రం నాదాయె. అక్కడ కాంప్లెక్స్ వాచ్మెన్ షాప్ పదింటికి తీస్తారని చెప్పాడు. …..యీ సొదంతా చెప్పి మిమ్మల్ని విసిగించడం యెందుకులెండి…….. అట్లా.వాడు బాదిన వీర బాదుడు తో .నా బాధలేవో నేను పడ్డాగా… ఎట్లాగైతేనేం, డీ ఫార్మేటింగ్,రీ ఫార్మేటింగ్,విండోసనీ వాడి బొచ్చెనీ, బోలనీ,ఓ నాలుగువేలు ఒదిలించుకొని ,హాస్పిటల్ నుంచి మా కంప్యూటర్ ను మొన్నీమధ్యే యింటికి తెచ్చాం. . మనిషికి లాగే వీటికీ .వింత వింత వైరసులూ,రోగాలున్నూ. అదనీ యిదనీ ఓ నాలుగు వేలు తుప్పొదిలిందనుకోండి.ఇప్పుడు కొంచెం బెటరనుకోండి.

ఎందుకనో గానండి నా బ్లాగు రోజు చూసి కామేంటేసేవోళ్ళు సడ్డెన్ గా చూడ్డం,కామెంటేయడం మానేసారండి.నా బ్లాగొకటుందని ప్రెపంచానికి చెప్పింది వాళ్ళ కామెంట్లేనండి. యిప్పుడిట్లా చెయ్యడం అన్నాయం కాదేంటండి? జబ్బు పడ్డ కంప్యూటర్లకు మైల్ పంపితే తమ కంప్యూటర్లు గూడ జబ్బుపడతాయేమోనని వాళ్ళకు.భయమేమోనండి. మన కంప్యూటర్ జబ్బు పడితే వాళ్ళకు తెలుస్తుందాండి? యేమో ఆ మాత్రం మనమైనా అర్ధం చేసుకోవాలి గదండి మరి.

బ్రౌజింగ్ సెంటర్లు అందుబాటులో వున్నా చేతిలో సిస్టం వున్నంత వీజీ యేం కాదండి అయిడియా.రాగానె ఎక్కించెయ్యడానికి. కాగితం పైన కలం పెట్టి ఎన్ని రోజులయ్యిందండి? తప్పులు కొట్టివేతలు, పేపర్లు వుండలు చుట్టి చెత్త బుట్ట నింపడాలు,పెన్నులు రాసీ రాయక …. ఎవడు కనిపెట్టాడొ గానిండి,యీ ట్రాన్స్లిటరేషన్ సదుపాయం వుంది చూశారూ అధ్భుతం అనుకోండి.అంతా కంప్యూటర్ మీదే కదండి రాయడం అదీ తెలుగులో కాగితాలూ పెన్నులూ ఎందుకండీ. . అసలు యీ బ్లాగ్ అన్న ప్రక్రియ వుంది చూశారూ అందులో అ ఆలు నేర్సుకున్న కాడికెల్లి ఎవడికాడు మహా కవినో, రచయితనో అనుకొనే సదుపాయం యిక్కడ వుందండి. తెలియకుండానే కొమ్ములొస్తుంటాయండి……అందులో కామెంట్లెక్కువొస్తె కొండెక్కిస్తాయండి….

అయ్యెయ్యో !!….మాటల్లో పడి పోయానండి…. ఏదొ వాసనొస్తాందండి . గ్యాసు వాసనలా వుంది. మరిచే పొయా…. స్నానానికెళతా పొయ్యిమీద పాలు చూడమందండి మాఆవిడ .అంతా అయిపోయింది. పాలు పొంగి స్టౌవ్ ఆరిపోయి గ్యాసు వాసన ఒస్తాంది.పాలు సింకు లోకి ఆనందంగా పరుగిడుతున్నాయ్.కిచెన్ ప్లాట్ఫారం మీద ,గ్రానైట్ పరిచినవాడిని మెచ్చుకోకుండా వుండలేకపోయాను. తిన్నగా సింకులోకే స్లోప్ పెట్టినందుకు. రెండు లీటర్ల పాలు మొత్తం సింకు పాలు.. యింకా కాఫీ కూడ తాగలేదండి. హొల్ మిల్క్…..యేమ్ చెస్తాం కిలో మీటర్ దూరమెళ్ళి తెచ్చిన పాలు..? మళ్ళీ అంత దూరం వెళ్ళి రావాలి. కాఫీకైనా తప్పదుకదా. . గిన్నె మాడిపోయివుంది……….గ్యాసు ఆపి అట్లాగే నిలబడ్డా. నా కంప్యూటర్ కొచ్చిన జబ్బుగురించి మీకు చెబుతూ యిప్పుడు నాకీ దుస్థితి. ……. మా ఆవిడ వస్తే ఆవిడ ముందు నా గతేంటి? చేసేదేముంది? నా తిట్లు నే తింటా, నా తిప్పలు నే పడతా.

శ్రీ శ్రీ లో

స్వామి శ్రీ వివేకానందుని వుధ్భోదలు

 ( మహా కవి శ్రీ శ్రీ మహాప్రస్తాన గీతరచనకు ఎంతవరకు స్ఫూర్తి ?)

(యిరువురి భావనలలో సామ్యం…నాలో కలిగిన ఓ చిన్న సంశయం ….నూతక్కి)

 రచన:నూతక్కి

 భారత దేశం మన మాత్రుభూమి

 అన్న అంశం పై చర్చిస్తూ

స్వామీజీ అంటారూ…

కర్షకుల గుడెసెలనుండి

నాగలి చేతబూని

నవ్య భారతం లేచి రావాలి.

 చేపలుపట్టే,

చెప్పులుకుట్టే,

వీధులు వూడ్చే,

సామాన్యుల

గుడిసెలనుంచి

 నవీన భారతం

 లేచి రావాలి,

చిల్లర వస్తు

దుకాణాలనుండి,

సంతల నుండి,

 బజార్లనుండి

 కర్మాగారాలనుండి,

నవ్య భారతం

 బైటకు రావాలి.

 అడవులు కొండలు

గుట్టలనుండి

నవీన భారతం

లేచి రావాలి. …

అని అంటారాయన.

 మరోచోట “పిరికివాడు,పనికిమాలినవాడు మాత్రమే ఇది విధివ్రాత అంటాడని సుభాషితాలు చెబుతున్నాయంటూనే,ముసలితనం పైబడుతున్నవారే విధిని గురించి మాట్లాడుతారని యీసడిస్తారు. యువకులు అలా కాదని వారిని ప్రశంసిస్తున్నట్లు నా కర్మకు నేనే కర్తను అని అనేవాడే ధైర్యవంతుడంటారు స్వామి శ్రీ వివేకానంద..

 శ్రీ శ్రీ ,మహాప్రస్తాన గేయంలొ …..

ఎముకలు క్రుళ్ళిన

వయసు మళ్ళిన

సోమరులారా! చావండి.

అని అంటూనే……

 నెత్తురుమండే,

శక్తులు నిండె

 సైనికులారా రారండి!

 అని పిలుపునిస్తాడు…..

 బాటలు నడచీ,

పేటలు కడచీ,

కోటలన్నిటిని దాటండీ:

నదీనదాలూ,

అడవులు కొండలు,

ఎడారులా మనకడ్డంకీ

అంటూ మహా కవి శ్రీ శ్రీ వుధ్భోధ చేస్తాడు . యిరువురూ నవసమాజ నిర్మాణంలో యువకుల భాధ్యతను తెలియచెప్పి ప్రోత్సహిస్తూ వ్రుద్ధులను కార్యోన్ముఖులైన యువకుల మార్గానికి అడ్డురావద్దంటున్నారు. కుల, మత, వర్గ, ప్రాంత, విభేదాలులేని నవ సమాజానికి పిలిపునందించారు.

శీలం

 (స్వామి శ్రీ వివేకానంద సూక్తి )

 సేకరణ : నూతక్కి

 ఒక వ్యక్తి శీలాన్ని అతను చేసిన ఘనకార్యాలతో నిర్ణయించ రాదు.ఒక మహావ్యక్తి శీలాన్ని తెలియజెప్పేవి అతను చేసే అతి సాధారణమైన పనులే. వ్యక్తి అతడెలాటి స్థితినందున్నాఒకేరీతి విశిష్టంగా వుంటాడో అతడే వాస్తవంగా గొప్ప వాడు….స్వామి వివేకానంద

యీర్ష్యా ద్వేషాలు

(స్వామి శ్రీ వివేకానంద సూక్తి )

 సేకరణ: నూతక్కి

నీవు గనుక యీర్ష్యా ద్వేషాలు వెలిబుచ్చితే అవి చక్ర వడ్డీతో సహా నీమీదికే మరలి వస్తాయి.ఇది నీవు గుర్తిస్తే చెడుపనులు చేయకుండా అది నిన్ను నిరోధిస్తుంది.

తర్వాత పేజీ »